Mahesh Babu Okkadu Movie Child Artist Baby Niharika Present Life Story And Unknown Things In Telugu - Sakshi

Child Artist Baby Niharika Real Life Story: ‘ఒక్కడు’లో మహేశ్‌ చెల్లెలు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?

Jun 7 2022 4:32 PM | Updated on Jun 7 2022 5:22 PM

Mahesh Babu Okkadu Movie Child Artist Baby Niharika Present Life Story In Telugu - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌లుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగినవారు చాలామంది టాలీవుడ్‌లో ఉన్నారు. రాశి, శ్రీదేవి, మీనా లాంటి హీరోయిన్లు.. చైల్డ్‌ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్‌గా మారుతారని గ్యారెంటీ లేదు. పెద్దయ్యాక సినిమాలకు గుడ్‌బై చెప్పి, పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటివారిలో ఒకప్పటి చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నిహారిక కూడా ఒక్కరు. 

నిహారిక అంటే ఎవరు గుర్తుపట్టరు కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తింది కదా? ఈ మూవీలో ‘ఒరేయ్‌ అన్నయ్యా..’ అంటూ మహేశ్‌ను ఆటపట్టించిన అల్లరి చెల్లి ఆశ గుర్తొచ్చిందా? ఆ అల్లరి పిల్లనే బేబీ నిహారిక.

ఆమె అప్పుడు బేబీ కానీ ఇప్పుడు మాత్రం..ఇద్దరు పిల్లల తల్లి. వెంకటేశ్‌ ‘ప్రేమించుకుందాం రా’, మోహన్‌ బాబు ‘యమజాతకుడు’తో పాటు పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన నిహారిక.. ‘ఒక్కడు’ చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే దృష్టి సారించింది.పదేళ్ల క్రితం పొలిటికల్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు.

Okkadu Movie Child Artist Niharika Real Life Story

అసలు నిహారిక సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒక్కడు మూవీ ఆఫర్‌ ఎలా వచ్చింది? ఆమెది ప్రేమ వివాహామా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? ప్రస్తుతం నిహారిక ఏం చేస్తున్నారు? మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తదితర విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement