AK Entertainments
-
ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాయావన్'. కోలీవుడ్‌లో 2017లో సి.వి. కుమార్ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. తాజాగా పార్ట్-2 నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో 'ప్రాజెక్ట్ z' పేరుతో మొదటి భాగం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సైన్స్ ఫిక్షన్ జానర్లో రాబోతున్న 'మాయావన్' సీక్వెల్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి.వి. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం భారీ హిట్ కావడంతో ఏడేళ్ల తర్వాత మాయావన్ పేరుతోనే సీక్వెల్ రానుంది. -
భోళా శంకర్ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: భోళా శంకర్ సినిమాను ఆపాలంటూ కోర్టు మెట్లెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. పిటిషన్ వెనక్కు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్తో పాటు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల నిర్మాతలతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. ఈ వివాదం ఏంటి? అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 27న రిలీజైంది. ఈ చిత్రం నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు అందరికీ కోట్ల కొద్ది నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనను మోసం చేశారంటున్నాడు డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ.. ఆయన రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు సత్యనారాయణకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని నిర్మాతలు అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇందుకోసం రూ.30 కోట్లు తీసుకున్నారు. అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడితే ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి వెళ్లిపోయాడు. తర్వాత 'సామజవరగమన' వైజాగ్ హక్కులు సత్యనారాయణకే ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది. ఇంకా రావాల్సిన డబ్బు గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే సమాధానం రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. తనకు డబ్బు ఇచ్చేవరకు భోళా శంకర్‌ను ఆపాలని కోరాడు. చదవండి: 'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా? -
రిలీజ్‌కు ముందు 'ఏజెంట్' నిర్మాత ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత,ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ సుంకర ట్విటర్ వేదికగా తెలిపారు. 'నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి.. అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తూ నా విజయానికి బాటలు వేసిన నా పెదనాన్న ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో బాధిస్తుంది. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము. కష్టపడి సక్సెస్ సాధిస్తూ మీరు గర్వించేలా చేస్తాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2010లో బిందాస్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ఆరంభించిన ఆయన దూకుడు, ఆగడు, లెజెండ్, రాజుగారి గది, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి హిట్ పలు హిట్ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు అఖిల్ అక్కినేనితో ఏజెంట్ సినిమాతో ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. Woke up this morning with a news that my dear pedananna Sunkara Basava rao garu, who loved me encouraged me and always looked farward for my success is no more. He lived all his life encouraging innovation. REST IN PEACE pedanannagaru. We will always miss you but work hard to… pic.twitter.com/FFCkZvNWDF — Anil Sunkara (@AnilSunkara1) April 22, 2023 -
బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ మరో ప్రయోగం
ముంబై: వీడియో షేరింగ్ సోషల్ మీడియా సంస్థ రోపోసో తాజాగా ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్‌తో చేతులు కలిపింది. ‘ఈకే’ బ్రాండ్ పేరిట గృహాలంకరణ, గృహోపకరణాలను ఆవిష్కరించింది. స్థానిక కళాకారులకు ఊతమిచ్చేందుకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఇది తోడ్పడగలదని ఏక్తా కపూర్ తెలిపారు. మొబైల్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ ఇన్మొబీలో భాగమైన గ్లాన్స్కి రోపోసో అనుబంధ సంస్థగా ఉంది. కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్, గ్లాన్స్ మధ్య జాయింట్ వెంచర్ సంస్థ అయిన గ్లాన్స్ కలెక్టివ్ ’ఈకే’ బ్రాండ్ కింద మొట్టమొదటి కలెక్షన్ అందిస్తోందని ఇన్‌మొబి సీఈవో నవీన్ తివారీ తెలిపారు. ఈ కేటలాగ్‌లో కుషన్ కవర్లు, వాల్ ఆర్ట్ మొదలైన ఉత్పత్తులు గ్లాన్స్, రోపోసో ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయి -
‘దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా’
కామెడీ హీరో అల్లరి నరేశ్, పూజా జవేరి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్లో రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మంగళవారం హీరో నరేశ్ బర్త్‌డే సందర్భంగా మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. (అల్లరి నరేష్ ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజ్) 64 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో నరేశ్ తనదైన కామెడీ టైమింగ్‌ను జోడించాడు. హాస్యనటుల బృందం భారీగానే ఉండటంతో ఈ చిత్రం పూర్తి వినోదపు విందును అందించనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే నరేశ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘నాంది’ టీజర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. (అందుకే సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను) -
మహేశ్ అభిమానుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై హీరో మహేశ్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేశ్‌బాబుతో ఫొటో దిగడానికి రమ్మని తమను తీవ్రంగా అవమానించారని మండి పడుతున్నారు. స్టార్ హీరోకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. మహేశ్‌బాబుతో ఫొటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్లైన్లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది. బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని, తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు. తమను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైళ్లో సీట్లు దొరక్కపోయినా రాత్రంతా ప్రయాణం చేసి 30 మందితో కలిసి వచ్చామని, ఇక్కడి వచ్చాక తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. ఎవరి పైరవీలు వాళ్లవి జరుగుతున్నాయని ఆరోపించాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. కోపంతో అభిమానులు కుర్చీలు విరగొట్టారు. అయితే అనుమతి తీసుకుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. (మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస) -
మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస
-
మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేశ్‌బాబుతో ఫ్యాన్స్ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. అయితే, దీని గురించి తెలియడంతో మహేశ్‌బాబు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫొటోషూట్‌లో మహేశ్‌తో ఫొటోలు దిగినట్టు సోషల్ మీడియాలో, ట్విటర్లో వస్తున్న అప్డేట్స్ను బట్టి తెలుస్తోంది. అయితే, మహేశ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని.. తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఈ ఫొటోషూట్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేశ్‌బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమచారం. మహేశ్‌తో ఫొటోషూట్ పేరిట ఆన్లైన్లో పోస్టులు పెట్టిమరీ అభిమానుల్ని ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది. -
ఎడారిలో యాక్షన్
రాజస్థాన్ వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు హీరో గోపీచంద్. అక్కడి ఎడారిలో విలన్స్ భరతం పడతారట. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ రాజస్థాన్‌లో జై సల్మీర్‌లో ఈ నెల 21న మొదలవుతుందని సమాచారం. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి చాన్స్ ఉందట. ఆల్రెడీ టీమ్ సెర్చింగ్ స్టార్ట్ చేశారు. త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాకు మాటల రచయిత: అబ్బూరి రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి. -
నిఖిల్ కూడా లవ్ ఫెయిల్యూరే..
రోజా పువ్వు ప్రేమకు సంకేతం. ఎవరైనా వారి ప్రేమను ప్రేమికుల రోజున ఒక రోజా పువ్వు ఇచ్చి తెలియజేస్తారు. యంగ్ హీరో నిఖిల్ కూడా లవ్ ఫెయిల్యూర్రే. నిఖిల్ గర్ల్‌ఫ్రెండ్ తన ప్రేమను తిరస్కరించింది. ఇది నిజజీవితంలో కాదు. కిరాక్ పార్టీ అనే మూవీలో. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కిరాక్ పార్టీలోని ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఆ పోస్టర్లో నిఖిల్ దిగులుగా, వంగిపోయినా రోజా పువ్వుతో కనిపించారు. ఈ సినిమాలో హీరో లవ్ ఫెయిల్యూర్ పాత్రలో నటిస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నిఖిల్‌కు ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
‘కిరాక్ పార్టీ’ ప్రీ టీజర్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. జనవరి 22న తొలి పాటను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు నిఖిల్. -
నిఖిల్తోనూ అదే ఒప్పందం..!
టాలీవుడ్లో వరుసగా సక్సెస్ సాధిస్తున్న హీరోలు చాలా తక్కువ. అలాంటి అరుదైన ఘనత సాధించిన యంగ్ హీరో నిఖిల్. కెరీర్ స్టార్టింగ్‌లో మూస సినిమాలతో బోర్ కొట్టించిన నిఖిల్, ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలతో వరుస సక్సెస్‌లు సాధిస్తున్నాడు. ఇప్పటికే మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్, ప్రస్తుతం కన్నడ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతుంది. నిర్మాత అనీల్ సుంకర తన బ్యానర్లో ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేసేందుకు ఇష్టపడతారు. గతంలో 14 రీల్స్ బ్యానర్‌పై మహేష్ బాబు హీరోగా వరుసగా మూడు సినిమాలు నిర్మించారు. తరువాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనూ రాజ్ తరుణ్ హీరోగా వరుస సినిమాలు నిర్మించారు. ఇప్పుడ నిఖిల్ తోనూ అలాగే మూడు సినిమాల ఒప్పందం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. మరి ఒప్పందానికి నిఖిల్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. -
నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ'..?
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో అన్ సీజన్లో కూడా బిగెస్ట్ హిట్ కొట్టిన నిఖిల్, త్వరలో కేశవగా మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన కిర్రాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజ్ తరుణ్‌తో వరుస సినిమాలు చేస్తున్న ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందర్, ఈ సినిమాతో దర్శకుడిగా మారాలని భావిస్తున్నాడు. సీనియర్ హీరో నాగార్జున తో కలిసి చందూ మొండేటి దర్శకత్వంలో చేయాల్సిన మల్టీ స్టారర్ సినిమా ఆలస్యం అవుతుండటంతో ఈ లోగా కిర్రాక్ పార్టీ రీమేక్ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు నిఖిల్. -
తమిళ దర్శకుడితో తెలుగు నిర్మాత
14 రీల్స్ బ్యానర్లో భాగస్వామిగా ఉన్న అనీల్ సుంకర, తన సొంత నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించి మంచి విజయాలు సాధించారు. ఈ దసరాకు ఈడు గోల్డ్ ఎహే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తొలిసారిగా ఓ తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది కూడా కోలీవుడ్, టాలీవుడ్‌లలో మంచి పేరున్న సెల్వరాఘవన్ దర్వకత్వంలో కావటం మరో విశేషం. ప్రస్తుతం ఎస్ జె సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన నెంజం మరప్పుదిల్లై సినిమా పనుల్లో బిజీగా ఉన్న సెల్వ.. ఆ సినిమా తరువాత ఓ వెరైటీ సినిమాకు రెడీ అవుతున్నాడు. హీరోగా మారిన కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను లోబడ్జెట్‌లో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు సెల్వ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అనీల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. -
'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త'
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో రాజ్ తరుణ్. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. -
మూడు సినిమాలు ఒప్పేసుకున్నాడు
ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మధ్యలో కెరీర్ కాస్త తడబడినట్టు కనిపించినా.. ఆడోరకం ఈడో రకం సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం మీడియం బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్లకు రాజ్ తరుణ్ బెస్ట్ ఛాయిస్‌గా మారాడు. కామెడీ టైమింగ్‌తో పాటు డిఫరెంట్ డైలాగ్ డెలివరీ రాజ్ తరుణ్‌కు ప్లస్ అయ్యంది. అదే బాటలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలకు అంగకీరించాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం ఇదే బ్యానర్లో దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో రాజుగాడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సంజనా రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు సంబందించిన కథా చర్చల్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు వెలిగొండ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్లోనూ రాజ్ తరుణ్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూడు సినిమాలను మూడు, నాలుగు నెలల గ్యాప్‌తో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ఆ సినిమా ఆగిపోలేదట..!
ఆడో రకం.. ఇడో రకం తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, స్క్రిప్ట్, దర్శకత్వం లాంటి వాటిల్లో ఇబ్బంది పెడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఆఫర్స్ కూడా ఈ యంగ్ హీరోకు దూరమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. రక్ష సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. రాజ్ తరుణ్ ప్రవర్తన వల్లే దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడని భావించారు. అయితే అలాంటిదేమీ లేదని చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవుతుందని ప్రకటించారు. అంతేకాదు రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమాను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. ఈ సినిమాతో సంజనారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఏకె ఎంటర్టైన్మెంట్స్ మూడో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది.