Best Actress Award
-
కాన్స్‌లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్‌లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్‌లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్‌కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్‌లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్‌లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్‌కతా. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్‌లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్‌లో 2020 జూన్‌లో ‘ది షేమ్‌లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్‌కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్‌కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్‌గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న నటి గాయత్రి
తమిళ సినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటిగా గాయత్రి అవార్డును గెలుచుకున్నారు. గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న నటి గాయత్రి. ఇటీవల కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన సూపర్ హిట్ చిత్రం విక్రమ్‌లోనూ నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళం చిత్ర పరిశ్రమలోను ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. కాగా ఇటీవల నటుడు విజయ్ సేతుపతికి జంటగా నటించిన మామనిదన్ ,ఇత్రం గత ఏడాది జూన్‌లో విడుదలై మంచి చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అనంతరం ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. శీనూ రామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన చెన్నై అంతర్జాతీయ చతురత్వాల్లో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. తాజాగా జైపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మామనిదన్, ఇరైవిన్ విశాల్, గార్గీ, విత్రన్ త్రాలను ప్రదర్శించారు. కాగా మామనిదన్ చిత్రంలో విజయ్ సేతుపతికి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన గాయత్రి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఆమెను చిత్ర దర్శకుడు శీను రామసామితో పాటు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. -
ఉత్తమనటి..బ్రహ్మపుత్రిక
బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండే ఆ గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావు. వరదలు రావడం, గ్రామం కొట్టుకుపోవడం యేటా మామూలే. ఇక ఆ గ్రామానికి, మిగతా ప్రపంచానికీ రాకపోకల కోసం ఒక్క వంతెనైనా లేదు. అలాంటి గ్రామానికి రెండేళ్ల క్రితం ఒక మంచి ‘సంబంధం’ కోసం నానా కాలి బాటల్లో పడి ఒక బృందం వచ్చింది! ఇంటి పని, పొలం పనీ చేయగలదు అనిపించిన 20 ఏళ్ల శివరాణి అనే మొరటు పిల్లను చూసి మరీ ఎంపిక చేసుకుంది. ఆ వచ్చిన వాళ్లు సినిమా వాళ్లు! వారి సినిమా ‘బ్రిడ్జ్’లో నటించిన ఆ బ్రహ్మపుత్రిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటి! నదికి, నది ఒడ్డున నివాసం ఉన్నవారికి మధ్య ‘బాంధవ్యం’ ఎలా ఉంటుంది? ముంచెత్తే వరదలు సైతం విడదీయలేనంత బలంగా ఉంటుంది. అస్సామీలో వచ్చిన ‘బ్రిడ్జ్’ సినిమా కథాంశం ఈ బాంధవ్యమే. బ్రహ్మపుత్ర నదికి ఉత్తరం వైపున బలిగావ్ అనే గ్రామం ఉంది. అస్సాంలోని లఖింపూర్ జిల్లా పరిధిలోని ధకువాఖన సబ్–డివిజన్ కిందికి వస్తుంది ఆ గ్రామం. వరదలు వస్తే అసలే లేకుండా పోతుంది! బ్రహ్మపుత్రకు ఏటా వరదలు తప్పవు. బలిగావ్ గ్రామానికి ముంపు తప్పదు. వరద తగ్గుముఖం పట్టాక, సూర్యుడు మేఘాల్లోంచి పైకి వచ్చిన విధంగా ఊళ్లోంచి వెళ్లిన వాళ్లు మళ్లీ ఆ ఒడ్డున ఉదయిస్తారు. పడిపోయిన ఇళ్లను పునర్నించుకుంటారు. అంతే తప్ప ఊపిరి లాంటి ఆ ఊరిని వదిలి ఎక్కడికీ వెళ్లరు. ఊరు నదితో బాంధవ్యం కలుపుకుందనే ఆ ఒక్క కారణంతో ఆ ఊరితో పొరుగూళ్లవారెవరూ సంబంధం కలుపుకోరు! ఇంకో కారణం కూడా ఉంది. బలిగావ్కు మిగతా ప్రాంతాలను కలిపే వంతెన లేదు. అలాంటి చోటుకు పిల్లను ఎలా ఇస్తారు? అక్కడి పిల్లను ఎలా తెచ్చుకుంటారు? ఇదంతా సినిమాలో అంతర్లీనంగా ఉండే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది చిత్ర కథ కాదు. ఆ చిత్రంలో ‘జానకి’ ప్రధాన పాత్ర పోషించిన అస్సామీ యువతి శివరాణి కథ. ‘బ్రిడ్జ్’ చిత్రం 2020 లో విడుదలైంది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి 28 అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు వచ్చాయి. తాజాగా కెనడాలో జరిగిన ‘అట్టావా నాల్గవ భారత చలన చిత్రోత్సవం’లో శివరాణిని ‘ఉత్తమ నటి’ అవార్డు వరించింది. ∙∙ ‘బ్రిడ్జ్’ చిత్రీకరణ జరిగే సమయానికి శివరాణి వయసు 22. ఆ సినిమాకు కథానాయిక గా ఆమె దొరికి, సినిమా పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. 89 నిముషాల ఈ చిత్రాన్ని తియ్యడానికి డైరెక్టర్ కృపాల్ కాళిత సహా టీమ్ మొత్తం దాదాపుగా ప్రతిరోజూ నీటిలోకి దిగవలసి వచ్చేది. రెండు నిముషాల సీన్ షూటింగ్‌కి ఎనిమిది గంటల సమయం పట్టిన అనుభవం కూడా వారికి ఉంది. నీళ్లలోకి దిగడం, కరెక్ట్ షాట్ కోసం గంటలు గంటలు పనిచేయడం పెద్ద కష్టమైతే కాలేదు కానీ, జానకి పాత్రకు శివరాణిని వెతికి పట్టుకోవడమే వారికి కష్టమైంది. వాళ్లకు కావలసింది చూడ్డానికి మొరటుగా, పొలం పనుల వల్ల చేతుల కాయలు కాసి ఉన్న అమ్మాయి. అలాగే ఆమెకు పొలం దున్నడం తెలిసుండాలి. పశువులు మేపగలగాలి. ఈ ‘క్వాలిటీ’లన్నిటి కోసం బలిగావ్ గ్రామం మొత్తం గాలించి 300 మంది యువతులకు ఆడిషన్ నిర్వహించి చివరికి శివరాణిని ఎంపిక చేసుకున్నారు. కథకు, కథనానికి సరిపోయేలా ఉంది శివరాణి. ఫ్రెష్‌గా కాలేజ్ నుంచి వచ్చినప్పటికీ, అప్పుడే నాగలి పట్టి పొలం దున్ని ఇంటికి వచ్చినట్లుగా ఉంది. సినిమాకు అంతవరకు చాలు. అయితే ఆమె వదనంలో లీలగా విషాదం కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు వరదల్లో చనిపోయారు. తమ్ముడు, తను.. ఇద్దరే మిగిలారు. తమ్ముణ్ణి చదివిస్తూ, తన బి.యస్సీ పూర్తిచేసుకుని ఉన్న సమయంలో ఊళ్లోకి ఈ సినిమా టీమ్ వచ్చింది. వారి సినిమాలోని ప్రధాన పాత్రకు తను ఎంపికైన వార్త వినగానే శివరాణి ఎలాగైతే మేఘాలలో తేలిపోయిందో.. ఆ పాత్రకు ఉత్తమ నటిగా తనకు అవార్డు వచ్చిందని తెలిసి ఇప్పుడూ అంతే ఆనందంలో మునిగిపోయింది. ముంచడం, తేల్చడం బ్రహ్మపుత్ర యేటా చేస్తుండే పనే. ఈ మునగడం, తేలడం మాత్రం ఆమెకు కొత్త అనుభవం. సీమా బిస్వాస్ తర్వాత ఉత్తమ నటి అవార్డు పొందిన మరొక అస్సామీ నటి శివరాణి. 2019లో ఇదే ‘అట్టావా’ చిత్రోత్సవంలో మలయాళీ చిత్రం ‘ఇదం’కి ఉత్తమ నటి అవార్డు పొందారు సీమ. ఈ ఏడాది అదే చిత్రోత్సవంలో ‘బ్రిడ్జ్’తో శివరాణి ఉత్తమ నటి అయింది. 56 ఏళ్ల విలక్షణ నటితో తనకు పోలిక రావడం కూడా శివరాణిని ఆనంద డోలికల్లో విహరింపజేస్తోంది. తండ్రే ఆమెకు నాగలితో పొలం దున్నడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే సినిమాలో పొలం దున్నుతూ కనిపిస్తున్న తనను చూసి, ఆయనతో పాటు తల్లీ సంతోషించే ఉండేవారని శివరాణి అంటోంది. ప్రస్తుతం ఆమె తన గ్రామానికి దగ్గరగా ఉండే ఉత్తర లక్ష్మీపూర్‌లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లో సూపర్వైజర్గా పని చేస్తోంది. -
నాలుగోసారి అవార్డు: ఫుల్ ఖుషీలో బాలీవుడ్ ఐరన్ లేడీ
అష్టకష్టాలు పడి సినీ పరిశ్రమకు వచ్చి హీరోయిన్గా సుస్థిర స్థానం సంపాదించుకున్న కంగనా రనౌత్ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఇంటికి అవార్డులు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో నాలుగోసారి ఉత్తమ నటిగా కంగనా అవార్డు దక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కంగనా రనౌత్ ముంబైలో స్థిరపడడానికి ఎంతో కష్టపడింది. తనలోని నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూనే కథలకు కూడా కంగనా పెద్దపీట వేస్తుంటుంది. హీరోకు పోటీగా తన పాత్ర ఉండేలా చూసుకుంటోంది. ఈ విధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె నటనకు మెచ్చి జాతీయ అవార్డులతో పాటు ఇతర అవార్డులు ఆమెను వరిస్తున్నాయి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘ప్యాషన్’ సినిమాలో నటించగా కంగనాకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. అనంతరం ‘క్వీన్’ సినిమాతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డు తొలిసారి సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమాకు రెండోసారి జాతీయ ఉత్తమ నటిగా కంగనా నిలిచింది. ఇప్పుడు మణికర్ణిక, పాంగా సినిమాల్లో నటనకు గాను ఆమెకు మరోసారి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటిగా గుర్తించి అవార్డు ప్రకటించింది. వీటితో కలిపి మూడుసార్లు ఉత్తమ నటిగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా కంగనా అవార్డులు సొంతం చేసుకుంది. అవార్డు వచ్చిన సందర్భంగా ట్విటర్లో కంగనా స్పందించారు. తనను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. జాతీయ అవార్డులు 2008 ప్యాషన్ (సహాయ నటి) 2014 క్వీన్ 2015 తను వెడ్స్ మను రిటర్న్స్ 2021 మణికర్ణిక, పాంగా కంగనా సినిమాలతో పాటు దేశంలో జరిగే పరిణామాలపై తరచూ స్పందిస్తుంటింది. ఆమెపై రాజకీయ వివాదాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం గతంలో పద్మశ్రీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకోగా.. ఫోర్బ్స్ జాబితాలో టాప్ 100లో కంగనా చోటు సంపాదించుకుంది. చదవండి: జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని #NationalFilmAwards #NationalAwards2019 #Manikarnika #Panga pic.twitter.com/nNlF7YEa3E — Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021 -
కీర్తి కొలువు
దసరా పండగ స్త్రీ శక్తిని చాటే పండగ. కీర్తీ సురేష్ నటిగా తన శక్తిని చాటింది. ‘మహానటి’లోని నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొంది తెలుగు సినిమా శక్తిని కూడా చాటింది. పురాణాలు చదివి శ్లోకాలు నేర్చుకుని అమ్మవారిని స్తుతించడం బాల్యం నుంచి ఆమెకు ఉన్న అలవాటు. బాల్యంలో బొమ్మల కొలువులో తానే ఓ బొమ్మలా కూర్చోవడం సరదా. కీర్తి సురేశ్ చెప్పిన పండగ విశేషాలు ‘సాక్షి’కి ప్రత్యేకం చిన్నప్పుడు దసరా సమయంలో ‘బొమ్మల కొలువు’ పెట్టి చాలా సందడి చేసేవారని విన్నాం. ఆ విశేషాలు చెబుతారా? కీర్తి: అవన్నీ చెప్పే ముందు గత ఏడాది దసరా సందడిని మిస్ అయ్యాను. ఈ దసరా సందడిని కూడా మిస్ అవుతున్నాను. ‘మైదాన్’ అనే హిందీ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాను. నా ఫస్ట్ హిందీ సినిమా కావడంతో చాలా ఆసక్తిగా ఉంది. ముంబైలో అక్కడక్కడా అమ్మవారి విగ్రహాలు పెట్టి, చాలా బాగా పూజలు చేస్తున్నారు. అదంతా చూస్తుంటే మా ఇంటి పండగని మిస్సవుతున్న బాధ ఉంది. చిన్నప్పటి నవరాత్రి జ్ఞాపకాలు.. చాలా ఉన్నాయి. అమావాస్య తర్వాతి రోజు నుంచి నవరాత్రులు మొదలవుతాయి. నిండు అమావాస్య రోజు మేం కుంభం పెడతాం. మాకు చాలా ఇంపార్టెంట్ అది. కుంభం పెట్టేటప్పుడు ‘లక్ష్మీ కల్యాణం, గౌరీ కల్యాణం’ పాటలు పాడటం ఆనవాయితీ. చాలా శ్రద్ధగా కుంభం పెట్టి, అక్కా (రేవతి), నేను పాటలు పాడేవాళ్లం. ఎలాంటి ఆటంకాలు లేకుండా మిగతా తొమ్మిది రోజుల పూజలు జరగాలని కోరుకుంటాం. బొమ్మల కొలువు విశేషాలు? మాది కేరళ అయినప్పటికీ నా చిన్నప్పుడు చెన్నైలో చదువుకున్నాను. చెన్నైలో బొమ్మల కొలువు సందడి చాలా బాగుంటుంది. కేరళలో అంత పాపులర్ కాదు. చెన్నైలో ఉన్నప్పుడు మాత్రం దాదాపు ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు ఏర్పాటు చేసేవాళ్లం. బొమ్మలు పెట్టడానికి మెట్లు ఏర్పాటు చేసే పనంతా అమ్మదే. నేను, మా అక్క చక్కగా థర్మాకోల్‌తో పార్క్ రెడీ చేసేవాళ్లం. దానికోసం ఇసుక తెచ్చేవాళ్లం. చెట్ల బొమ్మలు కొనేవాళ్లం. బొమ్మలన్నీ మీరు, మీ అక్కే కొనేవారా? షాపింగ్ అంతా అమ్మదే. అయితే మేం ఏర్పాటు చేసిన పార్క్‌లో జంతువులు అవీ పెట్టడానికి మాత్రం బొమ్మలను నేనే కలెక్ట్ చేసేదాన్ని. ఆ చాక్లెట్ పేరు గుర్తుకు రావడంలేదు కానీ, అది కొంటే ఒక జంతువు బొమ్మ ఇచ్చేవారు. దాంతో పండగ సమయంలో ఆ చాక్లెట్లు బాగా కొనేదాన్ని. అలా బోలెడన్ని యానిమల్స్ కలెక్ట్ చేసి, బొమ్మల కొలువులో పెట్టేదాన్ని. సరదా కోసం నేనూ బొమ్మలా కూర్చునేదాన్ని. ఇందాక అమావాస్య రోజు కుంభం పెట్టేటప్పుడు పాటలు పాడేవాళ్లం అన్నారు.. మీరు నేర్చుకున్నారా? అవును. అమ్మ మాకన్నీ చాలా ఇంట్రస్ట్‌గా నేర్పించేది. మ్యూజిక్ క్లాసెస్‌కి వెళ్లేవాళ్లం. మా ఇంట్లో నవరాత్రులకు మేమే పాడేవాళ్లం. ఇరుగు పొరుగు పిలిచినప్పుడు వాళ్లింటికి వెళ్లి కూడా పాడేవాళ్లం. నాకు ముఖ్యంగా ‘ఎన్న తవమ్ సెయ్‌దేనో...’ (ఏ తపం చేశానో) పాట అంటే ఇష్టం. కృష్ణుడి పాట అది. మా ఇంటి పండగలో కచ్చితంగా ఆ పాట పాడాల్సిందే. చిన్నప్పుడు కృష్ణుడంటే ఉన్న ఇష్టం పెద్దయ్యాక కూడా తగ్గలేదు. అయితే నా ఇష్టదైవాల జాబితాలో ఆ తర్వాత సాయిబాబా, హనుమాన్ కూడా చేరిపోయారు. మీకు తెలిసిన నవరాత్రుల విశిష్టత గురించి చెబుతారా? తొమ్మిది రోజుల్లో ముఖ్యంగా మొదటి మూడు రోజులు లక్ష్మీదేవి, తర్వాతి మూడు రోజులు సరస్వతీదేవి, చివరి మూడు రోజులు పార్వతీదేవిని పూజిస్తాం. నవరాత్రి అంటే లెక్క ఇదే. నేను వయొలిన్, కీ బోర్డ్ నేర్చుకున్నాను. మధ్యలో వయొలిన్ ప్రాక్టీస్ మానేశాను. సరస్వతీ దేవి పూజ అప్పుడు ఆ రెండింటినీ, నా స్కూల్ బుక్స్ పెట్టేదాన్ని. మా అక్క ఏమో తన కాళ్ల గజ్జెలు, బుక్స్ పెట్టేది. మా అమ్మగారి గజ్జెలు, వీణ కూడా పెట్టేవాళ్లం. అమ్మవార్లను చాలా బాగా అలంకరించేవాళ్లం. మరి మీరు, మీ అక్క ఎలా అలకరించుకునేవాళ్లు? మా అమ్మగారికి చాలా శ్రద్ధ. పట్టు లంగాలు, జాకెట్టులు కుట్టించేది. లక్ష్మీదేవి అంటే ఎరుపు అని, ఆ రంగు డ్రెస్సులు కుట్టించేది. లక్ష్మీదేవి పూజ అప్పుడు అవి వేసుకునేవాళ్లం. సరస్వతీదేవి పూజ అప్పుడు తెలుపు రంగు, పార్వతీదేవికి ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుని, పూజించేవాళ్లం. మాకు నగలు బాగా పెట్టేది. వడ్డాణం కూడా పెట్టుకునేవాళ్లం. మా ఇద్దరి జుత్తు చాలా షార్ట్‌గా ఉండేది. మా అమ్మగారు చక్కగా ముడి వేసి, దాని చుట్టూ పువ్వులు పెట్టేవారు. పండగ వస్తోందంటే మేం గోరింటాకు కూడా పెట్టుకునేవాళ్లం. పురాణాలు బాగా తెలుసా? బాగా తెలుసు. మహాభారతంలో ఉన్న కథలన్నీ మా అమ్మగారు చెప్పారు. మహాభారతం మెయిన్ స్టోరీస్ నుంచి చిన్న కథల వరకూ అన్నీ చెప్పారు. ‘భగవద్గీత’లోని 18 అధ్యాయాలు మాకు తెలుసు. రామాయణం కూడా తెలుసు. నేను, అక్క రాముడు పెద్దా? లక్ష్మణుడు పెద్దా? పాండవులు ఎవరు? వంటి మహాభారతం, రామాయణానికి సంబంధించిన పోటీలకు వెళ్లేవాళ్లం. తమిళ్ ‘తిరక్కురళ్’ వచ్చు. దానికి సంబంధించిన పోటీలకు వెళ్లి బహుమతులు గెల్చుకుని వచ్చేవాళ్లం. అయ్యప్ప స్వామి కథలు తెలుసు. అవతారాల గురించి తెలుసు. బోలెడన్ని శ్లోకాలు వచ్చు. కనకధార, విష్ణు సహస్ర నామం, కందర్ షష్టి కవచం.. ఇలా అన్ని శ్లోకాలూ వచ్చు. ఇంట్లో ఖాళీ సమయాల్లో, కారులో వెళ్లేటప్పుడు మా అమ్మగారు ఇవన్నీ నేర్పించారు. నవరాత్రి ప్రసాదాల గురించి? ఈ తొమ్మిదిరోజులు తప్పకుండా చేయాల్సిన ప్రసాదం ‘సుండల్’. ఒక్కోరోజు ఒక్కో ధాన్యంతో సుండల్ చేస్తాం. ఒకరోజు బఠానీ సుండల్, పెద్ద శనగలతో, చిన్న శనగలతో, పచ్చిశెనగపప్పు సుండల్.. ఇలా రోజుకొకటి చేస్తాం. ముందు రోజు నానబెట్టి, తర్వాతిరోజు తాలింపు వేస్తాం. ఇంటికి వచ్చినవాళ్లకు తాంబూలంతో పాటు సుండల్ ఇస్తాం. ప్రసాదాల తయారీ అంతా అమ్మ పనే. తినడం మా వంతు (నవ్వు). ఓకే.. ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ‘మహానటి తర్వాత మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’తో పాటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు.. ఇది కావాలని ప్లాన్ చేసింది కాదు. వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వచ్చింది. అన్ని కథలూ బాగున్నాయి. అందుకని కాదనలేకపోయాను. అంతేకానీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కే పరిమితం కావాలనుకోవడంలేదు. ఫైనల్లీ.. నవరాత్రి సందర్భంగా మీరేం చెప్పదలచుకున్నారు? అమ్మవారు అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీలకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. స్త్రీ అంటేనే శక్తి. కానీ శక్తి లేనివాళ్లం అని చాలామంది అనుకుంటారు. ముందు మన శక్తిని మనం తెలుసుకోగలగాలి. మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూనే మనం సాధించాలనుకున్నది సాధించాలి. దసరా పండగకి సంబంధించి అమ్మకి ఒక తీరని కోరిక ఉంది. చెన్నైలో చాలామంది బొమ్మల కొలువు ఏర్పాటు చేసి, ఒక రోజు అనుకుని అందర్నీ పిలుస్తుంటారు. ఇప్పటివరకూ అమ్మ అలా చేయలేదు. మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాం.. రండి అని ఆహ్వానించడమే. దాంతో ఒకేరోజు కాకుండా ఎవరి ఇష్టం వచ్చిన రోజు వాళ్లు వచ్చి వెళుతుంటారు. అలా కాకుండా ఒకరోజు అనుకుని, అందర్నీ పిలిచి గ్రాండ్‌గా చేయాలన్నది అమ్మ కోరిక. పెళ్లయ్యాక అక్క విదేశాల్లో ఉంటోంది. నేను సినిమాలతో బిజీ. మా ఇద్దరికీ కుదిరినప్పుడు అమ్మ ఇలా ఏర్పాటు చేయాలనుకుంటోంది. వచ్చే సంవత్సరం ట్రై చేస్తాం. – డి.జి. భవాని -
అవార్డు అందుకున్న శ్రీదేవి కుటుంబం
న్యూఢిల్లీ: గతేడాది విజయవంతమైన మామ్ చిత్రంలోని నటనకు గానూ శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీదేవి కుటుంబ సభ్యులు బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలు అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 65వ జాతీయ చలనచిత్రోత్సవం అవార్డులను ఏప్రిల్ 13న ప్రకటించిన విషయం విదితమే. ముందుగానే నిర్ణయించిన షెడ్యుల్ కారణంగా... రామ్‌నాథ్ కోవింద్ ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఏఆర్ రెహ్మాన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగానే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. అయితే దీనికి భిన్నంగా రాష్ట్రపతి కోవింద్ మాత్రం గంట సమయాన్నే వెచ్చించారు. మిగతా అవార్డులను సంబంధింత మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ప్రదానం చేస్తారని తెలిపారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన అవార్డు గ్రహీతలు కంగుతిన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు కాబట్టే వీటికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. అలాంటిది రాష్ట్రపతి కార్యక్రమంలో మధ్యలోనే వెళ్లిపోవడంతో అవార్డు గ్రహీతలు నిరసన వ్యక్తం చేశారు. కేవలం 11 మందికి మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. -
నువ్వు అహంకారి అన్నారు
తన ఒపీనియన్ వ్యక్తపరచడంలో ఎప్పుడూ వెనకాడరు మలయాళీ బ్యూటీ ‘పార్వతి’. ‘‘కేవలం యాక్టర్ అయ్యాక వచ్చిన యాటిట్యూడ్ కాదిది. చిన్నప్పటినుంచి నాకు అనిపించింది చెప్పడం అలవాటు. నా ముక్కుసూటితనం వల్ల ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను’’ అంటున్నారామె. చిన్నప్పటి నుంచి ప్రశ్నించే స్వభావం గురించి పార్వతి మాట్లాడుతూ– ‘‘ఇలా ప్రశ్నలు వేసే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఈ క్వొశ్చనింగ్ నేచర్ చిన్నప్పటి నుంచి నాతో ఉండిపోయింది. అబ్బాయిలే చెట్లెందుకు ఎక్కాలి? అమ్మాయిలెందుకు ఎక్కకూడదు? అని అడిగేదాన్ని. అందరి శరీరాకృతి ఒక్కటే కదా? అందరూ సమానమే కదా. అమ్మాయిలు చెట్లు ఎక్కలేక కాదు. అమ్మాయిల్ని అలా చేయనీకూడదు అని వీళ్లు (సొసైటీ) అనుకున్నారంతే. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. అలాగే కెరీర్ బిగినింగ్‌లో ‘నేను స్క్రిప్ట్ చూడాలి’ అని, ‘ఇంత రెమ్యునరేషన్ కావాలి’ అని అడిగాను. అంతే.. అప్పటి నుంచి నన్ను ‘అహంకారి’ అనేవారు. కానీ, ట్రూ ఆర్టిస్ట్‌ని, ఆర్ట్‌ని ఎవ్వరూ ఆపలేరు కదా?’’ అని పేర్కొన్నారామె. రీసెంట్గా ‘టేక్ఆఫ్’ సినిమాకు పార్వతి బెస్ట్ యాక్ట్రెస్‌గా జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. -
అక్షరహాసన్‌కు అవార్డు
చెన్నై ,కొరుక్కుపేట: నటి అక్షరహాసన్‌కు ఉత్తమ వర్ధమాన నటి అవార్డును గెలుచుకుంది. ఒలివా స్కిన్ అండ్ హెయిర్ క్లి్లనిక్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ప్రోవోక్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒలివా అడిషనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేత డమిశెట్టి చేతులమీదుగా అక్షరహాసన్ అవార్డు అందుకున్నారు. ఇందులో ఒలివా ఎండీ డాక్టర్ సోమప్రశాంత్, సీఓఓ ప్రకాష్ చారి ఉన్నారు. -
ఫొటోగ్రాఫ్... స్వీట్ మెమరీ!
ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న బ్రీ లార్సెన్ గత ఏడాది మేలో హైదరాబాద్‌లో ఉన్నారు. మంచు మనోజ్ వివాహ వేడుకల్లో పాల్గొడానికి ఈ విదేశీ అందం మన దేశానికి వచ్చారు. హైదరాబాద్‌లో సెటిల్ కాకముందు లక్ష్మీ మంచు లాస్ వేగాస్‌లో అమెరికన్ టీవీ సిరీస్‌లో నటించారు. ఆ తర్వాత ఆమె నటించి, స్వీయదర్శకత్వం వహించిన ‘పర్ఫెక్ట్ లైవ్స్’ అనే షార్ట్ ఫిలిం లాస్ ఏంజిల్స్‌లోని ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. హాలీవుడ్వారితో లక్ష్మీకి మంచి అనుబంధం ఉంది. అందుకే తమ్ముడు మనోజ్ పెళ్లికి బ్రీ లార్సెన్‌ని పిలవడం, ఆమె హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలో తన సతీమణి ప్రణతితో కలిసి దిగిన ఫొటోను బ్రీ లార్సెన్ ఆస్కార్ గెల్చుకున్న సందర్భంగా మనోజ్ ట్విట్టర్లో పెట్టారు. -
ఇస్తే... వస్తా!
నటీమణులకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించడం అన్నది ఖచ్చితంగా వారి ప్రతిభకు నిదర్శనమే. అలాంటి అవార్డుకు అందుకున్న తరువాత అవకాశాలకు దూరమైన హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఈమెలో అందంతో పాటు అభినయం మెండుగా ఉంది. కోలీవుడ్‌లో తొలి రోజుల్లోనే పరుత్తివీరన్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సహజ నటి ప్రియమణి. అలాంటి నటిని తమిళ చిత్ర పరిశ్రమ పక్కన పెట్టడం బాధాకరం. అయితే తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయిందేమో గానీ ఆమె సినిమా మంత్రం వదలిపెట్టలేదు. మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూనే ఉన్న ప్రియమణితో చిట్ చాట్ తమిళ సినిమా పక్కకే రావడం లేదు ఎందుకు? రానని నేనెప్పుడైనా ఎవరితోనైనా చెప్పానా? అవకాశాలు ఇస్తే వెంటనే వస్తాను. అవకాశాలు ఇవ్వండని అడగలేనుగా. ఈ విషయం దర్శక నిర్మాతలను ప్రశ్నించండి. వారేమి బదులిస్తారో చూద్దాం. ప్రస్తుతానికి ఒకరిద్దరు తమిళంలో అడగారు కానీ ఆ కథలు నచ్చలేదు. మంచి కథ, బలమైన పాత్ర ఉంటే మరుక్షణమే చెన్నైలో వాలిపోతా. జాతీయ అవార్డు అందుకున్న తరువాత గ్లామర్ పాత్రలే చేస్తున్నారు కదా? ఏ ప్రేక్షకుడు? ఎవరితో అలా అన్నారో చెప్పండి. ఇది చాలాకాలంగా నన్ను వెంటాడుతున్న ప్రశ్న. జాతీయ అవార్డు గెలుచుకుంటే ఆ తరువాత కాలమంతా ఆ తరహా పాత్రలనే పోషించాలా? లంగా ఓణీలే ధరించాలా? నా వయసు హీరోయిన్లందరూ రకరకాల డ్రస్సులు ధరించి నటిస్తుంటే నేను మాత్రం అలా నటించకూడదా? లెస్బియన్స్‌కు మద్దతు పలికి వివాదం రేపారే? ఇక్కడ ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. నేనొక మలయాళ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లెస్బియన్స్ ప్రస్తావన వచ్చింది. అది వారి వ్యక్తిగత విషయం మాత్రమే కానీ, అది తప్పా? ఒప్పా? అని నిర్ధారించడానికి మనమెవరం? అని చెప్పాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నేనా తరహా చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం చేశారు. లెస్బియన్ల తరహా చిత్రంలో షబ్నా ఆజ్మీ‘ఫైర్’లో నటించారు కదా? ఆమె బాలీవుడ్లో నటించారు. అక్కడ ఆ విషయాన్ని భూ తద్దంలో చూడరు. ఇక్కడ అలా నటిస్తే మీడియా ఏకిపారేస్తుంది. అదే విధంగా దక్షిణాది సినీ ప్రేక్షకులు అలాంటి చిత్రాలను స్వాగతించారు. ప్రేక్షకులు సచ్చని చిత్రాల్లో నేను నటించను. బెంగళూరు భామలు రాజకీయాలపై మక్కువ చూపుతున్నారు. మీకు ఆసక్తి ఉందా? జ: రాజకీయాలు నాకు సెట్ కావు. అందుకు చాలా అనుభవం కావాలి. నాకంత అనుభవం, ప్రతిభ లేవు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను రాజకీయాల జోలికి పోను. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? కన్నడంలో దర్శన్ సరసన అమ్రిషా అనే చిత్రంలో నటిస్తున్నాను. విదేశాల నుంచి తిరిగొచ్చే ఎన్ఆర్ఐ యువతి పాత్ర. అదే విధంగా మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నాను. ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులోను నా పాత్ర వైవిధ్యభరితంగా ఉంటోంది. ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారట...! అట్టే చూస్తూ ఉంటే నా పెళ్లి ముహుర్తం కూడా నిర్ణయించేట్టున్నారు. నా పెళ్లికి ఇప్పుడు అవసరం ఏముంది? నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలియచేస్తాను. అయినా నా పెళ్లి గురించి చింతించడానికి మా అమ్మ ఉంది. ఇతరులకెందుకు అంత బాధ.