Vishwak Sen Interesting Comments About His Movies At AHA OTT Press Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Vishwak Sen: తనకు  ప్రయోగాలు చేయడమంటే ఇష్టం: విశ్వక్‌ సేన్

Published Tue, Apr 18 2023 10:56 AM | Last Updated on Tue, Apr 18 2023 11:39 AM

Vishwak Sen Interesting Comments At Aha Ott Press Meet - Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే 'దాస్ కా ధమ్కీ' మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్‌ వసూళ్లు రాబట్టినా.. అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో విశ్వక్‌ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

విశ్వక్ సేన్ మాట్లాడుతూ. .'దాస్ కా ధమ్కీ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్. ఇంతగా ఆదరణ పొందుతున్న సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. అది మీరు ఊహించినా దాని కంటే పది రెట్లు ఎక్కువ‌గానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు ఓటీటీలు వేదికలుగా మారాయి. తనకు  ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. మరో 3 సినిమాలు సెట్స్‌ పైన ఉన్నాయి.' అని తెలిపారు. 

(ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే)

తెలుగు సినీ అభిమానులు అందించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని హీరోయిన్ నివేదా పేతురాజ్ అన్నారు. దుబాయ్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించారన్నారు. ఫాస్టెస్ట్‌ 100 మిలియన్‌ మినిట్స్‌ మార్క్‌ను ఈ సినిమా చేరుకుందని ఆహా కంటెంట్‌ హెడ్‌ వాసుదేవ్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement