మహేశ్‌ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస | Sarileru Neekevvaru : Stampade at Mahesh Babu Photoshoot | Sakshi
Sakshi News home page

మహేశ్‌ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస

Published Wed, Dec 25 2019 2:29 PM | Last Updated on Wed, Dec 25 2019 3:00 PM

Sarileru Neekevvaru : Stampade at Mahesh Babu Photoshoot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేశ్‌బాబుతో ఫ్యాన్స్‌ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. అయితే, దీని గురించి తెలియడంతో మహేశ్‌బాబు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫొటోషూట్‌లో మహేశ్‌తో ఫొటోలు దిగినట్టు సోషల్‌ మీడియాలో, ట్విటర్‌లో వస్తున్న అప్‌డేట్స్‌ను బట్టి తెలుస్తోంది.

అయితే, మహేశ్‌ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని.. తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఈ ఫొటోషూట్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేశ్‌బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమచారం. మహేశ్‌తో ఫొటోషూట్‌ పేరిట ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టిమరీ అభిమానుల్ని ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement