మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, చిత్రంలో సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు సినీ పరిశ్రమ రావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మహేష్‌బాబు నచించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యాటక అందాలు ఉన్నాయన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా విజయవంతం కావాలని కోరారు. నిర్మాత అనిల్ సుంకరి మాట్లాడుతూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామన్నారు. విశాఖ ఉత్సవ్ పురస్కరించుకుని సి నిమాలో ఓ పాటను విడుదల చేసినట్టు తెలిపారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భీమిలి, అరకు తదితర ప్రాంతాల్లో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు. నిర్మాత శిరీష్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
అలరించిన దేవిశ్రీ ఆట.. పాట
విశాఖ ఉత్సవ్ భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి అలరించింది. పాటలు పాడి.. స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రధాన వేదికపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రావ్య, మానస, ధర్మేష్ నృత్యాలు బాగా నచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment