Is Kerintha Movie Actor Sumanth Ashwin Marriage Fix With Deepika? - Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో!

Published Tue, Feb 2 2021 6:14 PM | Last Updated on Tue, Feb 2 2021 6:47 PM

MS Raju Son, Hero Sumanth Ashwin To Tie The Knot - Sakshi

ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్‌ఎస్‌ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కాలం కాబట్టి తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్‌లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్‌ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే! (చదవండి: మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస)

ఇక సుమంత్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. తండ్రి ఎమ్‌ఎస్‌ రాజు డైరెక్షన్‌లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాకొట్టింది. తర్వాత ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో కొంత బూస్ట్‌ వచ్చినట్లైంది. ఇక మూడో చిత్రం 'లవర్స్'‌ మాత్రం అతడికి కమర్షియల్‌ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్‌ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్‌ అయిన నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement