ఇండస్స్త్రీలో రాణించడమంటే మాటలు కాదు.. అదృష్టం, ప్రతిభ.. ఈ రెండూ ఉంటేనే నిలదొక్కుకోగలరు. వీటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న రష్మిక మందన్నాకు ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయి. ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉన్నా హీరోయిన్‌కు మాత్రం అవకాశాలు గుమ్మం దగ్గరికి వస్తున్నాయి. సినిమా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా ఆమె పాత్రకు ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ క్యూట్ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హీ సో స్వీట్.. హీ సో క్యూట్’ అంటూ లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడిపాడిన రష్మికను చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోయారు. కానీ ఈ చిత్రంలో ఆమె కాస్త అతి చేసిందన్న విమర్శలూ లేకపోలేదు. ప్రతీదానికి అతిగా ఎగ్జైట్ అవుతూ ఓవర్ యాక్షన్ చేసిందని కొందరు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. కాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించింది. తాను అతిగా ప్రవర్తించానంటున్నారు.. కానీ తనకిచ్చిన పాత్రే అలాంటిదని సంజాయిషీ ఇచ్చుకుంది.(సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ)
పాత్రకు పూర్తి న్యాయం చేయడం తన బాధ్యతగా అభివర్ణించింది. ‘ సినిమాలో నా పాత్ర ఎలా డిజైన్ చేశారో దానికి తగ్గట్టుగానే నేను ప్రవర్తించాను. నిజానికి ఆ పాత్ర కోసం చాలా శ్రమించాను. ఇక విమర్శలంటారా.. దాన్ని నేను మనసారా ఆస్వాదిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నానంటే అవే కారణమని నమ్ముతున్నాను. నన్ను నేను మెరుగుపర్చుకోడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయని’ తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ నితిన్ సరసన నటించిన ‘భీష్మ’ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అదేంటో కానీ.. నాకు వచ్చే పాత్రలన్నీ నా నిజజీవితానికి దగ్గరగా ఉంటున్నాయని పేర్కొంది. భీష్మలో తన పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంని భరోసాగా చెప్తోంది. (నిశ్చితార్థానికి ముందే నితిన్ లవ్‌స్టోరీ తెలుసు)
ట్రోలింగ్‌పై స్పందించిన రష్మిక
Published Thu, Feb 20 2020 10:09 AM | Last Updated on Thu, Feb 20 2020 10:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment