Rashi Kanna
-
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్‌స్టార్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు!
ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంటే బాలీవుడ్ మాత్రం అపజయాలతో సతమతమవుతోంది. ఇటీవల షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణే జంటగా నటించిన పఠాన్ చిత్రం సంచలన విజయం సాధించింది. వరుస అపజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు ఊపిరి పోసిందనుకుంటే ఆ తరువాత మళ్లీ పరిస్థితి షరా మామూలుగానే మారింది. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్లుగా పేరున్న వారంతా తమ గోల్ బాలీవుడ్‌గానే భావిస్తున్నారు. ఇంతకు ముందు నటి శ్రీదేవి, జయప్రద వంటి వారు బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు. అదే బాటలో ఇప్పుడు నటి రష్మిక మందన్నా, రాశీఖన్నా, పూజాహెగ్డే వంటి వారు బాలీవుడ్ పిలుపుతో అక్కడికి పరుగు పెడుతున్నారు. అయితే వీరి పరిస్థితి రివర్స్ గేర్‌ను తలపిస్తోంది. (ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ) అక్కడ వీరంతా ఒక్క హిట్ కోసం ఆరాటపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తోంది. నటి రాశీఖన్నా బాలీవుడ్లో కొన్ని చిత్రాల్లో నటించింది. అదే విధంగా నటి పూజాహెగ్డే ఇటీవల నటించిన చిత్రాలన్నీ వరుసగా అపజయం పాలవుతున్నాయి. నటి రష్మిక మందన్నా విషయానికి వస్తే అక్కడ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై చిత్రం ఆమెను పూర్తిగా నిరాశ పరిచింది. ఈ తరువాత అక్షయ్‌కుమార్‌తో జత కట్టిన చిత్రం ప్లాప్ అయ్యింది. ఇలా వరుసగా రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడం రష్మిక కెరీర్‌కు దెబ్బ తీసిందనే ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం నటిస్తున్న యానిమల్ చిత్రం పైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. మరిన్ని అవకాశాల కోసం సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకున్నట్లుంది. స్పెషల్ ఫొటో సెషన్లతో రకరకాల ఫొటోలను తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలా ఇక్కడ టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న నటీమణులు బాలీవుడ్ అచ్చిరావడం లేదనే ప్రచారం జోరుందుకుంది. కాగా ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప– 2, నితిన్‌తో ఓ చిత్రం చేస్తోంది. (ఇది చదవండి: స్డేడియంలో వాలిపోయిన ప్రేమజంట.. సోషల్ మీడియాలో వైరల్) -
'సర్దార్' నాకో సవాల్.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది: కార్తి
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేఖరుల సమావేశంలో 'సర్దార్' విశేషాలని పంచుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు.. కొంచెం గ్యాప్ లోనే సర్దార్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ? పొన్నియిన్ సెల్వన్ సమ్మర్ కి రావాలి. కొంచెం ఆలస్యంగా వచ్చినా గొప్ప విజయాన్ని అందుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఒక సిసినిమా తీసుకురావాలంటే ఖచ్చితంగా కొత్తగా స్పెషల్ గా ఉండాలి. అలా ఇండియన్ స్పై థ్రిల్లర్ గా సర్దార్ వస్తోంది. ఇందులో మొదటిసారి తండ్రి కొడుకుల పాత్రలో కనిపిస్తున్నా. కథ ప్రకారం చాలా గెటప్స్ ఉంటాయి. ఇప్పటివరకూ నేర్చుకున్నది ఒక పరీక్షలా ఉంది.(నవ్వుతూ). ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. 1980లో జరిగే కథ, ఆ ప్రపంచాన్ని చాలా వండర్ఫుల్ గా తీశారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. ట్రైలర్ లో ఒక ఫైల్ మిస్సింగ్ గురించి చూపించాం కదా.. అందులో మనం బ్రతకడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సర్దార్ కథ వినకముందు దాని గురించి ఆలోచన లేదు. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని మామూలు అలవాట్లు మార్చుకుంటారనే నమ్మకం ఉంది. సర్దార్ లో తండ్రి పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ? 60 ఏళ్లలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని మా నాన్న గారిని అడిగాను. అయితే ఆయనకి యోగా అలవాటు ఉంది. దాని వలన ఆయన శరీరంలో ఎలాంటి మార్పులు లేవు. నాజర్ గారిని అడిగాను. మెట్లు ఎక్కడం కొంచెం ఇబ్బంది, అలాగే మాట్లాడినప్పుడు నోటి నుంచి ఎక్కువ గాలి వస్తుందని కొన్ని విషయాలు చెప్పారు. గెటప్ వేసుకుంటే ఓల్డ్ మ్యాన్ లా కనిపించవచ్చు. కానీ సర్దార్ యాక్షన్ కూడా చేయాలి. సర్దార్ కి పోలీస్ పాత్రలకు మధ్య స్పష్టమైన తేడా చూపించాలి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. ఖైదీ సినిమా చేసినప్పుడు ఒక హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఉండాలని తీశాం. సర్దార్ ని కూడా అలా ఒక హాలీవుడ్ మూవీలా ప్రజంట్ చేశాం. నా కెరీర్ లో ఇది సవాల్ తో కూడిన పాత్ర. కెమరామెన్ జార్జ్ కొత్త ప్రపంచం చూపించారు. 1980 వరల్డ్ ని సృస్టించారు. జీవీ ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సర్దార్ పాత్ర సమాజం నుంచి ఏమీ ఆశించదు. దేశం కోసమే పని చేస్తుంది. పోలీస్ పాత్రకి ప్రతి చిన్నదానికి పబ్లిసిటీ కావాలి. ఈ రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం ఉంటుంది. సర్దార్ కథ యదార్ధ సంఘటనల స్ఫూర్తి ఆధారంగా ఉంటుందా ? సర్దార్ పాత్ర రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఇక్కడ పుట్టిన ఒక రంగస్థల నటుడు పాకిస్తాన్ లో జనరల్ గా పని చేశారు. దీని స్ఫూర్తిగా సర్దార్ కథని రాశారు. సర్దార్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతాడా ? సర్దార్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. దిపావళికి కుటుంబం అంతా కలసి సర్దార్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో లైలా పాత్రకి ఒక కొడుకు ఉంటాడు. ఆ పాత్రలో చాలా హ్యుమర్ ఉంటుంది. స్పై వరల్డ్ ని నమ్మేలా చేసిన పాత్రది. సర్దార్ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సర్దార్ లాంటి సినిమాకి పాన్ ఇండియా అవకాశం ఉంది కదా ? అవును. యునీవర్సల్ అప్పీల్ ఉన్న సినిమా సర్దార్. ఈ సినిమాలో విలన్ గా చేసిన చుంకీ పాండే గారు మొదటి రోజు నుంచి ఇది పాన్ ఇండియా సినిమా అనే చెబుతున్నారు. ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఒక వారం తర్వాత బాలీవుడ్ లో విడుదల చేయాలనే ఆలోచన ఉంది. వైవిధ్యమైన, భారీ సినిమాలు చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం ఉంటుందా ? నిజానికి ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకంతోనే ఇలాంటి భారీ సినిమాలు చేస్తున్నాను. కాష్మోరా, ఖాకీ, ఖైధీ, పోన్నియిన్ సెల్వన్ ఇలా అన్నీ చిత్రాలని ఆదరిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు ? కొన్ని కథలు వింటున్నాను. నిజానికి తెలుగు నాకు వేరే పరిశ్రమ అనుకోను. ఇది నా సొంత ఇల్లు. అమ్మ ఇంటి నుంచి పిన్ని ఇంటికి వచ్చినట్లే ఉంటుంది. (నవ్వుతూ) ఊపిరిలో నాగార్జున గారితో కలసి నటించారు.. సర్దార్ నాగార్జున గారు విడుదల చేస్తున్నారు .. ఎలా అనిపిస్తుంది ? నాగార్జున అన్నయ్య ఉంటే చాలా హాయిగా ఉంటుంది. సినిమాకి కావాల్సినవన్నీ ఆయనే చూసుకుంటారు. నన్ను చాలా ప్రేమిస్తారు. ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్ గా ఉన్నావ్ అని మెసేజ్ పెట్టారు. ఆయన పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. కథలు పాన్ ఇండియాని దృష్టి లో పెట్టుకొని ఎన్నుకుంటున్నారు..ఈ ఒత్తిడి మీపై ఉంటుందా ? నిజానికి పాన్ ఇండియా ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. మన ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ముందు దాన్ని చూసుకోవాలి. రాజమౌళి గారు బాహుబలిని తెలుగు ప్రేక్షకుల కోసం తీశారు. అది పాన్ వరల్డ్ వెళ్ళింది. సినిమా, కాన్సెప్ట్ బాగుంటే ఆటోమేటిక్ గా పాన్ ఇండియా ఆడుతుంది. దర్శకుడు పిఎస్ మిత్రన్ లో మీకు నచ్చిన అంశాలు ? మిత్రన్ది మంచి వ్యక్తిత్వం. దర్శకుడిగా ఒక బలమైన విషయాన్ని సమాజానికి చెప్పాలి చూపించాలనే ఆయన తపన నాకు నచ్చింది. ఆయన ఎవరు ఐడియా ఇచ్చిన తీసుకుంటారు. ఎలాంటి ఈగో ఉండదు. సినిమా మంచి కోసమే తపించే దర్శకుడు. ఆయన రీసెర్చ్ చాలా బాగుంటుంది. సర్దార్ పట్ల సూర్య గారు ఎలా స్పందించారు ? అన్నయ్య ట్రైలర్ చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యారు. చాలా పెద్ద సినిమా, బలమైన కంటెంట్ ఉన్న సినిమాలా అనిపిస్తుందని చెప్పారు. దీపావళి కి నాలుగు సినిమాలు వస్తున్నాయి ? ఎలాంటి పోటి ఉంటుందని భావిస్తున్నారు? గతంలో పది సినిమాలు కూడా వచ్చాయి’నవ్వుతూ). పోటి అంటూ ఏమీ ఉండదు. సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను. ఖైధీ 2 ఎప్పుడు ? ఢిల్లీ వెళ్ళినా ఢిల్లీ గురించి అడుగుతున్నారు( నవ్వుతూ). విక్రమ్ తర్వాత దీనికి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే చేస్తాం. -
ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరుచిట్రంపళం’(తెలుగులో తిరు). నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదలై హిట్‌టాక్ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చదవండి: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్ భార్య, ఫొటోలు వైరల్ కేవలం తమిళంలోనే కాదు తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్‌నెక్ట్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతున్న తరుణంలో ఓటీటీలోకి నెల రోజుల్లోనే రాబోతుందని వినికిడి. అంటే ఈ తాజా బజ్ ప్రకారం.. తిరుచిట్రంపళం(తిరు) సెప్టెంబర్ 17 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: ‘జల్సా’ రీ-రిలీజ్, థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్ Box Office Alert!#Dhanush, #NithyaMenen's film #Thiruchitrabalam zooms past Rs 100 crore mark Worldwide 🌐 🔥🔥 pic.twitter.com/McOAWvxxRJ — Hello South (@Hellosouth_in) September 1, 2022 -
అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్‌గా చేస్తా: గోపిచంద్
మాచో స్టార్ గోపిచంద్-రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా గోపిచంద్, డైరెక్టర్ మారుతి ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా ఈ సందర్భంగా షో హోస్ట్.. పక్కా కమర్షియల్ అనే పదాన్ని ఎక్కువగా నెగెటివ్ సెన్స్ వాడతాం.. మరి అసలు ఎలా ఉండనుందనే ప్రశ్నకు గోపిచంద్ ఇలా స్పందించాడు. ‘ఈ మూవీ చాలా వినోదభరితంగా ఉంటుంది. రణం, లౌక్యం చిత్రాల తర్వాత నేను ఫుల్ లెన్త్ కామెడీ చేసింది ఈ సినిమాలోనే. పక్కా కమర్షిల్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మళ్లీ విలన్‌గా చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానని చెప్పాడు గోపిచంద్. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? అయితే తాను ఇప్పటి వరకు చేసిన విలన్ రోల్స్ అన్ని కూడా హీరోలకు ధీటుగా ఉన్నవేనని, మళ్లీ అలాంటి వైవిధ్యమైన పాత్రలు ఉంటేనే చేస్తానని తెలిపాడు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు అసలైన గోపిచంద్‌ని చూస్తారంటూ ఆసక్తకర కామెంట్స్ చేశాడు. గోపిచంద్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉటాడని, సీన్లలోనే నటించేటప్పుడు ఆయనలోని నటుడిని చూసి ఆశ్చర్యం వేసేదన్నాడు. ఇక బయట ఉండే క్యాజువల్ గోపిచంద్‌ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి చెప్పుకొచ్చాడు. -
కాజల్ బాడీపై ట్రోల్స్.. స్పందించిన సమంత, లక్ష్మి మంచు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల తన శరీరంలో వచ్చిన మార్పులతో బాడీ షేమింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ 7నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో తన సోదరి నిషా అగర్వాల్ తనయుడితో ఓ ప్రకటనలో నటించింది. ఇందులో కాజల్ బేబీ బంప్‌తో బోద్దుగా కనిపించింది. అయితే ఆడవాళ్లలో గర్భవతి సమయంలో వచ్చే సహజ మార్పులే కాజల్‌లో కూడా కనిపించాయి. అయితే తను హీరోయిన్ కావడంతో ఈ మార్పుల కారణంగా ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి రౌడీ బాయ్స్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!, ఎక్కడంటే.. కానీ కాజల్ మాత్రం వాటిని చూసి వదిలేయలేదు. తనపై అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నా జీవితంలో, నా శరీరంలో, ఇంట్లో, పని ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి’ అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. చదవండి: Sudheer Babu: కెమెరామెన్ అలా అనడంతో గదిలోకి వెళ్లి ఏడ్చాను ఈ క్రమంలో కాజల్ పోస్ట్‌పై స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.‘నువ్వు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉన్నావ్’ సమంత కామెంట్స్ చేయగా.. నువ్వు ప్రతి దశలో పర్ఫెక్ట్, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. అలాగే రాశి ఖన్నా సైతం కాజల్‌కు మద్దతునిస్తూ తన పోస్టుపై స్పందించింది. వీరి కామెంట్స్‌పై కాజల్ సోదరి నిషా అగర్వాల్ స్పందిస్తూ.. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! నా గార్జియస్’ అంటూ రిప్లై ఇచ్చింది. -
పాత పద్దతినే ఫాలో అవుతాను: రాశీ ఖన్నా
సినిమా హీరోయిన్లు ముఖారవిందం కోసం ఏయే క్రీములు వాడతారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఖరీదు గల క్రీములు వాడటంవల్లే వాళ్లు మెరిసిపోతుంటారని కూడా అనుకుంటారు. అయితే చర్మ సౌందర్యం కోసం తాను తక్కువ ఖర్చు పెడతానంటున్నారు రాశీ ఖన్నా. ‘‘చర్మాన్ని సంరక్షించుకోవడం అనేది ఎప్పుడూ చాలా ముఖ్యం. కానీ మేకప్ అనేది ఎప్పుడైనా మనకు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. అయితే స్కిన్ కేర్‌కి పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. నేను పాత పద్ధతినే ఫాలో అవుతా. తరతరాలుగా ఉన్న ముల్తానీ మట్టీ లేదా శెనగపిండి, పెరుగు కలిపి రాసుకుంటాను. ఇది చాలా బెస్ట్’’ అన్నారు రాశీ ఖన్నా. తక్కువ ఖర్చుతో మంచి మెరుపు అన్నమాట. చదవండి: అప్పుడే ఓటీటీకీ ‘ఆర్ఆర్ఆర్’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ డీల్! ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ -
షూటింగ్ గ్యాప్‌లో.. దాని గురించి కలలు కంటున్న రాశీ ఖన్నా
షాట్ గ్యాప్‌లో న్యాప్ (చిన్న కునుకు) తీస్తూ, విహారయాత్ర కోసం రాశీ ఖన్నా కల కంటున్నారు. ఈ మధ్యకాలంలో హాలిడే ట్రిప్ వెళ్లే వీలు దొరకలేదు ఈ బ్యూటీకి. ఎందుకంటే నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ చిత్రాల కోసం హైదరాబాద్, కార్తీ ‘సర్దార్’, ధనుష్ ‘తిరుచిత్రంబలమ్’ల కోసం చెన్నై, షాహిద్ కపూర్ ‘సన్నీ’, అజయ్ దేవగన్ (రుద్ర) వెబ్ సిరీస్‌ల కోసం ముంబై.... ఇలా మూడు నగరాలను చుట్టేస్తున్నారామె. ప్రస్తుతం ‘తిరుచిత్రంబలమ్’ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ షూట్లో షాట్ గ్యాప్‌లో హాయిగా కునుకు తీశారు. ‘‘షాట్ గ్యాప్‌లో కాస్త టైమ్ దొరకడంతో నిద్రపోతున్నాను. ఈ నిద్రలో నా వెకేషన్ (విహారయాత్ర) ఎలా ఉండాలో కల కంటున్నాను’’ అన్నారు రాశీ. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న రాశీ ఓ వెకే షన్ను కోరుకోవడం కరెక్టే కదా! View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) చదవండి : ప్యాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: :పృథ్వీ ‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకున్న వైష్ణవ్, రకుల్ లవ్ ట్రాక్ -
Rashi Khanna: నీకోసం ఏమైనా చేస్తా!
‘‘సమయం ఆగిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాశీ ఖన్నా. తన తండ్రి రాజ్ కె. ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇలా కోరుకున్నారు. అలాగే తండ్రి 60వ పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇచ్చారు. ముందు చెప్పకుండా పార్టీ ఏర్పాటు చేశారు. తండ్రితో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘నాన్నకు నచ్చినవి స్వయంగా నేనే వండాను. ఆ అందమైన నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు. మా ఇంటిల్లిపాదికీ డార్లింగ్ ఆయన. ఒక నిస్వార్థ సోదరుడు, మంచి కొడుకు, పరిపూర్ణమైన భర్త.. అన్నింటికీ మించి అద్భుతమైన తండ్రి. నా జీవితంలో జరిగిన అద్భుతాలన్నింటికీ ఆయనే కారణం’’ అంటూ, ‘‘నాన్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ సమయం ఇక్కడే ఆగిపోవాలని కోరుకుంటున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నువ్వు ప్రేమను పంచినట్లుగానే ఆ దేవుడు నీ మీద ప్రేమ కురిపించాలని కోరుకుంటున్నాను. నీలాంటి మంచి తండ్రికి కూతురిని అయినందుకు గర్వంగా ఉంది. నీ కోసం ఏమైనా చేస్తాను’’ అంటూ తండ్రి మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా. -
సోషల్ హల్చల్: వేడెక్కిస్తున్న సారా, కాలం ఆగిపోవాలంటున్న రాశీ
► ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అంటున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ► బీచ్ తీరాన వేడివేడిగా విటమిన్ సీ తీసుకుంటూ ఫొటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ► మనం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చూడకపోవడం వెనక ఓ కారణం ఉంది అని చెబుతున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ► మీ పరిధిని విస్తరించండి అంటూ భరత నాట్య భంగిమను షేర్ చేసిన సీనియర్ నటి శోభన. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
బాలీవుడ్లోనే ఆదరణ!
తమిళసినిమా: బాలీవుడ్లోనే బాగా ఆదరణ ఉంటుంది అని చెప్పింది నటి రాశీఖన్నా. బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ అంటూ పరుగులు తీస్తున్న నటి ఈ బ్యూటీ. పేరులోనే రాశిని పెట్టుకున్న ఈ భామ.. రాశి గల నటి అనే పేరు తెచ్చుకుంటోంది. అయితే ఇంకా స్టార్ ఇమేజ్ కోసం పోరాడాల్సి ఉంది. యువస్టార్స్‌తో జత కట్టే అవకాశాలే ఈ బ్యూటీ తలుపు తడుతున్నాయి. స్టార్స్ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకోవలసి ఉంది. కాగా తమిళంలో ఒమైకానొడగల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి తొలి చిత్ర సక్సెస్ బాగానే హెల్ప్ అయ్యింది. ఆ తరువాత జయంరవి సరసన అడంగమరు, విశాల్‌తో అయోగ్య, విజయ్‌సేతుపతికి జంటగా సంఘతమిళన్ వంటి చిత్రాల్లో నటించింది. అలాంటి ప్రస్తుతం ఇక్కడ కాస్త జోరు తగ్గింది. సిద్ధార్థ్‌తో నటిస్తున్న సైతాన్ కా బచ్చా చిత్రం మినహా మరో అవకాశం లేదు. అయితే టాలీవుడ్లో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కోలీవుడ్‌లో అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ సినీ వర్గాల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఈ చిన్నది వెంకటేశ్. నాగచైతన్యలతో కలిసి నటించిన వెంకీమామ చిత్రం ఈ వారం తెరపైకి రానుంది. అందాలారబోత విషయంలో వెనుకాడని రాశీఖన్నా, ఇటీవల బాగా కసరత్తులు చేసి మరింత సన్నబడి నవనవలాడుతోంది. అందుకు కారణాన్ని కూడా చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాశీఖన్నా మాట్లాడుతూ కాస్త లావుగా ఉంటే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని చెప్పింది. అందుకే సన్నబడడానికి కసరత్తులు చేసినట్లు చెప్పింది. అంతేకాకుండా సహ నటీమణుల నుంచి పోటీని ఎదుర్కొనడానికి ఇది అవసరమైందని చెప్పుకొచ్చింది. మరో విషయం ఏమిటంటే దక్షిణాది కంటే హిందీలోనే తనకు బాగా ఆదరణ లభిస్తోందని తెలిపింది. తనకు బాలీవుడ్‌కు వెళ్లడానికి ఇష్టం లేదని చెప్పింది. తాను నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోనే నివశిస్తున్నానని చెప్పింది. ఇంకా చెప్పాలంటే అక్కడే సెటిల్ అయ్యానని రాశీఖన్నా చెప్పింది. కాగా సిద్ధార్థ్‌తో కలిసి నటించిన సైతాన్ కా బచ్చా చిత్రం త్వోరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్
‘‘వెంకీ మామ’ సినిమాలోని ‘అమ్మయినా నాన్నయినా నువ్వేలే వెంకీ మామ...’ పాటలా నాకంతా నా అభిమానులే. నా 30 ఏళ్ల కెరీర్లో మీరే నా బలం. ఈ నెల 13న కలుద్దాం’’ అని వెంకటేష్ అన్నారు. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ, సినిమా విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా వెంకీ మామ అంటున్నారు. ఈ సినిమాలో చైతూ చించేశాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. మామ– అల్లుడు సెంటిమెంట్‌ని బాబీ చాలా బాగా తీశాడు. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు.. ఒకటి ‘మనం’.. రెండోది ‘వెంకీ మామ’. కెమెరా వెనుక ఓ మామ(సురేష్‌బాబు).. ముందు మరో మామ(వెంకటేష్).. నన్ను చాలా బాగా చూసుకున్నారు. బాబీ కూల్ డైరెక్టర్. ఈ మూవీలో మామా అల్లుళ్ల అల్లరి మామూలుగా ఉండదు’’ అన్నారు. బాబీ మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగచైతన్య, మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులందరికీ నమస్కారం. ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్ మాట్లాడని హీరో వెంకటేష్‌గారు. చిన్నప్పుడు వీసీఆర్ కోసం వెళ్తే వెంకీగారి సీడీలు దొరికేవి కావు.. మహిళలు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్‌లో తీసుకుని రావాల్సి వచ్చేది. ‘ఎఫ్ 2’లో వెంకటేష్‌గారి ఫన్ చూశారు.. ‘వెంకీ మామ’ లో ఆయన మాస్ యాంగిల్ చూపించాను. ఎంతో కుటుంబ నేపథ్యం ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు. సురేష్ బాబుగారు పెద్ద పుస్తకం’’ అని తెలిపారు. ‘‘వెంకీ మామ’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రాశీఖన్నా. ‘‘వెంకటేష్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఇంత త్వరగా పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘అన్ని రకాల భావోద్వేగాలున్న మంచి సినిమా ‘వెంకీ మామ’’ అన్నారు సురేష్ బాబు. ‘‘వెంకటేష్, నాగ చైతన్యలతో గ్రేట్ మల్టీస్టారర్ నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు విశ్వప్రసాద్. ‘‘వెంకీ, చైతూల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల. -
‘లంగ్ క్యాన్సర్.. ఐదు వారాలకు మించి’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. చాలా రోజుల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన సాయి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగేతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు ఫ్యామిలీ ఆడియన్స్న్స్ను కనెక్ట్ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘లంగ్ క్యాన్సర్.. ఐదు వారాలకు మించి బతకడు’అనే హార్ట్ టచ్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్.. అద్యంతం వినోదం, ఉద్వేగభరితంగా సాగింది. ‘పెద్ద కొడుకుగా మీరు కదా కర్మకాండ చేయాల్సింది.. అది రూలే కంపల్సరీ కాదు’, ‘మారే కాలంతో పాటూ మనమూ మారాలి, వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’, ‘నీ లవ్ స్టోరీని గౌతమ్ మీనన్‌లా చిన్న త్రెడ్ పట్టుకొని సాగదీయలేము’, ‘లాస్ట్ డేస్‌లో కూడా లాజిక్‌లకు తక్కువేం లేదు’వంటి డైలాగ్‌లు అన్ని వర్గాల ప్రజలను కనెక్ట్ చేసేలా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. -
పండగలా వచ్చారు
-
ప్రతిరోజు పండగే ఫస్ట్ గ్లిమ్స్
-
లొల్ల లాకుల వద్ద ‘వెంకీ మామ’
తూర్పుగోదావరి, ఆత్రేయపురం (కొత్తపేట): సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ లొల్ల లాకుల పరిసరాల్లో శరవేగంగా సాగుతోంది. హీరోలు వెంకటేష్, నాగచైతన్య హీరోయిన్లు రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లపై సోమవారం వివిధ సన్నివేశాలు చిత్రీకరించారు. సురేష్‌బాబు, విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు కాగా బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఈ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. -
ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా...
ప్రముఖ సినీ నటి రాశిఖన్నా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. బిగ్‌సీ 16వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నగరానికి వచ్చిన ఈమె తన సినిమాలోని పాటలు పాడి అభిమానులను హుషారెక్కించారు. గోదావరి తీరానికి రావడం చాలా ఆనందంగా ఉందని రాశిఖన్నా అన్నారు. తూర్పుగోదావరి, సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రముఖ సినీ నటి రాశిఖన్నా నగరంలో సందడి చేశారు. ‘బిగ్ సీ’ 16వ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన నూతన షోరూం ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె వచ్చారు. ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా పాటతో ప్రేక్షకుల మదిని దోచుకున్న రాశిఖన్నా మాట్లాడుతూ బిగ్ సీ షోరూం ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. బిగ్ సీలో ఆఫర్లను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. బిగ్ సీ ఫౌండర్, సీఏండీ బాలుచౌదరి మాట్లాడుతూ ఈ షోరూం కోస్తా ఆంధ్రలోనే అతిపెద్ద షోరూం అని చెప్పారు. ప్రతి మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. రాశిఖన్నాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు బిగ్ సీ నూతన షోరూమ్ వద్దకు వచ్చారు. -
కాఫీ తాగి.. కబుర్లు చెప్పి!
రాత్రివేళ సముద్రతీరానికి వెళ్లిన కథానాయిక రాశీఖన్నా పొద్దుపొద్దున్నే మేడపై కాఫీ తాగి బస్టాండ్‌కి వెళ్లారు. అక్కడ స్కూల్‌కి వెళ్తోన్న చిన్నారులతో కబుర్లు చెప్పారు. ఇవన్నీ ‘అయోగ్య’ సినిమాలోని సీన్స్ అన్నమాట. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అయోగ్య’. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాకు తమిళ రీమేక్ ఇది. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరిలో జరిగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పాండిచ్చేరి షెడ్యూల్ పూర్తవడంతో చెన్నై చేరుకున్నారు రాశీ. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఒక కథానాయికగా నటించనున్నారామె. -
ప్రేక్షకాదరణే ప్రధానం
కంటోన్మెంట్: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ రెండేళ్ల క్రితం నిఖిల్‌ను పలకరించిన నందిత శ్వేతా తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’లో నితిన్‌కు మరదలుగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తొలుత వీడియో జాకీగా కేరీర్ ప్రారంభించిన ఈ బెంగళూరు అమ్మాయి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటివరకు ఆమె 8 సినిమాల్లో నటించగా, అందులో ఆరు సినిమాలు ఈ ఏడాదిలోనే కావడం విశేషం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా రావడంతో తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగులో తన రెండో సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారం విడుదల కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నందిత శ్వేతా కొద్దిసేపు ముచ్చటించారు. ప్రేక్షకుల ‘సపోర్ట్’తో తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించేఅవకాశముందన్నారు. ఇటీవల ఆఫర్లు పెరిగాయి.. 2008లో తొలి సినిమా విడుదలైన నాలుగేళ్లకు 2012లో తమిళ సినిమాలో నటించా. 2013లో విడుదలైన ఎథిర్ నీచల్ చిత్రానికి గానూ సైమా అవార్డు దక్కగా, తెలుగు చిత్రం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు విడుదలయ్యాయని, వీటిలో కుష్బూ నిర్మించిన ‘కాలకలప్పు–2’లో సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించినట్లు తెలిపారు. హిందీలో, తమిళంలో మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. -
తారలు దిగి వచ్చిన వేళ..
ఏలూరులో శుక్రవారం సినీ తారలు సందడి చేశారు. జీవీ మాల్ప్రారంభోత్సవానికి నటీమణులు రాశీఖన్నా, మెహరీన్ కౌర్, రీతూవర్మవిచ్చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఏలూరు(సెంట్రల్): నగరంలో సినీ తారలు రాశీఖన్నా, మోహరీన్ కౌర్, పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ సందడి చేశారు. స్థానిక విజయవిహార్ సెంటర్లో నూతనంగా నిర్మించిన జీవీ మాల్‌ను వారు ప్రారంభించారు. షాపింగ్ మాల్లో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వస్త్రాలను పరిశీలించారు. మొదటి ఫ్లోర్‌ను స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి, రెండో ఫోర్ల్ను మేయరు షేక్ నూర్జహాన్, మూడో ఫ్లోర్‌ను వింగ్ కమాండర్ కలిదిండి ఆంజనేయరాజు, నాలుగో ఫ్లోర్‌ను ఎస్ఎంఆర్ ఎస్టేట్ అధినేత పెదబాబు ప్రారంభించారు. భద్రాద్రి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి మొదటిగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్లు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతోగానో ఆదరిస్తారన్నారు. ఏలూరు ప్రజలు ఫ్యాషన్ వస్త్రాలను ఎంతోగానో ఇష్టాపడతారన్నారు. జీవీ మాల్లో మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని, వినియోగదారులు మార్కెట్లో ధరలను, జీవీ మాల్లో ధరలను పోల్చి చూస్తే అర్థమవుతుందన్నారు. సినీ తారలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
విశాల్‌తో జోడీ కుదిరింది!
సాక్షి, సినిమా : నటుడు విశాల్‌తో రాశీఖన్నాకు జోడీ కుదిరిందట. విశాల్ ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తూ నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇరుంబుతిరై. ఇందులో సమంత నాయకి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న సండైకోళీ–2 చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో కీర్తీసురేశ్ నాయకి. తాజాగా మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. తెలుగులో పూరిజగన్నా«థ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన విజయవంతమైన టెంపర్ రీమేక్‌లో నటించనున్నారు. అ చిత్రంలో విశాల్ మరోసారి పోలీస్ అధికారిగా నటించనున్నారు. లైట్‌హౌస్ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా వెంకట్ మోహన్ అనే నవదర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన మహేష్‌బాబు నటించిన స్పైడర్ చిత్రానికి సహయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో హైదరాబాద్ బ్యూటీ రాశీఖన్నా విశాల్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అమ్మడు కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. ఇప్పటికే అధర్వకు జంటగా ఇమైకానోడిగల్ చిత్రంలో నటించింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీని గురించి రాశీఖన్నా చెబుతూ విశాల్‌కు జంటగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్Š చిత్రీకరణ జరుగుతోందన్నారు. ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతోందని, అదే విధంగా జయంరవి సరసన ఒక చిత్రం చేయనున్నానని, అది వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమై మే లో విడుదల కానుందని చెప్పింది. -
మెరుపు తీగ..
గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ‘బాలకృష్ణుడు’ సినిమా ఆడియో ఫంక్షన్లో హీరోయిన్ రాశీఖన్నా వెలిగిపోయిందిలా... -
బీ అలర్ట్ ఫ్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: రోజు రోజుకూ బాలలపై ఇంటా బయటా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలపై చిన్నారులు, తల్లిదండ్రులు పెదవి విప్పితే రేపటికి ముందడుగు వేయొచ్చని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీస్ శాఖ చేయని విధంగా ‘స్టాప్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’ (లైంగిక వేధింపుల నియంత్రణ) కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఏడాదిపాటు జరిగే ఈ క్యాంపెయిన్‌లో లైంగిక వేధింపులపై అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చిన పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఆయన సూచించారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డులో బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని, హీరోయిన్ రాశిఖన్నా, గాయని సునీత, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత దగ్గుపాటి సురేష్‌బాబు, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య, ఐజీలు సౌమ్యామిశ్రా, చారు సిన్హా తదితరులు క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్స్టేషన్లలో ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’పై ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో అవగాహన కల్పించనున్నామన్నారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. ‘జాగో బద్లో, బోలో’ అనే నినాదంతో ముందుకెళ్లండని పిలుపునిచ్చారు. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య మాట్లాడుతూ.. మా అందరి ఉద్దేశం మీరంతా బాగుండాలనేదేనన్నారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్’ ఆర్గనైజేషన్ సభ్యుల ప్రదర్శన అలరించింది. సమావేశం అనంతరం వేలాదిమంది విద్యార్థులు, ప్రముఖులు ర్యాలీగా కొవ్వొత్తుల ప్రదర్శనతో ‘స్టాప్ చైల్డ్ అబ్యూజ్’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మాట్లాడటానికి భయపడొద్దు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై మాట్లాడేందుకు భయపడొద్దు. పిల్లల్ని రక్షించేందుకు, సమాజాన్ని మెరుగుపరిచేందుకు, లైంగిక దాడులను అరికట్టేందుకు మన పోలీసులు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. - అమల అక్కినేని, బ్లూక్రాస్ వ్యవస్థాపకారులు ఏ ధైర్యంతో చేస్తున్నారు..? ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతలో చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏ ధైర్యంతో వారు చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మొదట ఇంటి నుంచే ఆ ప్రశ్నల వర్షం కురవాలి. – దగ్గుబాటి సురేష్, ప్రొడ్యూసర్ మౌనం.. ప్రమాదకరం.. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులకు, చిన్నారులకు ధైర్యం కావాలి. ఏ విధమైన దాడులు జరిగినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలి. మౌనంగా ఉంటే పెను ప్రమాదం అవుతుంది. – రాశిఖన్నా, సినీనటి న్యాయం చేసేవారు పోలీసులే సాయం ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ న్యాయం చేసేది మాత్రం పోలీసులే. అటువంటి న్యాయం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన పోలీసుల్ని ప్రత్యేకంగా అభినందించాలి. –బోయపాటి శ్రీను, సినీదర్శకుడు అరమరికలు, సమస్యలు లేకుండా.. మన చుట్టూ ఉన్న చిన్నారులకు అరమరికలు, సమస్యలు లేని బాల్యాన్ని ఇద్దాం. దీంతో బాల్యం నుంచే చిన్నారులు అవగాహన కలిగి ఉంటారు. ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’పై అవగాహన ఏడాదిపాటు చేసేందుకు డీజీపీ కృతనిశ్చయంతో ఉన్నారు. – మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ పిల్లలకు సంతోషాన్ని పంచుదాం సమస్యలు చాలా మందికి ఉంటాయి. బయటకు చెప్పేందుకు వెనకాడతాం. కానీ ఇప్పటి నుంచి సమస్యలను చెప్పేందుకు భయపడొద్దు. తల్లిందడ్రులు పిల్లలకు సంతోషాన్ని పంచాలి. చిన్నారుల సమస్యలపై ప్రశ్నించి వారికి ఆనందాన్ని ఇవ్వాలి. – సునీత, గాయని బీ అలర్ట్ ఫ్లీజ్ పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి నెక్లెస్‌రోడ్డులో స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు హీరోయిన్ రాశిఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
భారతీయుడు.. ఒకే ఒక్కడు... రేంజ్లో ఆక్సిజన్ – దర్శకుడు జ్యోతికృష్ణ
‘‘జ్యోతికృష్ణ చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండా కథలు రాసేవాడు. చదువుకుని ఫారిన్లో సెటిలవుతాడనుకుంటే, లండన్‌లో ఫిల్మ్ డైరెక్షన్ ట్రైనింగ్ తీసుకొచ్చాడు. చిన్న వయసులోనే డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత ఏయం రత్నం. గోపీచంద్, రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆక్సిజన్’. శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై జ్యోతికృష్ణ భార్య ఎస్. ఐశ్వర్య నిర్మించారు. యువన్‌శంకర్ రాజా స్వరపరచిన ఈ సినిమా పాటలను సోమవారం విడుదల చేశారు. ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘స్వార్థపరుల వల్ల యువత ఎంతగా దెబ్బతింటున్నది అన్నదే ఈ సినిమా కథ. ‘ఆక్సిజన్’ మొదలుపెట్టి చాలా కాలం అయింది. ఎప్పుడు పిలిచినా మాకు సహకరించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కి చాలా థ్యాంక్స్. తమన్నా, జెనీలియా, త్రిష వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఈ చిత్రంతో అనూ ఇమ్మాన్యుయేల్‌ని పరిచయం చేయాలనుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తను పెద్ద స్టార్ అయిపోయినందుకు హ్యాపీ. నాకు తెలియకుండా ఈ సినిమాలో నా కోడలితో (ఐశ్వర్య) పాట పాడించారు. ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో ఐశ్వర్య నిర్మాతగా మారారు’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘ఆక్సిజన్’ చేయడానికి ముఖ్య కారణం రత్నంగారు. ఆయన్ని చిన్నప్పటి నుంచి చూశా. చాలా మంది బిజినెస్ కోసం సినిమాలు చేస్తారు. నాకు తెలిసి టాలీవుడ్లో సినిమాపై ప్యాషన్ ఉండే నిర్మాతల్లో రత్నంగారు ఒకరు. నేను కథని నమ్మాను. నా నమ్మకం వమ్ము కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మంచి మెసేజ్ ఇచ్చాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. జ్యోతికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆక్సిజన్ కథ ఫస్ట్ ఐశ్వర్యకే చెప్పా. తనకు నచ్చింది. గోపిచంద్సార్కి ఆరు గంటల్లో రెండు కథలు వినిపించా. ‘ఆక్సిజన్’ కథ నచ్చిందని, ఓకే చేశారు. ఈ సినిమాలో ఆయన మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. ఇంటర్వెల్ ఫైట్‌లో అద్భుతంగా నటించారు. గోపి నాట్ ఏ సినిమా హీరో. రియల్ హీరో. నాన్నగారికి సోషల్ ఓరియంటెడ్ సినిమాలంటే ఇష్టం. ఆయన తీసిన ‘కర్తవ్యం, పెద్దరికం, ఆశయం, భారతీయుడు, ఒకే ఒక్కడు’ రేంజ్లో ‘ఆక్సిజన్’ ఉంటుంది. తొలిరోజు సెట్లో ఎంత డెడికేషన్, మంచి బిహేవియర్‌తో ఉన్నారో... ఇప్పుడూ అనూ ఇమ్మాన్యుయేల్ అలాగే ఉన్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్రమిది. రిలీజ్ ఆలస్యం అయింది. నాకు తొలి అవకాశం ఇచ్చిన రత్నంసార్కి థ్యాంక్స్. ఈ సినిమాని ఆశీర్వదించి, పెద్ద హిట్ చేయాలి’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘చాలామంది నిర్మాతలకి రామానాయుడుగారు రోల్ మోడల్. రత్నంగారిని చూసి ఆయనలాగా అవ్వాలని మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఒక టెక్నీషియన్ ఎంత పెద్ద నిర్మాత అవ్వొచ్చో చూపించారాయన’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. చిత్ర నిర్మాత ఐశ్వర్య, సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా, కెమెరామేన్ ఛోటా కె. నాయుడు, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, అంబికా కృష్ణ, పోకూరి బాబూరావు, అనీల్ సుంకర, మల్కాపురం శివకుమార్, రాజ్ కందుకూరి, మిర్యాల రవీందర్‌రెడ్డి, నటులు అలీ, శరత్‌కుమార్, నాజర్, కెమెరామేన్ సెంథిల్, డైరెక్టర్ నేసన్ , ఇండియన్ ఐడిల్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఫోనులో ఎవరో? ఏంటో?!
చూశారా? శీతాకాలం గాలులకు నా హెయిర్ క్లియర్‌గా కంట్రోల్ తప్పింది. కానీ, వరుణ్‌తేజ్ హాయిగా నవ్వుతూ ఫోన్ చూసుకుంటున్నాడు. (ఫోనులో) ఎవరో? ఏంటో?... ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో అభిమానులందర్నీ అడిగారు రాశీ ఖన్నా. వరుణ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. అక్కడ రాశీ తీసుకున్న సెల్ఫీనే మీరు చూస్తున్నది. అన్నట్టు... ఓ విషయం గమనించారా? వరుణ్‌తేజ్ హెయిర్ స్టైల్ కొంచెం కొత్తగా ఉంది. ‘తొలిప్రేమ’లో లుక్ ఇదేనని కొత్తగా చెప్పక్కర్లేదు కదూ!!