కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్‌లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.
Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.
Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024
Comments
Please login to add a commentAdd a comment