
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నా.. కమర్షియల్ సక్సెస్‌లు సాదించటంలో ఫెయిల్ అవుతున్న నటుడు గోపిచంద్. యాక్షన్ చిత్రాల హీరోలకు ఆకట్టుకున్న గోపిచంద్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా చేస్తున్న గోపిచంద్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు.
తనతో గౌతమ్ నంద లాంటి స్టైలిష్ సినిమాను తెరకెక్కించిన కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నాడు గోపిచంద్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడిగా తమన్నా నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment