విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఓ పిల్లో అంటోన్న మాస్‌ కా దాస్! | Vishwak Sen Latest Movie Mechanic Rocky Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Mechanic Rocky Song: విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఓ పిల్లో అంటోన్న మాస్‌ కా దాస్!

Published Wed, Sep 18 2024 3:11 PM | Last Updated on Wed, Sep 18 2024 3:25 PM

Vishwak Sen Latest Movie Mechanic Rocky Lyrical Song Out Now

మాస్‌కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటిస్తోన్న తాజా చిత్రం మెకానిక్ రాకీ.  ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.

(ఇది చదవండి: 'మెకానిక్‌ రాకీ' గ్లింప్స్‌.. ఎల్‌ అంటే సరికొత్త చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్‌)

'ఓ పిల్లో.. బీటెక్‌లో నేను మిస్సయ్యానే కొంచెంలో' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణచైతన్య లిరిక్స్ అందించగా.. నకాశ్ అజీజ్‌ ఆలపించారు. కాగా.. ఈ చిత్రాన్ని ముక్కోణపు ప్రేమకథగా రూపొందిస్తున్నారు. అంతేకాకుండా మాస్‌ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement