Watch: Kantara Movie Varaha Roopam Lyrical Song Video Released - Sakshi
Sakshi News home page

Varaha Roopam Lyrical Song: ‘వరహరూపం..’ కాంతార లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Thu, Oct 20 2022 5:30 PM | Last Updated on Thu, Oct 20 2022 6:52 PM

Varaha Roopam Lyrical Song Released From Kantara Movie - Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంతార హావా నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండ మొదట కన్నడ భాష చిత్రంగా వచ్చిన కాంతార ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన ఈ సినిమాకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో గీత ఆర్ట్స్‌ బ్యానర్లో అల్లు అరవింద్‌ కాంతార విడుదల చేయగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్‌ తారల మెరుపులు

ఇక్కడ సైతం ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇక రీసెంట్‌గా హీందీలో రిలీజ్‌ కాగా నార్త్‌ ఆడియన్స్‌ను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కథ పరంగానే కాదు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్‌

ఈ పాట మేకింగ్‌ సన్నివేశాలను చూపిస్తూ రిలీజ్‌ చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్‌ లోకనాథ్‌ స్వరాలు సమకూర్చడంతో మొదలైన పాట ఆద్యంతం అలరించేలా ఉంది. దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి ఈ పాటను తెరకెక్కిస్తున్న సన్నివేశాలు, ఆ పాత్రల్లో వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. కాగా షాషిరాజ్‌ కవూర్‌ సాహిత్యం అందించిన ఈ పాటను గాయకుడు సాయి విఘ్నేష్‌ ఆలపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement