‘నో కన్ఫ్యూజన్‌.. చెప్పిన డేట్‌కే వస్తున్నారు’ | Sarileru Neekevvaru And Ala Vaikunthapurramuloo Movies Release Date Fix | Sakshi
Sakshi News home page

‘నో కన్ఫ్యూజన్‌.. చెప్పిన డేట్‌కే వస్తున్నారు’

Published Sat, Jan 4 2020 7:21 PM | Last Updated on Sat, Jan 4 2020 7:58 PM

Sarileru Neekevvaru And Ala Vaikunthapurramuloo Movies Release Date Fix - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’ వంటి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై సినీ ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాలకు సంబంధించిన టీజర్లు, పాటలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే సంక్రాంతి రేసులో నువ్వా-నేనా అన్నట్లు ఉన్న ఈ చిత్రాల విడుదల తేదీపై గందరగొళం ఏర్పడింది. 

ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 11న మహేశ్‌ సినిమా, జనవరి 12న బన్ని చిత్రం విడుదల కావాలి. అయితే న్యూఇయర్‌ విషెస్‌ తెలుపుతూ రిలీజ్‌ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ కనిపించలేదు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మార్చాలని నిర్మాతలు భావించారని దీంతో బన్ని మూవీ కూడా జనవరి 11నే వస్తుందని సోషల్‌ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అటు సూపర్‌ స్టార్‌.. ఇటు బన్ని అభిమానుల్లో ఆయోమయం ఏర్పడింది.  దీంతో ఇరు చిత్రాల నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’  , 12న అల.. వైకుంఠపురములో రిలీజ్‌ అవుతున్నట్లు ఇరు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్‌ వీడింది. 

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘సమస్య సాల్వ్ అయింది. ముందు అనుకున్న డేట్స్  ప్రకారమే సరిలేరు నీకెవ్వరు (జనవరి 11న), అల.. వైకుంఠపురములో (జనవరి12న) సినిమాలు వస్తున్నాయి. ఈ రెండింటితో పాటు మరో నాలుగు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. అన్నీ బాగా ఆడాలి’ అని దిల్‌ రాజు ఆకాంక్షించాడు. ‘అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ప్రొడ్యూసర్స్ గిల్డ్స్‌ పరిష్కరించింది. . అందరూ కన్వీన్స్‌ అయ్యారు. హ్యపీగా వారు ముందనుకున్న ప్రకారమే ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి’అని మరో నిర్మాత దామోదర ప్రసాద్‌ పేర్కొన్నారు.  ఇక రిలీజ్‌ తేదీపై ఏర్పడిన ఈ సమస్యకు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్స్‌లో పరిష్కారం లభించింది.

చదవండి:
‘సామజవరగమన’.. మరింత ‘అందం’గా!
‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement