Actress Sangeetha Shocking Comments On Sarileru Neekevvaru Movie - Sakshi
Sakshi News home page

Actress Sangeetha: ‘‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్‌ అయ్యింది’

Published Tue, Sep 6 2022 8:46 PM | Last Updated on Thu, Sep 8 2022 11:49 AM

Actress Sangeetha Shocking Comments On Sarileru Neekevvaru Movie - Sakshi

నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఖడ్గం మూవీతో ఒకే ఒక్క చాన్స్‌ అంటూ అమాయకపు మాటలతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరిగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. 

చదవండి: హాట్‌టాపిక్‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ పారితోషికం, ఎవరెవరికి ఎంతంటే..!

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆడపదడపా చిత్రాలు చేస్తూ.. పలు డాన్స్‌, కామెడీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ‘మసూద’ అనే హార్రర్‌ చిత్రంలో నటిచింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె సరిలేరు నీకెవ్వరు మూవీ, ఆ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌కి తల్లిగా చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌కి మదర్‌గా చేయడం ప్లస్‌ అయ్యిందా? మైనస్‌అయ్యిందా? అని హోస్ట్‌ ప్రశ్నించగా.. రెండూ అని సమాధానం ఇచ్చింది.

చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్‌ అయ్యింది: సంగీత షాకింగ్‌ కామెంట్స్‌

ఆ తర్వాత అనిల్‌ రావిపూడి వచ్చి తనకు కథ వివరించారని చెప్పంది. ఇక ఇప్పుడు అనిల్‌ని చూస్తే ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తింటుకుంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సంగీత. ఆ తర్వాత అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సంగీతని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరులో సంగీత హీరోయిన్‌గా తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement