Das Ka Dhamki Movie
-
Pranati Rai Prakash: దాస్ కా ధమ్కీ ఫేమ్ ప్రణతి రాయ్ ప్రకాష్ స్టన్నింగ్ ఫోటోలు
-
వరస సినిమాలు తో దూసుకుపోతున్న విశ్వక్
-
దాస్ కా ధమ్కీ వల్ల మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ
-
దాస్ కా ధమ్కీ సీక్వెల్ వచ్చేస్తోంది...హీరో,హీరోయిన్లు ఎవరంటే?
-
మీరు ఊహించినా దానికంటే ఎక్కువే ఉంటుంది: విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే 'దాస్ కా ధమ్కీ' మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టినా.. అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ. .'దాస్ కా ధమ్కీ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్. ఇంతగా ఆదరణ పొందుతున్న సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. అది మీరు ఊహించినా దాని కంటే పది రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు ఓటీటీలు వేదికలుగా మారాయి. తనకు ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. మరో 3 సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.' అని తెలిపారు. (ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే) తెలుగు సినీ అభిమానులు అందించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని హీరోయిన్ నివేదా పేతురాజ్ అన్నారు. దుబాయ్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించారన్నారు. ఫాస్టెస్ట్ 100 మిలియన్ మినిట్స్ మార్క్‌ను ఈ సినిమా చేరుకుందని ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ పేర్కొన్నారు. -
పది వేల కోట్ల స్కామ్ చేసిన విశ్వక్ సేన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!
విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. నివేదా పేతురాజ్ ఇందులో హీరోయిన్గా నటించింది. ప్రమోషన్స్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా అదే హైప్‌తో దూసుకుపోయింది. విశ్వక్సేన్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్‌తో తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మార్చి 22న విడుదలైన ఈ చిత్రం విజయవంతమైన సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించిన దాస్ కా ధమ్కీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేడు(శుక్రవారం) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో మంచి వసూళ్లను అందుకున్న ఈ సినిమాను ఓటీటీలో ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుందన్నది చూడాల్సి ఉంది. Double Action. Double Masala. Double Dhamaka. Double entertainment.#DasKaDhamkiOnAHA Streaming Now! 🔥@VishwakSenActor @Nivetha_Tweets @leon_james @KumarBezwada @VanmayeCreation @VScinemas_@saregamasouth pic.twitter.com/pZ60Phr67A — ahavideoin (@ahavideoIN) April 13, 2023 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న వార్త! మొత్తం 'పదివేల' కోట్ల స్కామ్!! ఇంతకూ ఏం జరిగింది..?🤔 #DasKaDhamkiOnAHA pic.twitter.com/8lzuM3hBA1 — ahavideoin (@ahavideoIN) April 14, 2023 -
ఓటీటీలో రిలీజ్ కానున్న దాస్ కా ధమ్కీ, అప్పటి నుంచే స్ట్రీమింగ్
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలైంది. విశ్వక్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ (తొలిరోజు రూ.8 కోట్లు) రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథేంటంటే.. డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే వ్యక్తి సంజయ్ రుద్ర. పుట్టిన తర్వాత అనాథగా మారి చాలా కష్టపడి పెరిగి పెద్దవాడైన మరో వ్యక్తి కృష్ణదాస్. వీరి మధ్య జరిగే పోరాటమే దాస్ కా ధమ్కీ. ఈ ఇద్దరూ ఒకేలా ఉండటం సినిమాలో ఇంట్రస్టింగ్ పాయింట్. విశ్వక్ సేన్, హైపర్ ఆది, మహేశ్‌ల కామెడీతో సరదాగా సాగిపోయే ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అసలు వీరి మధ్య గొడవేంటి? ధనవంతుడు సంఘంలో పేరున్న సంజయ్ రుద్ర ఉన్నట్లుండి కృష్ణదాస్‌ను ట్రాప్ చేయాలనకున్న విషయాలు, కథలో ఉండే ట్విస్టులు, టర్నులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. Das ka Dhamki aha la ante, mass motha mogala 🔥 Get ready for a summer thunderstorm ⚡ #DasKaDhamkiOnAHA Premieres April 14 @VishwakSenActor @Nivetha_Tweets @leon_james @KumarBezwada @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/fiUC8alveC— ahavideoin (@ahavideoIN) April 6, 2023 -
విశ్వక్ సేన్ కి ధమ్కీ ఇచ్చిన నివేత
-
దాస్ కా ధమ్కీ సక్సెస్.. ఎమోషనలైన విశ్వక్ సేన్
‘‘నిజానికి కామెడీ నా బలం కాదు. యాక్షన్, డార్క్ డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్‌ని బాగా డైరెక్ట్ చేస్తా. అయితే ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ఇచ్చారు ప్రేక్షకులు’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ‘కరాటే’ రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘దాస్ కా ధమ్కీ’ మేం అనుకున్నదానికంటే పెద్ద సక్సెస్ అయ్యింది. చదవండి: మీకు మంచి కంటెంట్ అందించడమే మాకు ముఖ్యం: అదితి షాకింగ్ కామెంట్స్ నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ (రూ.8 కోట్ల 88లక్షలు) వచ్చాయి. హీరో, డైరెక్షన్, ప్రొడక్షన్. ఈ మూడు బాధ్యతలు నిర్వహించడం ఒత్తిడిగా ఉంటుంది. నా ‘ఫలక్నామా దాస్’ కంటే పదింతలు ‘దాస్ కా ధమ్కీ’కి ఖర్చు పెట్టాం. సినిమా చేయడం కష్టం కాదు కానీ విడుదల చేయడం మాత్రం కష్టంతో కూడుకున్న పని. ఈ మూవీ ఫస్ట్ డ్రాఫ్ట్‌ని రచయిత ప్రసన్న నుంచి కొన్నాను. నేను నటించిన ‘గామి’ రిలీజ్‌కి రెడీగా ఉంది. సితార బ్యానర్లో ఓ సినిమా, రామ్ తాళ్లూరితో ఓ సినిమా చేయాలి. అలాగే నా సొంత బ్యానర్లో ఓ మూవీ ఉంటుంది’’ అన్నారు. -
Das Ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
దాస్ కా ధమ్కీ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
‘ధమ్కీ ఇచ్చిన దాస్!’.. కంగుతిన్న ప్రేక్షకులు
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తెరకెక్కించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఉగాది కానుకగా ఈ మూవీ మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ సేన్ తొలి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా చూసేందుకు ఆశగా వెళ్లిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. తెరపై మూవీ పడగానే ఆడియన్స్ అంత ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ సినిమాకు బదులుగా మరో సినిమా వేయడంతో అంతా గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని సుకన్య థియేటర్లో నేడు రిలీజ్ అయిన దాస్ కా ధమ్కీ మూవీకి బుదులుగా రవితేజ ధమాకా చిత్రాన్ని వేశారు. కొత్త సినిమా అని వెళ్లిన ఆడియన్స్‌కి పాత సినిమా టైటిల్ కనిపంచడంతో రచ్చ రచ్చ చేశారు. అది గ్రహించిన థియేటర్ యాజమాన్యం వెంటనే తప్పును సరిదిద్దుకుంది. వెంటనే ‘దాస్ కా ధమ్కీ’ మూవీ ప్రదర్శించడంతో ప్రేక్షకులంతా కూల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ధమ్కీ ఇచ్చిన దాస్’ అంటూ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ధమ్కీ ధమాఖా దబిడి దిబిడి😂#Dhamaka is Played instead of #Dhamki in Vizag sukanya theatre this morning Theatre Management Got Confused with the names itseems#DasKaDhamki@VishwakSenActor @RaviTeja_offl pic.twitter.com/IOU5CR3vcX — Mr.RK (@RavikumarJSP) March 22, 2023 -
‘దాస్ కా ధమ్కీ’ మూవీ రివ్యూ
టైటిల్: దాస్ కా ధమ్కీ నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, రోహిణి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు నిర్మాణ సంస్థ: విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మాత: విశ్వక్ సేన్ దర్శకత్వం: విశ్వక్ సేన్ సంగీతం: లియోన్ జేమ్స్ సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు విడుదల తేది: మార్చి 22, 2023 టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్‌లో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ పడలేదు. మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్‌ని ఎంచుకున్నాడు. ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ‘మాస్ కా ధమ్కీ’ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మాస్ కా ధమ్కీ’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఓ అనాథ. స్నేహితులు ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)లతో కలిసి ఉంటూ.. ఓ స్టార్ హోటల్లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. అక్కడికి కస్టమర్‌గా వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి కోటీశ్వరుడిలాగా నటిస్తాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణదాస్ లాగే ఉండే సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి, క్యాన్సర్‌ని పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టడం కోసం తన బృందంతో కలిసి పోరాతుంటాడు. డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)తో రూ. 10 వేల కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు. ఓ కారణంగా సంజయ్ రుద్ర ప్లేస్‌లోకి కృష్ణదాస్ వస్తాడు. తన అన్న కొడుకు సంజయ్‌లా నటించమని స్వయంగా అతని బాబాయ్(రావు రమేశ్)కృష్ణదాస్‌ని తీసుకొస్తాడు. అతను ఎందుకు అలా చేశాడు? సంజయ్ ప్లేస్‌లోకి వచ్చాక కృష్ణదాస్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు? అతని వేసిన ప్లాన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్లో ‘దాస్క్ కా ధమ్కీ’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమాకు కథ అందించింది బెజవాడ ప్రసన్న కుమార్. పాత కథలనే అటు ఇటు మార్చి దానికి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్‌కు బాగా అలవాటు. మొన్నటి బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ చిత్రంలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు మాస్క్ కా ధమ్కీలో కూడా అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరి ప్లేస్‌లోకి ఒకరు రావడం... చివర్లో వచ్చే ట్విస్టులు.. ఇవన్ని ‘ధమాకా’, ‘ఖిలాడీ’తో పాటు ఇంతకు ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక లాజిక్స్ గురించి అసలే మాట్లాడొద్దు. కొన్ని ట్విస్టులకు కూడా ప్రేక్షకులు ఈజీగా పసిగడతారు. అలా అని సినిమా మొత్తం ఊహకందేలా రొటీన్‌గా సాగుతుందని చెప్పలేం. కొన్ని చోట్ల వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుంది. కీర్తితో ప్రేమాయణం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. మధ్య మధ్యలో ఆది వేసే పంచులతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ను మాత్రం వరుస ట్విస్టులతో ప్లాన్ చేశారు. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేయకుండా.. సహనానికి పరీక్షగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా ఊహించొచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కోరుకోకుండా..కాస్త కామెడీగా ఉంటే చాలు అనుకునేవాళ్లకి ‘దాస్ కా ధమ్కీ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాతో నటన పరంగా విశ్వక్ సేన్ ఒక మొట్టు ఎక్కాడు. వెయిటర్ కృష్ణదాస్, డాక్టర్ సంజయ్ రుద్ర రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విశ్వక్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఒకవైపు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను వహిస్తూ.. ఇంత చక్కగా నటించిన విశ్వక్ సేన్‌ని అభినందించొచ్చు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. కీర్తి పాత్రకు నివేదా పేతురాజ్ న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఆమె ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సంజయ్ బాబాయ్‌గా రావు రమేశ్ తనదైన నటనతో మెప్పించాడు. హీరో స్నేహితులుగా ఆది, రంగస్థలం మహేశ్‌ల కామెడీ బాగుంది. ఒక తరుణ్ భాస్కర్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. మహేశ్, అతని మధ్య వచ్చే సీన్ బాగా పేలింది. రోహిణి, అజయ్, అక్షరా గౌడ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' తో పాటు మిగిలిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Dhamki Twitter Review:విశ్వక్ సేన్ సినిమాకి అలాంటి టాక్.. ‘ధమ్కీ’ ఎలా ఉందంటే..
డైనమిక్ హీరో విశ్వక్ నటింటి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ధమ్కీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #DasKaDhamki : Super 🔥 #VishwakSen : Good performance #NivethaPethuraj : Very Very Glamour And Cute Beauty 🥵 Screenplay : Engaged 👍 Songs : #AlmostPadipoyindePilla ❤️ Action : Mass 🔥 Das Ka Damki Movie Review : 3.75/5#Dhamki 🌟@VishwakSenActor @Nivetha_Tweets pic.twitter.com/I7JeVErtHN — Cinema Time 🔥 (@CinemaTime_) March 22, 2023 ఈ సినిమా ఫస్టాఫ్ బాగుందని అంటున్నారు. సినిమా మొత్తం ఎక్కడో చూసినట్లు అనిపించినా.. కొంచెం కొత్తగానే ఉంటుందట. విశ్వక్ డ్యూయెల్ రోల్ బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. #DasKaDhamki...! Parledu gattigane ichadu #Dhamki..! Motham antha ekkado chusinatte undi but at the same time knchm kothagane undi..! #VishwakSen “double” attitude ni chupinchukovadaniki athani direction baga use cheskunnadu..! — FDFS Review (@ReviewFdfs) March 22, 2023 సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు కొన్ని ఇబ్బందిపెడుతున్నాయని అంటున్నారు. అంతే కాదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగా ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #DaskaDhamki Overall a Strictly Below Par Movie! After an okayish 1st half with some fun scenes, the entertainment zone gets completely sidelined and the movie goes downhill with over the top scenes, ineffective twists, and substandard screenplay. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) March 22, 2023 ఫస్టాప్‌లో పెద్దగా ట్విస్టులు లేవు కానీ సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు ఉన్నాయట. అయితే ఇవన్ని గత సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయట. 'సెకెండాఫ్‌లో విశ్వక్ సేన్ తనలోని నటుడిని మరింతగా బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే, ఎన్నో ట్విస్టులను పెట్టాడు. అయితే, ఇవన్నీ గతంలో చూసినట్లే అనిపిస్తాయి. ఫలక్నామా దాస్ దర్శకుడి నుంచి మరింతగా ఆశించాను. మొత్తం మీద బిలో ఏవరేజ్ సినిమా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Done with #Dhamki FDFS ❤️🔥@VishwakSenActor looks & styling 👌🫶🏻♥️ Don't miss to watch it in theatres#DasKaDhamki — Deepak 😎 (@alludeepak32) March 22, 2023 #DashkaDhamkiReview :- #DasKaDhamki stands as an bellow average flick with same old story from the past with lot of expected twists in the tale. Lead pair aced with their acting. Some humor in first half. Overhyped #Dhamki👎🏻 Rating : 1.25/5#viswaksen #NivethaPethuraj pic.twitter.com/v3UHFfyM5e — Mr.RK (@RavikumarJSP) March 22, 2023