Dhanush Thiru Movie Premiere On This OTT Platform - Sakshi
Sakshi News home page

Thiru OTT Streaming: ఓటీటీలోకి ధనుష్‌ తిరు మూవీ! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Published Fri, Sep 2 2022 9:07 PM | Last Updated on Fri, Sep 2 2022 9:48 PM

Dhanush Thiru Movie Premiere On This OTT Platform - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు). నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం, ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్‌ ఆర్‌.జవహర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 18న విడుదలై హిట్‌టాక్‌ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

చదవండి: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్‌ భార్య, ఫొటోలు వైరల్‌

కేవలం తమిళంలోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్‌నెక్ట్స్‌ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న తరుణంలో ఓటీటీలోకి నెల రోజుల్లోనే రాబోతుందని వినికిడి. అంటే ఈ తాజా బజ్‌ ప్రకారం.. తిరుచిట్రంపళం(తిరు) సెప్టెంబర్ 17 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చదవండి: ‘జల్సా’ రీ-రిలీజ్‌, థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement