సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్న మహేశ్ తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేశ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో ఆ పిక్ వైరల్‌గా మారింది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment