‘‘కెరీర్ తొలి రోజుల్లో నేను ఎప్పుడూ విచారంగా ఉండేదాన్ని. అందుకేనేమో ఏడ్చే సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేనిప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో’’ అన్నారు హీరోయిన్ నిత్యా మీనన్. అందం, అభినయంతో నటనకుప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ . తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’(తెలుగులో తిరు) సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యా మీనన్.
కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున ్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఇఫీ)లో పాల్గొన్న నిత్యామీనన్ .. సినిమాల్లో తన పాత్రల ఎంపిక గురించి మాట్లాడారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటనకు అంతప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. ఆ తర్వాత కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నా. నటనకిప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లే ఎంచుకున్నాను. నటన అనేది భావోద్వేగానికి సంబంధించినది.
దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అవసరం లేదు.. అందులో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే చాలు. మనం చేసే పాత్రలపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వాటిని ఎంచుకుంటే మంచి ఆదరణ లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆ ప్రభావం చేసే పాత్రపై పడుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యా మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్‌తో ‘ఇడ్లీ కడై’, విజయ్ సేతుపతితో ఓ సినిమా, ‘గోల్డెన్ వీసా’ చిత్రంలోనూ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment