‘‘అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నాపాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను’’ అంటున్నారు హీరోయిన్ నిత్యామీనన్. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఈ మలయాళ బ్యూటీ. ఇక ధనుష్ హీరోగా, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’ (తెలుగులో ‘తిరు’). మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు నిత్యామీనన్.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ– ‘‘తిరు’కి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంటానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేనుపోషించిన ప్రతిపాత్రకు గుర్తింపు రావాలనుకోను. ఆపాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకునే ఎంపిక చేసుకుంటాను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో చాన్స్ వచ్చినా మొహమాటం లేకుండా చేయనని చెబుతాను. అలాంటిపాత్రలపై నాకు ఆసక్తి లేదు. మంచిపాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తాను. అందరూ అనుసరిస్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్లాలనే రూల్ లేదు కదా?’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment