thiru
-
ఏడ్చే సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని
‘‘కెరీర్ తొలి రోజుల్లో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. అందుకేనేమో ఏడ్చే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో’’ అన్నారు హీరోయిన్ నిత్యా మీనన్. అందం, అభినయంతో నటనకుప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ . తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’(తెలుగులో తిరు) సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యా మీనన్.కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున ్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఇఫీ)లో పాల్గొన్న నిత్యామీనన్ .. సినిమాల్లో తన పాత్రల ఎంపిక గురించి మాట్లాడారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటనకు అంతప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. ఆ తర్వాత కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నా. నటనకిప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లే ఎంచుకున్నాను. నటన అనేది భావోద్వేగానికి సంబంధించినది.దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అవసరం లేదు.. అందులో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే చాలు. మనం చేసే పాత్రలపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వాటిని ఎంచుకుంటే మంచి ఆదరణ లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆ ప్రభావం చేసే పాత్రపై పడుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యా మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్‌తో ‘ఇడ్లీ కడై’, విజయ్ సేతుపతితో ఓ సినిమా, ‘గోల్డెన్ వీసా’ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
అవార్డుల కోసం నటించను: నిత్యామీనన్
‘‘అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నాపాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను’’ అంటున్నారు హీరోయిన్ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. ఇక ధనుష్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’ (తెలుగులో ‘తిరు’). మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యామీనన్.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ– ‘‘తిరు’కి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంటానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేనుపోషించిన ప్రతిపాత్రకు గుర్తింపు రావాలనుకోను. ఆపాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకునే ఎంపిక చేసుకుంటాను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో చాన్స్ వచ్చినా మొహమాటం లేకుండా చేయనని చెబుతాను. అలాంటిపాత్రలపై నాకు ఆసక్తి లేదు. మంచిపాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తాను. అందరూ అనుసరిస్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్లాలనే రూల్ లేదు కదా?’’ అని పేర్కొన్నారు. -
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు). నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదలై హిట్‌టాక్ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చదవండి: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్ భార్య, ఫొటోలు వైరల్ కేవలం తమిళంలోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్‌నెక్ట్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న తరుణంలో ఓటీటీలోకి నెల రోజుల్లోనే రాబోతుందని వినికిడి. అంటే ఈ తాజా బజ్ ప్రకారం.. తిరుచిట్రంపళం(తిరు) సెప్టెంబర్ 17 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జల్సా’ రీ-రిలీజ్, థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్ Box Office Alert!#Dhanush, #NithyaMenen's film #Thiruchitrabalam zooms past Rs 100 crore mark Worldwide 🌐 🔥🔥 pic.twitter.com/McOAWvxxRJ — Hello South (@Hellosouth_in) September 1, 2022 -
Thiru Review: ‘తిరు’మూవీ రివ్యూ
టైటిల్ : తిరు నటీనటులు : ధనుష్, నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాశ్ రాజ్, భారతీ రాజా తదితరులు నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్ నిర్మాతలు: కళానిధి మారన్ దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్ విడుదల తేది: ఆగస్ట్ 18, 2022 తమిళ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ధనుష్ లేటెస్ట్ తమిళ్ మూవీ ‘తిరు చిత్రాంబళం’ కూడా తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైంది. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ గురువారం(ఆగస్ట్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తిరు’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరు ఏకాంబరం అలియాస్ పండు(ధనుష్) ఓ మధ్య తరగతి యువకుడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తండ్రి(ప్రకాశ్ రాజ్), తాత సినియర్ తిరు(భారతీ రాజా)లతో కలిసి జీవిస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తండ్రిపై ద్వేషం పెంచుకొని, అతనితో మాట్లాడడమే మానేస్తాడు. అంతేకాదు ఆ సంఘటన కారణంగానే చదువుని మధ్యలో ఆపేసి, భయస్తుడిగా మారిపోతాడు. అతని క్లోజ్ ఫ్రెండ్ శోభన(నిత్యామీనన్). తిరు ఉండే అపార్ట్మెంట్ కిందే శోభన ఫ్యామిలీ ఉంటుంది. ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. శోభన కూడా అని విషయాల్లోనూ తిరుకు తోడుగా ఉంటుంది. తిరు మనసుపడ్డ అమ్మాయిలు అనూష(రాశీఖన్నా), రంజని(ప్రియా భవానీ శంకర్) విషయంలోనూ శోభన సాయం చేస్తుంది. చివరకు తిరు ప్రేమని ఎవరు అంగీకరించారు? ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు తండ్రితో మాట్లాడకుండా ఉన్నాడు? తిరులో ఉన్న భయాన్ని ఎలా అధిగమిస్తాడు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘తిరు’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... కుటుంబ అనుభంధాలు, స్నేహం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తిరు’. ఈ తరహా కథలు తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ కథనాన్నే నేచురల్ సీన్స్‌తో ఆసక్తికరంగా నడిపించడం ‘తిరు’ స్పెషల్. కథ ప్రారంభం, తిరు నేపథ్యం ధనుష్ గతంలో నటించిన ‘రఘువరన్ బి.టెక్’సినిమాను గుర్తు చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా అలానే ఉంటుంది. ఇక తిరు, శోభన మధ్య సాగే స్నేహం, ప్రేమ తదితర సీన్స్ ‘నువ్వే కావాలి’సినిమా తరహాలో ఉంటాయి. పండు, శోభన పాత్రలు మాత్రం మనలో ఒకరిగా వ్యవహరిస్తాయి. అంత సహజంగా ఆ పాత్రలను తీర్చి దిద్దాడు దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్. తిరు, శోభనల మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. తిరు అనూషని ప్రేమించడం, ఆ విషయంలో శోభన సాయం చేడయం తదితర రొటీన్ సీన్స్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఆ సన్నివేశాలు మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేవు. అంతేకాదు సెకండాఫ్‌లో కథ ఎలా సాగుతుందనేది కూడా ప్రేక్షకుడు ఊహించవచ్చు. అయితే పల్లెటూరి నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ కామెడీని పండిస్తాయి. ఇక హీరో తండ్రిని ఎందుకు ద్వేషిస్తున్నాడో చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ కూడా సింపుల్ ఉంటుంది. మనం చేసే ఒక చిన్న తప్పు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెరపై చూపించిన తీరు బాగుంది. తెలుగులో ధనుష్‌కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ చేయపోవడం పెద్ద మైనస్. చాలా మందికి తెలుగులో ‘తిరు’సినిమా విడుదలైన విషయమే తెలియదు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం ధనుష్, నితామీనన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు వారే ప్రధాన బలం. తమదైన సహజ నటనతో ఇద్దరు ఆకట్టుకున్నారు. ప్రతి సీన్లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఒకనొక దశలో ధనుష్‌ని డామినేట్ చేసేలా నిత్యా యాక్టింగ్ ఉంటుంది. ఇద్దరు కూడా తమ తమ పాత్రల్లో నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఆయన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్. ఇక ఇక్కడ భారతీ రాజా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీనయర్ పండు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా,ప్రియా భవానీ శంకర్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనిరుధ్ సంగీతం జస్ట్ ఓకే. గత సినిమాలో పోలిస్తే..ఇందులో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సింపుల్‌గా ఉంటుంది. ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం
‘‘చాణక్య’ సినిమా చాలా బాగా వచ్చింది. తొలిసారి గూఢచారి పాత్ర చేశా. ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలు, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాం’’ అన్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు. ► తిరు చెప్పిన ‘చాణక్య’ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందనే ఎగై్జట్‌మెంట్‌తో పాటు టెన్షన్ ఉంటుంది. ఇందులో ఎంటర్టైనింగ్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. మాస్, క్లాస్.. ఏ జోనర్ అయినా యాక్షన్ కామనే. ఇందులో మంచి యాక్షన్ ఉంది. మంచి సినిమా తీశామని యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ► ఈ సినిమాలో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామేన్ వెట్రి పళనిస్వామి నన్ను చాలా అందంగా చూపించారు. మంచి విజువల్స్ ఇచ్చారు. ‘గౌతమ్ నంద’లో గెడ్డంతో కనిపించినా, ‘చాణక్య’లో మాత్రం వేరే స్టైల్ గెడ్డంతో ఉంటా. సరదాగా నేను గెడ్డం పెంచాను. ఈ లుక్ చాలా బాగుందని తిరు చెప్పడంతో అదే కంటిన్యూ చేశాను. స్పై ఏజెంట్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో కథ ఉంటుంది. గతంలో వచ్చిన గూఢచారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు అర్జున్. రెండు షేడ్స్ ఉంటాయి. ► మాకు బాగా దగ్గరైన వారికి ‘చాణక్య’ ప్రివ్యూ వేశాం. వారంతా సినిమా చాలా బాగుందన్నారు. సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి కూడా ఇదే మాట వస్తుందనే నమ్మకం ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాని నా ఫ్రెండ్ ప్రభాస్ చూడలేదు. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ► ‘చాణక్య’ సినిమాని మేలో విడుదల చేయాలనుకున్నాం. అయితే చివరి రోజు షూటింగ్లో బైక్ స్కిట్ అవడంతో నాకు బాగా గాయాలయ్యాయి. దాంతో షూటింగ్ ఆగిపోయి, విడుదలకు మూడు నెలలు ఆలస్యం అయింది. ‘సైరా’ ప్యాన్ ఇండియన్ సినిమానే. అయితే దసరా పండగ సమయం కావడంతో రెండు మూడు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మా చిత్రం కూడా విడుదల చేస్తున్నాం. ► నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే సెట్స్‌లో త్వరగా ఎవరితోనూ మాట్లాడను. అది హీరోయిన్ అయినా? ఎవరైనా సరే. మన కెరీర్లో ఏ సినిమా ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. మా వరకూ కష్టపడి మంచి సినిమా చేస్తాం. విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. అయితే నా కెరీర్‌కి ‘చాణక్య’ సినిమా ప్లస్ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ► మా సినిమాకి నేపథ్య సంగీతం వెన్నెముకలాంటిది. చక్కగా కుదిరింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌లోని డైలాగులకు మంచి స్పందన వస్తోంది. సినిమాలోనూ చాలా మంచి డైలాగులున్నాయి. నా కెరీర్లో చాలా మంది తమిళ డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. నాకు కథ ముఖ్యం.. భాష కాదు. డైరెక్టర్ తిరు మంచి ప్రతిభావంతుడు. తెలుగు నుంచి వెళ్లి తమిళ్లో సెటిల్ అయ్యాడు. తనతో పని చేయడం సౌకర్యంగానే అనిపించింది. అనిల్ సుంకరగారు ప్యాషనేట్ నిర్మాత. ప్రేక్షకులకు ఇంకా బాగా ఏం ఇవ్వగలం? అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారాయన. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ► మీరు ప్యాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్నకు గోపీచంద్ బదులిస్తూ.. ‘తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఈ మధ్యే గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా ఇది చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు చేద్దాం (నవ్వుతూ)’ అన్నారు. ప్రస్తుతం బిను సుబ్ర మణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాకే సంపత్ నంది సినిమా మొదలవుతుంది. ఈ రెండూ మంచి కథలే. -
ఆ సినిమాతో పోలిక లేదు
‘‘మాది ఆంధ్ర–తమిళనాడు బోర్డర్లోని ఓ గ్రామం. మాకు చిత్తూరు కేవలం 29 కిలోమీటర్లు. దీంతో చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూశాను’’ అని దర్శకుడు తిరు అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరు మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ శివ, నేను ఓ తమిళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశాం. శివ దర్శకత్వం వహించిన ‘శౌర్యం’ చిత్రం నుంచి గోపీగారితో నాకు పరిచయం ఉంది. ‘శౌర్యం’ టైమ్‌లోనే గోపీగారితో ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలనుకున్నాను. ‘చాణక్య’ కథ ఆయనకు నచ్చడంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలపై పరిశోధన చేసి కథ రాసుకున్నా. ఓ రకంగా ఈ సినిమా చేయడానికి రవీంద్ర అనే ఒక స్పై నాకు స్ఫూర్తి. వాస్తవికతకు దగ్గరగా, వాణిజ్య అంశాలు మిస్ కాకుండా తెరకెక్కించాను. రా ఏజెంట్ చూసినా సంతప్తి పడేలా ఈ చిత్రం ఉంటుంది. మా సినిమాని సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’ చిత్రంతో పోల్చుతున్నారు. నిజానికి ఇది కొత్త కథ, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా చివరి రోజు ఫైట్ సన్నివేశంలో గోపీగారికి పెద్ద గాయం అయినా చాలా ధైర్యంగా ఉన్నారు. నిర్మాతలు, నేను ఈ చిత్రం విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ, ‘చాణక్య’ రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచిస్తా’ అన్నారు. -
జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది
‘‘లైఫ్ అంటేనే స్ట్రగుల్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్ట్రగుల్ ఉంటుంది. నా లైఫ్‌లో కూడా. ప్రతి రోజూ మన జీవితం మనకు ఎంతో కొంత నేర్పుతుంది. మనకు మనం నిజాయతీగా ఉండటం ముఖ్యం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు నా దృష్టిలో సరైనవే. కానీ అన్నిసార్లు మన నిర్ణయాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాంటి అనుభవాలను లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటాను’’ అన్నారు మెహరీన్. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్ కథానాయికలుగా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన సంగతులు. ►తెలుగులో ‘చాణక్య’ నా 11వ సినిమా. ఈ సినిమాలో నేను ఐశ్యర్య అనే పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలీ, సునీల్, రఘుబాబు గార్లతో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇది స్పై థ్రిల్లర్. నా క్యారెక్టర్లో ట్విస్ట్‌లు ఉండవు. కానీ హీరో క్యారెక్టర్లో ఉన్న ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. హీరో క్యారెక్టర్‌కు ఐశ్వర్య ఎలాంటి సహాయం చేసిందనే అంశాలు సినిమాలో ఆసక్తికరం. ఐశ్వర్య పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేదు. భవిష్యత్‌లో తప్పక ప్రయత్నిస్తాను. ►ఒక ఆర్టిస్టుగా ప్రతి సినిమా ఆడాలనే కోరుకుంటాను. ఐశ్వర్య పాత్ర నా కెరీర్‌కి ఎంత ఉపయోగపడుతుంది? అనే విషయం నేను ఇప్పుడే చెప్పలేను. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నా బాధ్యత. ‘మహాలక్ష్మి (కృష్ణగాడి వీరప్రేమ గాథ’), హనీ (‘ఎఫ్ 2’) పాత్రలకు ఎలా కష్టపడ్డానో ఐశ్వర్య పాత్రకు అంతే కష్టపడ్డాను. ► స్పై థ్రిల్లర్స్ తీయడం అంత ఈజీ కాదు. తిరుగారు చాలా క్లారిటీ ఉన్న దర్శకులు. ఎలాంటి షాట్స్ కావాలో అవే తీసుకున్నారు. ‘పంతం’ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘చాణక్య’ సినిమాలో గోపీచంద్‌గారితో కలిసి నటించాను. మంచి కో–స్టార్. గోపీగారు తన పని తాను చూసుకుంటారు. ఓర్పు చాలా ఎక్కువ. నిర్మాతలు అనిల్ సుంకర, గోపీ, రామ్గార్లు నన్ను ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనిల్‌గారు నేను ఎప్పుడు కనిపించినా మహాలక్ష్మీ అని పిలుస్తారు. అనిల్‌గారి బ్యానర్లో ‘చాణక్య’ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ►స్క్రిప్ట్ తెలిసినప్పుడు అందులో మనల్ని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆ పాత్రలో మనకి మనం నచ్చకపోతే ఆడియన్స్‌కు కూడా నచ్చకపోవచ్చు. అందుకే నాకు సంతృప్తినిచ్చే పాత్రలే చేయాలనుకుంటాను. నా తమ్ముడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. నాకూ ఆసక్తి ఉంది. కానీ మంచి స్క్రిప్ట్ కుదరాలి. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలే చేశాను. యాక్షన్ సినిమాలు చేయడం కూడా ఇష్టమే. అయితే మంచి కథ కుదరాలి. ►ప్రత్యేకంగా డ్రీమ్ రోల్ అనేది లేవు. అనుష్కగారు ‘అరుంథతి, బాహుబలి’, సమంతగారు ‘రంగస్థలం, ఓ బేబి’, కీర్తీ సురేష్ ‘మహానటి’ సినిమాల్లో అద్భుతంగా నటించారు. అలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయడం ఇష్టం. ►నా మాతృభాష పంజాబీ. కానీ తెలుగు పరిశ్రమను నేను అమ్మలా భావిస్తాను. తెలుగు సినిమాలకే నా తొలిæప్రాధాన్యం. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌గారితో ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్యతో ‘అశ్వత్థామ’ చిత్రాలతో పాటు తమిళంలో ధనుష్గారితో ‘పటాస్’ సినిమాలో నటిస్తున్నాను. ఈ ఏడాది పంజాబీలో రెండు సినిమాలు చేశాను. ఒకటి రిలీజైంది. మరొకటి రిలీజ్ కావాల్సి ఉంది. కన్నడలో ఓ సినిమా చేయాల్సింది. కానీ చేతిలో ఎక్కవ సినిమాలు ఉండటంతో చేస్తున్న పాత్రలపై ఫోకస్ తగ్గుతుందని భావించి ఆ సినిమా ఒప్పుకోలేదు. మరో రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. -
గోపీచంద్ కెరీర్లో గేమ్ చేంజర్ మూవీ
‘‘ఏడాదిన్నర క్రితం తిరు ఈ కథ చెప్పినప్పుడు కొన్ని మార్పులు చెబితే చేశాడు. కథ అద్భుతంగా ఉంది. చెప్పిన కథను చెప్పినట్లుగానే తిరు అద్భుతంగా తీశాడు. అనిల్ సుంకరగారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రాజీపడకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. వెట్రితో నాకిది నాలుగో సినిమా. ఆయన ఫోటోగ్రఫీ బ్యూటిఫుల్. అబ్బూరి రవి డైలాగ్స్ ట్రెండీగా ఉంటాయి. ఈ సినిమాలో నాతో హిందీలో కూడా డైలాగ్స్ చెప్పించారు. రాజస్థాన్ ఎండలో, చలిలో మా టీం చాలా కష్టపడి చేశాం’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ హీరో హీరోయిన్లుగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘చాణక్య’. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్బంగా గురువారం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘స్పై బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘చాణక్య’ మా బేనర్‌కు ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. తిరు చాలా టాలెంటెడ్. ఈ సినిమాకి మేం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద రెండింతలు కనపడేలా చేశారు. ఈ స్పై థ్రిల్లర్‌లో మంచి వినోదం కూడా ఉంది. గోపీచంద్ కెరీర్లో ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి పాటలు రాశారు’’ అన్నారు. తిరు మాట్లాడుతూ – ‘‘సినిమా పై 100 శాతం నమ్మకంగా ఉన్నాం. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్. అనిల్ సుంకర గారు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు’’ అన్నారు. రచయితలు అబ్బూరి రవి, రామజోగయ్య శాస్త్రి, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ, కో–ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకిషోర్ గరికపాటి. -
‘చాణక్య’గా గోపిచంద్
ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గోపీచంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆదివారం దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు తిరు.. గోపీచంద్‌ను సరికొత్త పంథాలో చూపిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
రేపే గోపిచంద్ కొత్త మూవీ టైటిల్
పంతం సినిమాతో గతేడాది పలకరించిన గోపిచంద్.. ఈ ఏడాది కూడా ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజస్థాన్‌లో మొదలైన మొదటి షెడ్యూల్ గాయపడిన గోపిచంద్.. ఇటీవలె మళ్లీ షూటింగ్‌కు రెడీ అయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్‌ను రేపు ప్రకటించనున్నారు. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను రేపు ఉదయం 11.34 గంటలకు ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని, ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో రేపు తేలనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
మరో సినిమా లైన్లో పెట్టిన మాస్ హీరో
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు సాదించటంలో ఫెయిల్ అవుతున్న నటుడు గోపిచంద్. యాక్షన్ చిత్రాల హీరోలకు ఆకట్టుకున్న గోపిచంద్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా చేస్తున్న గోపిచంద్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. తనతో గౌతమ్ నంద లాంటి స్టైలిష్ సినిమాను తెరకెక్కించిన కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు గోపిచంద్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సౌత్ సినిమాలో సల్మాన్ హీరోయిన్
సౌత్ సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు తెలుగు, తమిళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలో నటించేందుకు ముందుకు వస్తుండగా ఇప్పుడు హీరోయిన్లు కూడా సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో జరీన్ ఖాన్ కూడా చేరేందుకు రెడీ అవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన వీర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జరీన్ ఖాన్, అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. హేట్ స్టోరి 3 లాంటి సినిమాలో గ్లామర్ రోల్లో కనిపించినా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో సక్సెస్ కోసం సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది ఈ బ్యూటి. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న సినిమాలో జరీన్ ఖాన్ హీరోయిన్గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రాశీఖన్నాను ఒక హీరోయిన్గా ఫైనల్ గా చేయగా మరో హీరోయిన్ పాత్రకు జరీన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. -
ఎడారిలో యాక్షన్
రాజస్థాన్ వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు హీరో గోపీచంద్. అక్కడి ఎడారిలో విలన్స్ భరతం పడతారట. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ రాజస్థాన్‌లో జై సల్మీర్‌లో ఈ నెల 21న మొదలవుతుందని సమాచారం. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి చాన్స్ ఉందట. ఆల్రెడీ టీమ్ సెర్చింగ్ స్టార్ట్ చేశారు. త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాకు మాటల రచయిత: అబ్బూరి రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి. -
థ్రిల్లర్‌కి రెడీ
స్పైగా మారి ఏవో రహస్యాలను ఛేదించడానికి రెడీ అవుతున్నారు హీరో గోపీచంద్. మరి... ఆ రహస్యాలు ఎవరికి సంబంధించినవి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. తొలి సన్నివేశానికి ఏషియన్ సినిమాస్ సునీల్ క్లాప్ ఇచ్చారు. ఏకే ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించనున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 18న ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది మేలో సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రాహకునిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటల రచయిత. -
ఇంద్రుడు మూవీ ఆడియో లాంచ్
-
ఇంద్రుడు మూవీ పోస్టర్స్