Hero Sumanth Ashwin And Deepika Kanumuri's Mehndi Photos Goes viral - Sakshi
Sakshi News home page

హీరో సుమంత్‌ అశ్విన్‌ హల్దీ ఫంక్షన్‌.. ఫొటోలు వైరల్‌

Published Fri, Feb 12 2021 4:34 PM | Last Updated on Fri, Feb 12 2021 4:45 PM

Hero Sumanth Ashwin Haldi Function Photos Goes Viral - Sakshi

ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఎకైక కూమారుడు, యువ హీరో సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయి మెడలో శనివారం(ఫిబ్రవరి 13)సుమంత్‌ మూడుముళ్లు వేయనున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఈ కొత్త జంట హల్దీ ఫంక్షన్‌ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్‌లో సుమంత్ ‘కేరింత’‌ మూవీ సహా నటుడు విశ్వంత్‌, మరికొందరు నటీనటులు సందడి చేశారు. (చదవండి: దీపికతో సుమంత్‌ అశ్విన్‌ వివాహం)

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌ పట్టణ శివారులోని వారి ఫాంహౌజ్‌లో సుమంత్‌-దీపికల వివాహ మహోత్సవం జరగనుంది. ‘తూనిగ తూనిగ’ మూవీతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సుమంత్‌ ఆ తర్వాత ‘కేరింత’, ‘లవర్స్’‌, ‘ప్రేమకథా చిత్రం-2’ లలో హీరోగా నటించాడు. తాజాగా సుమంత్‌ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది. (చదవండి: ‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement