
గతేడాది రామబాణం మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం ఆయన విశ్వం చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే గోపిచంద్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ కెరీర్‌లో సహకరించిన నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. మీరే నా బలం అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేదని గుర్తు చేసుకున్నారు. మీ మద్దతు నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం సినిమాతో మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 2001 తొలివలపు మూవీతో గోపించంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జయం మూవీతో విలన్‌గా మెప్పించి.. హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
🙏❤️ pic.twitter.com/9XQhJYx7wV
— Gopichand (@YoursGopichand) August 3, 2024
Comments
Please login to add a commentAdd a comment