
‘‘నిజానికి కామెడీ నా బలం కాదు. యాక్షన్, డార్క్ డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్‌ని బాగా డైరెక్ట్ చేస్తా. అయితే ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో కామెడీ కూడా బాగా తీయగలననే నమ్మకాన్ని ఇచ్చారు ప్రేక్షకులు’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ‘కరాటే’ రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘దాస్ కా ధమ్కీ’ మేం అనుకున్నదానికంటే పెద్ద సక్సెస్ అయ్యింది.
చదవండి: మీకు మంచి కంటెంట్ అందించడమే మాకు ముఖ్యం: అదితి షాకింగ్ కామెంట్స్
నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ (రూ.8 కోట్ల 88లక్షలు) వచ్చాయి. హీరో, డైరెక్షన్, ప్రొడక్షన్. ఈ మూడు బాధ్యతలు నిర్వహించడం ఒత్తిడిగా ఉంటుంది. నా ‘ఫలక్‌నామా దాస్’ కంటే పదింతలు ‘దాస్ కా ధమ్కీ’కి ఖర్చు పెట్టాం. సినిమా చేయడం కష్టం కాదు కానీ విడుదల చేయడం మాత్రం కష్టంతో కూడుకున్న పని. ఈ మూవీ ఫస్ట్ డ్రాఫ్ట్‌ని రచయిత ప్రసన్న నుంచి కొన్నాను. నేను నటించిన ‘గామి’ రిలీజ్‌కి రెడీగా ఉంది. సితార బ్యానర్‌లో ఓ సినిమా, రామ్ తాళ్లూరితో ఓ సినిమా చేయాలి. అలాగే నా సొంత బ్యానర్‌లో ఓ మూవీ ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment