ఏలూరులో శుక్రవారం సినీ తారలు సందడి చేశారు. జీవీ మాల్‌ప్రారంభోత్సవానికి నటీమణులు రాశీఖన్నా, మెహరీన్ కౌర్, రీతూవర్మవిచ్చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.
ఏలూరు(సెంట్రల్): నగరంలో సినీ తారలు రాశీఖన్నా, మోహరీన్ కౌర్, పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ సందడి చేశారు. స్థానిక విజయవిహార్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన జీవీ మాల్‌ను వారు ప్రారంభించారు. షాపింగ్ మాల్‌లో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వస్త్రాలను పరిశీలించారు. మొదటి ఫ్లోర్‌ను స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి, రెండో ఫోర్ల్‌ను మేయరు షేక్ నూర్జహాన్, మూడో ఫ్లోర్‌ను వింగ్ కమాండర్ కలిదిండి ఆంజనేయరాజు, నాలుగో ఫ్లోర్‌ను ఎస్‌ఎంఆర్ ఎస్టేట్ అధినేత పెదబాబు ప్రారంభించారు. భద్రాద్రి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి మొదటిగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్లు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతోగానో ఆదరిస్తారన్నారు. ఏలూరు ప్రజలు ఫ్యాషన్ వస్త్రాలను ఎంతోగానో ఇష్టాపడతారన్నారు. జీవీ మాల్‌లో మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని, వినియోగదారులు మార్కెట్‌లో ధరలను, జీవీ మాల్‌లో ధరలను పోల్చి చూస్తే అర్థమవుతుందన్నారు. సినీ తారలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment