దసరా సరదాలు | Telugu films are set to release this Dussehra | Sakshi
Sakshi News home page

దసరా సరదాలు

Published Tue, Oct 8 2019 12:15 AM | Last Updated on Tue, Oct 8 2019 5:27 AM

Telugu films are set to release this Dussehra - Sakshi

‘వెంకీ మామ’లో పాయల్, వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా

దసరా పండగ వచ్చింది. సినీ ప్రియులకు కూడా పండగ తెచ్చింది. పలు సినిమాల అనౌన్స్‌మెంట్లు, ముహూర్తాలు, కొత్త లుక్స్‌ రిలీజ్‌తో సరదాలు తెచ్చింది. వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ చిత్రం ‘వెంకీ మామ’ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ట్రాక్టర్‌ మీద జంటలతో మామాఅల్లుళ్ల సందడి చూడొచ్చు. మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో...’ దసరా స్పెషల్‌ లుక్స్‌ రిలీజ్‌ అయ్యాయి.

‘నిశ్శబ్ధం’లో మాధవన్‌ మ్యూజీషియన్‌ ఆంథనీలా కనిపించనున్నారు. ఇందులో అనుష్క ముఖ్య పాత్ర చేస్తున్న  సంగతి తెలిసిందే. సుబ్బు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సాయితేజ్‌ ‘సోలో బతుకే సో బెటర్‌’ అనే సినిమా ముహూర్తం జరిగింది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. రాజ్‌ తరుణ్, షాలినీ పాండే జంటగా చేస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ లుక్‌ విడుదల అయింది. నందినీ రెడ్డి కొత్త చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దసరా సందర్భంగా నేడు మరికొన్ని చిత్రాల టీజర్‌లు, ట్రైలర్లు విడుదలకానున్నాయి.


 ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్‌,  ‘నిశ్శబ్ధం’లో మాధవన్‌


 ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్‌బాబు


  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సాయి తేజ్‌
 

రాజ్‌ తరుణ్‌, షాలినీ పాండే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement