నువ్వు తీస్కో నాన్న.. హీరోలా ఉంటావు | Hero Nani Tweet on His Father Recieving Award | Sakshi
Sakshi News home page

నువ్వు తీస్కో నాన్న.. హీరోలా ఉంటావు

Published Mon, Jan 13 2020 2:47 PM | Last Updated on Mon, Jan 13 2020 3:00 PM

Hero Nani Tweet on His Father Recieving Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీ సినీ తెలుగు అవార్డుల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డులు ప్రదానం చేశారు. నాచురల్‌ స్టార్‌ నానికి ‘జెర్సీ’ సినిమాకుగాను  ఫేవరెట్‌ యాక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది. నాని తండ్రి ఘంటా రాంబాబు కొడుకు తరఫున నటి జీవిత చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ విషయమై నాని ట్విటర్‌లో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘నువ్వు తీస్కో నాన్న. నువ్వు అవార్డు తీసుకుంటే హీరోలా ఉంటావు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విజయం ‘జెర్సీ’ దర్శకుడు గౌతం తిన్ననూరిదని, జెర్సీకి ఏ విజయం దక్కినా అదే గౌతంకే దక్కుతుందని పేర్కొన్నారు.

ఇక, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాల గురించి స్పందిస్తూ.. ‘ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారంటే.. బాక్సాఫీస్‌ వద్ద ఈ ఏడాది గొప్పగా ఉండబోతుందనే భరోసా కలుగుతోంది. రెండు సినిమాల చిత్రబృందాలకు అభినందనలు. రాబోయే చిత్రాలకు ఆల్ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement