
మహేశ్‌బాబు మారబోతున్నారు. అవును.. కొత్త లుక్‌లోకి మారబోతున్నారని సమాచారం. ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేశ్ ఓ చిన్న బ్రేక్ తీసుకుంటారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త లుక్‌లోకి మారడానికే ఈ చిన్న విరామం అని తెలిసింది. ఈ మార్పు తన 27వ సినిమా కోసం అట. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని టాక్. ఇందులో మహేశ్ కొత్త లుక్‌లో కనిపించడం మాత్రమే కాదు.. నాలుగు భాషల తెర మీద కనిపించనున్నారని భోగట్టా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ప్యాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ‘కేజీఎఫ్’కి సీక్వెల్‌గా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న ‘కేజీఎఫ్ 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. మహేశ్‌తో చేయబోయే సినిమా మేలో ఆరంభం అవుతుందట.