
తమిళ సినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటిగా గాయత్రి అవార్డును గెలుచుకున్నారు. గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న నటి గాయత్రి. ఇటీవల కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన సూపర్ హిట్ చిత్రం విక్రమ్‌లోనూ నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళం చిత్ర పరిశ్రమలోను ప్రముఖ నటిగా రాణిస్తున్నారు.
కాగా ఇటీవల నటుడు విజయ్ సేతుపతికి జంటగా నటించిన మామనిదన్ ,ఇత్రం గత ఏడాది జూన్‌లో విడుదలై మంచి చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అనంతరం ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. శీనూ రామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది.
ఇటీవల చెన్నైలో జరిగిన చెన్నై అంతర్జాతీయ చతురత్వాల్లో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. తాజాగా జైపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మామనిదన్, ఇరైవిన్ విశాల్, గార్గీ, విత్రన్ త్రాలను ప్రదర్శించారు. కాగా మామనిదన్ చిత్రంలో విజయ్ సేతుపతికి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన గాయత్రి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఆమెను చిత్ర దర్శకుడు శీను రామసామితో పాటు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment