Collcetions: Sarileru Neekevvaru vs Ala Vaikunthapurramuloo @ USA | Mahesh Babu, Allu Arjun - Sakshi Telugu
Sakshi News home page

కలెక్షన్లే కలెక్షన్లు

Published Tue, Jan 14 2020 11:10 AM | Last Updated on Tue, Jan 14 2020 1:29 PM

Ala Vaikunthapurramuloo Telugu Movie Box Office Collections - Sakshi

అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు అమెరికా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్నాయి. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ​కాంత్‌ ‘దర్బార్‌’ కూడా అంచనాలకు తగ్గినట్టు వసూళ్లు రాబడుతోంది. ఈ మూడు సినిమాలు కలిసి ఇప్పటికే 31 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటాయి. దర్బార్‌ ఐదో రోజుల్లో రూ.10.11 కోట్లు సాధించగా, ‘సరిలేరు నీకెవ్వరు’ మూడు రోజుల్లోనే రూ.11.51 కోట్లు రాబట్టింది. ‘అల.. వైకుంఠపురంలో’ రెండు రోజుల్లేనే రూ.9.92 కోట్లు సాధించి దూసుకెళుతోంది.

ఈ దక్షిణాది సినిమాలు కలిపి అమెరికా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్‌ బాక్సాఫీస్‌ చార్ట్‌లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు దక్కించుకోగా, ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా టాప్‌లో నిలవడం విశేషం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తొలిరోజు రూ.46.77 కోట్ల షేర్‌ సాధించినట్టు సమాచారం.

‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ

దర్బార్‌ : మూవీ రివ్యూ

ఛపాక్‌ : మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement