Vishwak Sen 'Das Ka Dhamki' Movie Streaming On This OTT Platform - Sakshi
Sakshi News home page

Vishwak Sen: పది వేల కోట్ల స్కామ్‌.. ఓటీటీకి వచ్చేసిన విశ్వక్‌ సేన్‌ 'దాస్‌ కా ధమ్కీ'

Published Fri, Apr 14 2023 3:10 PM | Last Updated on Fri, Apr 14 2023 4:44 PM

Vishwak Sen Starrer Das Ka Dhamki Movie Streaming On Aha - Sakshi

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'దాస్‌ కా ధమ్కీ'. నివేదా పేతురాజ్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ప్రమోషన్స్‌తో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ రిలీజ్‌ తర్వాత కూడా అదే హైప్‌తో దూసుకుపోయింది. విశ్వక్‌సేన్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌తో తొలిరోజే హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మార్చి 22న విడుదలైన ఈ చిత్రం విజయవంతమైన సంగతి తెలిసిందే.

మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించిన దాస్‌ కా ధమ్కీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో నేడు(శుక్రవారం) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి థియేటర్లలో మంచి వసూళ్లను అందుకున్న ఈ సినిమాను ఓటీటీలో ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement