రిషబ్ శెట్టి పోస్ట్‌.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం! | Fans Fire On Rishab Shetty leaves out Rashmika Mandanna in Kirik Party post | Sakshi
Sakshi News home page

Rishab Shetty: ఆ సినిమాపై కాంతార హీరో పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఫైర్!

Published Wed, Jan 1 2025 8:38 PM | Last Updated on Wed, Jan 1 2025 9:29 PM

Fans Fire On Rishab Shetty leaves out Rashmika Mandanna in Kirik Party post

శాండల్‌వుడ్ స్టార్‌ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రిషబ్‌ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్‌ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్‌లోనే తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్‌లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్‌ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్‌ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement