Dhamaka movie played instead of Das Ka Dhamki in Vizag theatres - Sakshi
Sakshi News home page

Das Ka Dhamki: ‘దాస్‌ కా ధమ్కీ’కి బదులు రవితేజ ధమాకా ప్రదర్శన.. ప్రేక్షకుల రచ్చ రచ్చ..

Published Wed, Mar 22 2023 3:55 PM | Last Updated on Wed, Mar 22 2023 4:23 PM

Ravi Teja Dhamaka Movie Played Instead Of Das Ka Dhamki in Vizag Theatres - Sakshi

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఉగాది కానుకగా ఈ మూవీ మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్‌ సేన్‌ తొలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా చూసేందుకు ఆశగా వెళ్లిన ప్రేక్షకులకు షాక్‌ తగిలింది. తెరపై మూవీ పడగానే ఆడియన్స్‌ అంత ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ సినిమాకు బదులుగా మరో సినిమా వేయడంతో అంతా గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని సుకన్య థియేటర్లో నేడు రిలీజ్‌ అయిన దాస్‌ కా ధమ్కీ మూవీకి బుదులుగా రవితేజ ధమాకా చిత్రాన్ని వేశారు. కొత్త సినిమా అని వెళ్లిన ఆడియన్స్‌కి పాత సినిమా టైటిల్‌ కనిపంచడంతో రచ్చ రచ్చ చేశారు. అది గ్రహించిన థియేటర్‌ యాజమాన్యం వెంటనే తప్పును సరిదిద్దుకుంది. వెంటనే ‘దాస్‌ కా ధమ్కీ’ మూవీ ప్రదర్శించడంతో ప్రేక్షకులంతా కూల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో  పలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ధమ్కీ ఇచ్చిన దాస్‌’ అంటూ తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement