ఎడారిలో యాక్షన్‌ | gopichand new movie schedule in rajasthan | Sakshi
Sakshi News home page

ఎడారిలో యాక్షన్‌

Published Fri, Jan 18 2019 5:31 AM | Last Updated on Fri, Jan 18 2019 5:31 AM

gopichand new movie schedule in rajasthan - Sakshi

గోపీచంద్‌

రాజస్థాన్‌ వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు హీరో గోపీచంద్‌. అక్కడి ఎడారిలో విలన్స్‌ భరతం పడతారట. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ రాజస్థాన్‌లో జై సల్మీర్‌లో ఈ నెల 21న మొదలవుతుందని సమాచారం. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. స్క్రిప్ట్‌ పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి చాన్స్‌ ఉందట. ఆల్రెడీ టీమ్‌ సెర్చింగ్‌ స్టార్ట్‌ చేశారు. త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాకు మాటల రచయిత: అబ్బూరి రవి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement