Hakim aalim
-
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్‌బాబు.. వైరల్ అవుతున్న ఫోటో
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్న మహేశ్ తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేశ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో ఆ పిక్ వైరల్‌గా మారింది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
మహేశ్ బాలీవుడ్ ఎంట్రీ ; నమ్రత క్లారిటీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలం నుంచి మహేశ్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఓసారి మహేశ్ మాట్లాడుతూ.. తనకు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని కానీ తనకు ఆసక్తి లేదని తెలిపారు. తాజాగా మహేశ్ ముంబైలో కనిపించడంతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. కాగా ఈ వార్తలపై నమ్రత ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడారు. మహేశ్ బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. యూరప్ ట్రిప్ ముగించుకుని వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 25వ సినిమా లుక్ టెస్ట్ కోసం మహేశ్ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీంను కలవడానికే ముంబైలో ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకానీ ఏ బాలీవుడ్ నిర్మాతను కలవలేదని ఆమె వెల్లడించారు. మహేశ్ 25వ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. -
ప్రభాస్ సాహో లుక్ ఇదేనా..?
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. బాహుబలి రిలీజ్ తరువాత నెల రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేసి వచ్చిన డార్లింగ్, ఇప్పుడు మేకోవర్ మీద దృష్టి పెట్టాడు. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ ఫోటో ఒకటి సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీం ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పేజ్‌లో షేర్ చేశాడు. కాస్త సన్నబడి, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ లుక్ నెక్ట్స్ సినిమా సాహో కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. 150 కోట్ల బడ్జెట్‌తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తుండగా హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.