సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్న చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని, టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర హీరోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా ఈ ఈవెంట్ అప్‌డేట్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా లాండ్ మార్క్ అనౌన్స్‌మెంట్‌కు సిద్ధంకండి అంటూ దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా పేజ్‌లో ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఈ అనౌన్స్‌మెంట్ మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ ప్రకటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్న ముఖ్య అతిథి గురించే అయ్యుంటుందని.. ఫంక్షన్‌కు రామ్ చరణ్ అతిథిగా రానున్నారని అందరూ ఊహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్న అతిథి విషయంలో మహేష్ క్లారిటీ ఇచ్చారు.
జనవరి 5న జరగనున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు మహేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాధాలు. మీరు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. మిమ్మల్ని కలవడానికి ఎంతోగానో ఎదురు చూస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
#SarileruNeekevvaru pre-release event on JAN 5th! pic.twitter.com/cXkf1Wj1nG
— Mahesh Babu (@urstrulyMahesh) December 20, 2019
Comments
Please login to add a commentAdd a comment