Allu Arjun arrives Vizag for Pushpa 2 shooting; check details - Sakshi
Sakshi News home page

Allu Arjun: పొడవైన జుట్టుతో, కొత్త లుక్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌

Published Fri, Jan 20 2023 10:20 AM | Last Updated on Fri, Jan 20 2023 11:08 AM

Allu Arjun Arrives Vizag For Pushpa 2 Shooting Details Inside - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప–2 ది రూల్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త లుక్‌తో గురువారం విశాఖ చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న బన్నీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలివచ్చారు. ఐకాన్‌ స్టార్‌ విశాఖ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు సైతం ఆయనకు రక్షణ కల్పించేందుకు ఎయిర్ పోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ అల్లు అర్జున్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడంతోనే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇదిలా ఉండగా ఇటీవ‌లే పుష్ప 2 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌లో కొన్నిరోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. తాజా షెడ్యూల్‌ను వైజాగ్‌లో చిత్రీక‌రించ‌బోతున్నారు. అందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారు.  ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్ లోకి ర‌ష్మిక మంద‌న్న అడుగు పెట్ట‌నుంది.

సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రూపొందిన ‘పుష్ప-1’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో పుష్ప-2పై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలో మెయిన్ విల‌న్ భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్‌గా మెప్పించిన మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర‌కు, పుస్ప‌రాజ్ పాత్ర‌కు ఎలాంటి గొడ‌వ జ‌రిగింద‌నేది పార్ట్ 2లో తెలియ‌నుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement