Mehrene Kaur Pirzada
-
నాగ్ సినిమా మేకర్స్‌కు చుక్కలు చూపించిన అమలా పాల్, మెహ్రీన్!
నాగార్జున అక్కినేని ప్రస్తుతం ‘బంగార్రాజు’ మూవీతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు ఆయన ప్రవీణ్ సత్తారుతో ఓ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను అనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా మొదట కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు మేకర్స్. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో హీరోయిన్ వేటలో పడ్డ మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారట మన కథానాయికలు. చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు ఈ సినిమా కోసం హీరోయిన్ అమలా పాల్‌ను సంప్రదించగా.. ఆమె భారీగా డిమాండ్ చేసి మేకర్స్‌కు షాక్ ఇచ్చిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను కాదని మెహరీన్ కౌర్‌ను అడగ్గా ఈ బ్యూటీ కూడా కోటీ రూపాయలకు వరకు డిమాండ్ చేసిందని వినికిడి. ఇక హీరోయిన్ల వైఖరితో నిర్మాతలు విసిగిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక అమలా పాల్, మెహరీన్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ -
‘మంచి రోజులు వచ్చాయి’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
యువ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా రూపొందింది. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ‘సో సోగా ఉన్నాననీ .. సో స్పెషలే చేశావులే' అంటూ సాగుతోంది. Here's foot tapping melody #SoSoGa song frm #ManchiRojulochaie launched by @IamSaiDharamTejhttps://t.co/G8yIKanZyK 🎙️@sidsriram 🖊️@kk_lyricist 🎹@anuprubens@DirectorMaruthi @santoshshobhan @Mehreenpirzada @vcelluloidsoffl @SKNonline @UVConcepts_ @massmoviemakers @adityamusic pic.twitter.com/ZexQmVfhYa — BA Raju's Team (@baraju_SuperHit) August 16, 2021 అనూప్ రూబెన్స్ సంగీతం, కేకే సాహిత్యం, సిద్ శ్రీరామ్ అలాపన ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్‌ను ఆకట్టుకునే బీట్తో అనూప్ బాణీ కట్టిన ఈ పాట ‘తనువులు వేరైనా మన ఊపిరి ఒకటే .. ఊహలు ఒకటే . దారులు ఒకటే’ అంటూ సాగింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెళ్లి వాయిదా అనంతరం క్రేజీ ఆఫర్ కొట్టేసిన మెహ్రీన్!
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2లో హనీ పాపగా అలరించిన హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయ్యింది. గత నెలలలో భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులన్ని చక్కబడగానే అందరి సమక్షంలో ఘనంగా వీరి వివాహ వేడుకను జరుపుకావాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి అనంతరం మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఇక ఆమెపెళ్లి వాయిదా పడటంతో దర్శక-నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లికి ఇంకా సమయంలో ఉండటంతో తమ సినిమా షూటింగ్స్ భాగం చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక మెహ్రీన్ కూడా పెళ్లికి ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న ఓ భారీ యాక్షన్ మూవీ కోసం మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా శృతి హాసన్, త్రిష నటిస్తున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మెహ్రీన్‌కు ఆ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చేప్పినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్రకు రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందించాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మెహ్రీన్ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే ఆమె ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి వాయిదా పడిన వెంటనే మారుతి-సంతోష్ శోభన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
30 రోజుల్లో సినిమా..'ఏక్ మినీ కథ' హీరోతో మెహ్రీన్
'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏక్ మినీ కథ సంతోష్ కెరీర్‌ను మార్చేసింది. ఇప్పటికే పలు అవకాశాలు ఈయన్ని వరిస్తున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ఫైనలైజ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సంతోష్‌కు జోడీగా మెహ్రీన్ కనిపించనుందట. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎఫ్3 తప్పా పెద్దగా అవకాశాలు లేదు. దీంతో ఈ కుర్ర హీరోతో జత కట్టేందుకు రెడీ అయ్యిందట ఈ భామ. అంతేకాకుండా పెళ్లి కూడా వాయిదా పడటంతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుందట. కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ అయ్యేలా డైరెక్టర్ మారుతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. లవ్ అండ్ కామెడీ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాకు ‘మంచిరోజులు వచ్చాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ నందినీ రెడ్డితోనూ సంతోష్ శోభన్ ఓ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. చూస్తుంటే సంతోష్ శోభన్ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారినట్లు కనిపిస్తుంది. చదవండి : ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్ పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్ -
పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్
కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు యువతరాన్ని కట్టిపడేసింది పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్. ఎఫ్ 2, మహానుభావుడు, కవచం వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయింది. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది సెకండాఫ్‌లో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెహ్రీన్ కోవిడ్, పెళ్లి తదితర విషయాల గురించి మీడియాతో మాట్లాడింది. "కరోనా వైరస్ మరికొంతకాలం ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ మహమ్మారి మనకు కావాల్సిన వ్యక్తులను ఎందరినో పొట్టనపెట్టుకుంటోంది. ఇది చాలా విషాదకరం. గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగాక మా అమ్మకు, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వెంటనే మేము ముంబైలో క్వారంటైన్లో ఉండిపోయాం. చాలా భయపడిపోయాం. కొద్ది రోజుల వరకు ఎంతో ఆందోళన చెందాం. కానీ దాన్నుంచే ఎలాగోలా బయటపడ్డాం" "కరోనాను జయించిన తర్వాత కూడా ఇప్పటికీ నీరసంగా ఉంటోంది. అందుకే వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాను. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య నాకు నిత్యం కాల్ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. నేను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు అతడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపించాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే చర్చించడం లేదు. అయినా పరిస్థితులు చక్కబడాలి కదా!" అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’లో నటిస్తోంది. చదవండి: ‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’ -
వాస్తవ సంఘటనల అశ్వథ్థామ
నాగసౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేపు (గురువారం) సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు. ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో నాగశౌర్య ఈ సినిమా కథని రాసుకున్నారు. హీరోయిన్ సమంత ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా అందరి అంచనాలకు తగ్గట్టు ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి. -
అశ్వథ్థామ టీజర్ విడుదలయ్యేది అప్పుడే
ఛలో తర్వాత హిట్ అందుకోవడమై గగనమైపోయిన నాగశౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ మళ్లీ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఆయనే నేరుగా ‘అశ్వథ్థామ’ కథ సిద్ధం చేసుకోగా నూతన దర్శకుడు రమణ తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన నాగశౌర్య ఫస్ట్‌లుక్ మాస్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో నాగశౌర్యకు జోడీగా హీరోయిన్ మెహరీన్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. -
అశ్వథ్థామ నుంచి అందమైన పాట..
యంగ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఛలో సినిమా విజయం తర్వాత నాగశౌర్యకు మళ్లీ హిట్ అందుకోవడమే గగనమైపోయింది. ఓ బేబీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ హీరోయిన్ సమంత అకౌంట్లో పడిపోయింది. దీంతో మళ్లీ విజయాన్ని అందుకునేందుకు పరుగు మొదలుపెట్టాడీ యంగ్ హీరో. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా రాసుకున్న కథే ‘అశ్వథ్థామ’. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నిన్నే నిన్నే.. ఎదలో నిన్నే.. చెలియా నీకై నే వేచానులే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను అర్మన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించారు. ఈ పాట అతని అభిమానులతో పాటు ప్రేమికులను అలరిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. -
‘చాణక్య’ మూవీ రివ్యూ
టైటిల్: చాణక్య జానర్: స్పై థ్రిల్లర్ నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్, నాజర్, రాజేష్ కట్టర్ తదితరులు సంగీతం : విశాల్ చంద్రశేఖర్ నిర్మాత: రామ బ్రహ్మం సుంకర దర్శకత్వం: తిరు టాలీవుడ్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ గట్టి హిట్టు కొట్టి చాలా కాలమైంది. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరోకు ఈ మధ్యకాలంలో సరైన విజయం దక్కలేదు. పంతం, ఆక్సీజన్, గౌతం నందా, ఆరడుగుల బుల్లెట్ లాంటి చాలా సినిమాలు గోపీచంద్ చేసినా.. ఏ సినిమా కూడా అతని ఆశలను నిలబెట్టలేకపోయింది. ఈ క్రమం ‘చాణక్య’ అంటూ స్టైలిష్ స్పై చిత్రంతో గోపీచంద్ ఈ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గూఢచారి నేపథ్యంతో వచ్చిన వచ్చిన ఈ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించిందా? గోపీచంద్ ‘చాణక్య’ శపథం నెరవేరిందా? ఓ సారి తెలుసుకుందాం... కథ: పాక్ ఉగ్రవాద దాడుల నుంచి దేశాన్ని రక్షించడానికి అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్ నడుపుతుంటాడు. బయటకు మాత్రం బ్యాంక్ ఉద్యోగి రామకృష్ణగా చలామణీ అవుతుంటాడు. తన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కారకుడు.. పాక్ చెందిన ఇబ్రహీం ఖురేషీ అని అర్జున్ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఖురేషీకి చెందిన అబ్దుల్ సలీమ్‌ను అర్జున్ హతమారుస్తాడు. ఇందుకు ప్రతీకారంగా అర్జున్ టీమ్‌లో సభ్యులైన అతని నలుగురు స్నేహితులు (రా ఏజెంట్స్)ను ఖురేషీ కిడ్నాప్ చేసి కరాచీకి పట్టుకుపోతాడు. ఈ మేరకు ఖురేషీ అర్జున్‌కు ఇచ్చిన షాక్‌తో ఫస్టాప్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో గోపీచంద్ కరాచీ వెళ్లి తన నలుగురు ఫ్రెండ్స్‌ను ఎలా కాపాడాడు? దేశాన్ని ఉగ్రముప్పు నుంచి ఎలా బయటపడేశాడన్నది మిగిలిన కథ. విశ్లేషణ కథ రోటీన్‌గానే ఉంది. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. కథనం కూడా కొత్తగా లేకపోవడం ప్రేక్షకులకు కొంత బోరింగ్ అనిపించవచ్చు. దర్శకుడు తిరు తీసుకున్న పాయింట్‌ను కొత్తగా గ్రిప్పింగ్‌గా చెప్పడానికి ప్రయత్నించకుండా.. రోటిన్ సీన్లతో లాగించడం, యాక్షన్ డోస్ పెంచడం ఈ సినిమాలో కనిపిస్తోంది. గోపీచంద్-మెహరీన్ మధ్య లవ్ ట్రాక్ కొంత బాగున్నా.. కుక్కల డాక్టర్‌గా అలీతో చేయించిన హాస్యం పండకపోగా.. కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి కథాకథనాలు అనుకున్నంత వినూత్నంగా లేకపోవడం, ఒక స్పై థ్రిల్లర్‌కు ఉండాల్సిన ఉత్కంఠభరిత సన్నివేశాలు అంతగా లేకపోవడం ఈ సినిమా మైనస్ అని చెప్పవచ్చు. హీరో గోపీచంద్ రా ఏజెంట్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఛేజింగ్ సీన్లతో దర్శకుడు ఇచ్చిన పాత్రకు నూటికినూరుపాళ్లు న్యాయం చేశాడు. అయితే, కథలోనే కావాల్సినంత సరుకు లేకపోవడం.. గోపీచంద్ పాత్ర కూడా పెద్దగా పేలలేదు. ఇక, హీరోయిన్ ఐశ్యర్వగా మెహరీన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలు, హీరోతో రొమాన్స్‌కే పరిమితం. సెకండాఫ్‌లో వచ్చే జరీన్ ఖాన్ పాత్ర తన పరిధి మేరకు ఆకట్టుకుంది. రా చీఫ్ పాత్రలో నాజర్ కనిపిస్తారు. టెక్నికల్‌గా స్పై థ్రిల్లర్ మూవీస్‌కు ఉండాల్సిన గ్రాండ్ లుక్‌ను తీసుకురావడంలో డైరెక్టర్ తిరు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఛేజింగ్ సీన్లు కూడా బాగానే ఉన్నాయి. సంగీతం సోసోగా ఉన్నా.. . శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. కెమెరావర్క్ కూడా ఓకే అని చెప్పాలి. బలాలు ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాటోగ్రఫి గ్రాండ్ లుక్ బలహీనతలు కథాకథనాలు కొత్తగా లేకపోవడం సినిమా రోటీన్‌గా ఉండటం -
లెంపకాయ కొట్టి అతని షర్ట్ కాలర్ పట్టుకున్నా..
సినిమా హీరోయిన్ కావాలనేది నా డ్రీమ్. స్కూల్ డేస్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నా. 13 ఏళ్లకే కెనడాలో ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా’ టైటిల్‌ను సాధించా. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ద్వారా మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చా. ఎఫ్–2 నా ఫేవరెట్ సినిమా. టాలీవుడ్ నాకు తల్లి. ఈ తల్లిని విడిచిపెట్టి బయటకు పోయేది లేదు. ట్రావెలింగ్ నాకు అత్యంత ఇష్టం. తిరుమలకు కాలినడకన వెళ్లడం అద్భుతమైన ఫీల్...– హీరోయిన్ మెహ్రీన్ క్లాస్‌లో టీచర్ విద్యార్థులను ఒక్కొక్కరినీ వారివారి గోల్స్ ఏంటో చెప్పమన్నారు.. ఒకరు తాను డాక్టర్ అవుతానంది. ఇంకొరు పైలెట్ అన్నారు.. మరొకరు లాయర్.. తర్వాత మరో విద్యార్థి ఐఏఎస్.. ఇంకా ఐపీఎస్.. చార్టెడ్ అకౌంటెంట్.. బిజినెస్.. ఇలా ఎవరి లక్ష్యాలు వారు చెప్పారు. ఓ విద్యార్థిని మాత్రం ఇవన్నీ అవుతానని సమాధానం చెప్పడంతో టీచర్ సైతం ఖంగుతిన్నారు. అదెలా సాధ్యమంటే ‘సినిమా హీరోయిన్’ అయితే అవన్నీ సాధ్యమేనని చెప్పిందా పిల్ల. ఈ గడసరి సమాధానం చెప్పిన ఆ గడుగ్గాయి.. ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’ చిత్రంలో అల్లరి చేసిన ‘మెహరీన్ కౌర్ పిర్జాదా’. తన అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 13 ఏళ్ల వయసులోనే అందాల పోటీల్లో పాల్గొన్న పంజాబీ చిన్నది మరెన్నో విశేషాలను ‘సాక్షి’తో పంచుకుంది. – చైతన్య వంపుగాని 13 ఏళ్లకే టైటిల్ సాధించా.. మాది పంజాబ్‌లోని భటిండా ప్రాంతం. హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి ఉంది. ఆరేళ్ల వయసులో ‘మిస్ యూనివర్స్’ అవ్వాలని కలగన్నాను. 13 ఏళ్లకే కెనడాలో ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏసియా’ టైటిల్‌ను సాధించా. ఇదే సమయంలో డవ్, పియర్స్, నికాన్, థమ్స్ అప్ వంటి యాడ్స్‌లో నటించా. ఉద్యోగం కోసం 12 తరగతి పూర్తయ్యాక యూఎస్‌కి వెళ్లాను. యూఎస్‌లో జాబ్ చేస్తూ యాక్టింగ్, మోడలింగ్‌పై దృష్టి సారించాను. అమెరికా కంటే ముంబై బెస్ట్ అని తిరిగి వచ్చేశా. ముంబైలో ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్ నేర్చుకున్నా. 2016లో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు తెలుగు సినిమాలు, రెండు తమిళం, ఓ హిందీ చిత్రంలో నటించాను. నా ఫస్ట్ సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా, ‘ఎఫ్ 2’ అంటే బాగా ఇష్టం. మొదటి సినిమాలో ‘మహాలక్ష్మి’ రౌడీ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే చిన్నతనంలో నేను అలాగే ఉండేదాన్ని. ‘ఎఫ్ 2’లో హనీ క్యారెక్టర్ చిన్నపిల్లలకు బాగా కనెక్ట్ అయింది. ‘హానీ ఈజ్ ద బెస్ట్’ అంటూ చిన్న పిల్లలు వీడియో షూట్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ నన్ను ట్యాగ్ చేస్తున్నారు. అవి చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. తన స్టాఫ్‌తో మెహ్రీన్ ఐ యామ్ ఎ ట్రావెలర్ షూటింగ్ నుంచి తీరిక దొరికితే ట్రావెల్ చేస్తుంటా. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా నా తమ్ముడు ‘గుర్ఫతే సింగ్ పిర్జాదే’(బాలీవుడ్ యాక్టర్)తో కలసి వెళ్తుంటా. తమ్ముడుకి ఖాళీ లేకపోతే అమ్మతోనో, ఫ్రెండ్స్తోనో వెళ్తుంటా. ట్రెక్కింగ్ అంటే కూడా ఇష్టం. యూఎస్, యూరఫ్ సిటీస్ అంటే చాలా ఇష్టం. ఆస్ట్రేలియా వెళ్లాలని ఉంది. నా మేనేజర్ మహేందర్ పర్మిషన్ ఇస్తే అక్కడకు వెళ్లి ఏదైనా హాలీడే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది(నవ్వుతూ). నేను టెన్త్ చదివుతున్నప్పుడు ఓ రోజు ఫ్రెండ్స్‌తో కలసి ఒక మాల్కి వెళ్లాను. ఆ టైంలో ఒక అబ్బాయి నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా తన మొబైల్ ఫోన్లో ఫొటోలు తీశాడు. వెంటనే సెక్యురిటీ వాళ్లకు సమచారం ఇచ్చా. దగ్గరకు వెళ్లి మొబైల్ చూపించమన్నా. తను చూపించకపోవడంతో ఒక్క లెంపకాయ కొట్టి అతని షర్ట్ కాలర్ పట్టుకున్నా. వెంటనే ఫోన్ తీసుకుని అవన్నీ డిలీట్ చేసేశా. మొబైల్ ఫోన్ అంటే మాట్లాడటం, మెసేజ్‌లు చేసుకోవడానికి వాడతారు. నేను సాంగ్స్ కోసం నా ఫోన్‌ని వాడుతుంటా. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ నేనే నేరుగా చూస్తుంటా. నాకు ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురవలేదు. అందుకు కారణం నాకు మంచి స్టాఫ్ ఉన్నారు. ఇండస్ట్రీలోని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. హైదరాబాద్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఫస్ట్ సినిమాకు ఇక్కడకు వచ్చినప్పుడు రంజాన్ రోజులు.. అమ్మ, స్టాఫ్‌తో కలసి రెండు మూడుసార్లు చార్మినర్ చూడ్డానికి వెళ్లాను. ఇక పెళ్లంటారా.. దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే. తెలుగులో నేను అన్ని మంచి సినిమాలుచేయగలిగానంటే కారణం తెలుగుప్రేక్షకులే. నాకు మొదటి సినిమాతోనే ఓ రేంజ్, క్రేజ్‌ని ఇచ్చారు. ఇంత ఆప్యాయత చూపిస్తున్న ప్రేక్షకులను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టాలీవుడ్ నాకు తల్లి.ఈ తల్లిని విడిచిపెట్టి బయటకు పోయేది లేదు. నాకులవ్ప్రపోజ్చేసేధైర్యంఎవరూచేయలేదు.కారణం స్కూల్,కాలేజీడేస్‌లో టామ్‌బాయ్‌గా ఉండేదాన్ని. అందువల్ల అబ్బాయిలుమాట్లాడాలంటేనేభయపడేవారు. స్కూల్లో టీచర్ మీరేంఅవుతారనుకుంటున్నారని అడిగినప్పుడు హీరోయిన్ నా టార్గెట్ అని చెప్పాను. తిరుమల కాలినడకన వెళ్లా.. సల్మాన్‌ఖాన్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేయాలన్నది నా డ్రీమ్. తెలుగులో సమంత యాక్టింగ్‌కి ఫిదా, బాలీవుడ్లో కాజల్‌కి పెద్ద ఫ్యాన్‌ని. టాలీవుడ్లో అందరి హీరోలతో యాక్ట్ చేయాలనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలి.. ఖచ్చితంగా చేస్తా. ఎఫ్ 2లో నా యాక్టింగ్ బాగుందని విజయశాంతి కాంప్లిమెంట్ ఇచ్చారంట. ఆమెను నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ‘హలో’ హీరోయిన్ ‘కళ్యాణి ప్రియదర్శిని’ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువగా టచ్‌లో ఉంటాం. స్కూల్లో ఎన్సీసీ స్టూడెంట్‌ని. తిరుమల శ్రీవారిని దర్శనానికి కాలి నడకన వెళ్లాను, చాలా హ్యాపీగా ఉంది. త్వరలో తెలుగులో గోపీచంద్, నాగశౌర్య, కళ్యాణ్‌రామ్‌తో కనిపిస్తా. తమిళంలో ధనుష్‌తో ఓ చిత్రం చేస్తున్నా. రెండు పంజాబీ, ఓ కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి.. అంటూ ముగిచింది మెహ్రీన్. -
వాడు కాజేస్తోంది నీ బతుకుని రా..!
టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ మరో యాక్షన్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే ‘పంతం’. కే చక్రవర్తి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్లతోనే ట్రైలర్‌ను కట్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ స్టైలిష్ అప్పీల్‌తో ఆకట్టుకునే యత్నం చేశాడు. ఓవైపు ఎంటర్టైన్మెంట్తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్ సబ్జెక్టును డైరెక్టర్ డీల్ చేశాడు. కోర్టు సీన్ సన్నివేశాన్ని హైలెట్ గా చూపించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. జూలైలో పంతం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తారలు దిగి వచ్చిన వేళ..
ఏలూరులో శుక్రవారం సినీ తారలు సందడి చేశారు. జీవీ మాల్ప్రారంభోత్సవానికి నటీమణులు రాశీఖన్నా, మెహరీన్ కౌర్, రీతూవర్మవిచ్చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఏలూరు(సెంట్రల్): నగరంలో సినీ తారలు రాశీఖన్నా, మోహరీన్ కౌర్, పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ సందడి చేశారు. స్థానిక విజయవిహార్ సెంటర్లో నూతనంగా నిర్మించిన జీవీ మాల్‌ను వారు ప్రారంభించారు. షాపింగ్ మాల్లో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వస్త్రాలను పరిశీలించారు. మొదటి ఫ్లోర్‌ను స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి, రెండో ఫోర్ల్ను మేయరు షేక్ నూర్జహాన్, మూడో ఫ్లోర్‌ను వింగ్ కమాండర్ కలిదిండి ఆంజనేయరాజు, నాలుగో ఫ్లోర్‌ను ఎస్ఎంఆర్ ఎస్టేట్ అధినేత పెదబాబు ప్రారంభించారు. భద్రాద్రి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి మొదటిగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్లు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతోగానో ఆదరిస్తారన్నారు. ఏలూరు ప్రజలు ఫ్యాషన్ వస్త్రాలను ఎంతోగానో ఇష్టాపడతారన్నారు. జీవీ మాల్లో మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని, వినియోగదారులు మార్కెట్లో ధరలను, జీవీ మాల్లో ధరలను పోల్చి చూస్తే అర్థమవుతుందన్నారు. సినీ తారలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
హాట్ టాపిక్‌గా విజయ్ దేవరకొండ నెక్స్ట్
సాక్షి, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో సెన్సేషన్‌కు తెర లేపాడు. అతను నటిస్తున్న ద్విబాషా చిత్రం టైటిల్‌ను నిర్మాతలు ప్రకటించారు. నోటా అన్న టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసేశారు. ఇంక్ మార్క్ వేసి ఉన్న మధ్య వేలును చూపిస్తున్న విజయ్ దేవరకొండ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ లుక్‌తో నోటా పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో సాగే సినిమా అన్నది స్పష్టమౌతోంది. సమకాలీనన రాజకీయాలు.. పొలిటికల్ లీడర్ అయిన హీరో తండ్రి, తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు అన్నదే చిత్ర ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయంట. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయిక కాగా, కీలక పాత్రల్లో సత్యరాజ్, నాజర్‌లు నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాను రూపొందిస్తున్నాడు. My Official Statement.#NOTA pic.twitter.com/KcuUUTpPpy — Vijay Deverakonda (@TheDeverakonda) 8 March 2018 -
‘సమంత, మెహ్రీన్ ఎంతో ఆవేదన చెందారు’
సాక్షి, హైదరాబాద్: స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీనటి సనా అన్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న రహస్య కెమెరాలు విచ్చలవిడిగా అమ్మకుండా చూడాలని కోరారు. ఆన్లైన్లో స్పై కెమెరాలు కేవలం రూ.250కే దొరకటం విచారకరమన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో స్వచ్ఛంద సంస్థ హెవెన్ హోమ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ‘యాంటి రెడ్ ఐ’ పేరుతో చేపడుతున్న మిస్డ్‌కాల్ (8099259925) క్యాపెయినింగ్ బ్రోచర్‌ను సనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ.. స్పై కెమెరాల వల్ల కలిగే అనర్థాలపై నటీమణులు సమంత, మెహ్రీన్‌లు ఎంతో ఆవేదన వ్యక్తం చేసి తమతో కలిసి ఈ మిస్డ్‌కాల్ క్యాపెయినింగ్‌లో భాగస్వాములయ్యారని తెలిపారు. రహస్య కెమెరాలను దుర్వినియోగం చేస్తూ మహిళలను సమిధలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాంపు బాటిల్స్, టూత్‌బ్రష్ తదితర వస్తువుల్లో సులువుగా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారని తెలిపారు. తుపాకులకు లైసెన్సులు పెట్టినట్టుగానే రహస్య కెమెరాల విక్రయాలకూ లైసెన్స్‌లు తప్పనిసరి చేయాలన్నారు. కార్యక్రమంలో హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు జి. వరలక్ష్మీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ భువనేశ్వరి, సీనియర్ లాయర్ రాధా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఆమెలా వెరైటీ పాత్రలు చేయాలని ఉంది..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినీ పరిశ్రమలో ఏళ్లు తరబడి ఉండాలంటే హార్డ్‌వర్క్‌తో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని మెహ్రీన్ కౌర్ పిర్జాదా (జవాన్ ఫేం) అన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరూ గమనిస్తారని కాబట్టి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలన్నారు. తను ఏ చిత్రం చేసినా మొదటి చిత్రంగానే భావిస్తానన్నారు. నగరంలోని వీపీఐ రోడ్డులోని ఇమారా షాపింగ్ మాల్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మెహరిన్ సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్ర: హలో మెహరిన్ ఎలా ఉన్నారు..? జ: ఫైన్.. ప్ర:ఈ మధ్య వైజాగ్‌కు చాలా ఎక్కువసార్లు వస్తున్నట్లు ఉన్నారు...? జ:అవునండి..వైజాగ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్ అభిమానులు నాపై ఎప్పుడూ ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. ప్ర:మీరు చేసిన సినిమాల్లో ఫెయిల్యూర్స్‌పై కామెంట్? జ: ఏ పరిశ్రమంలోనైనా గెలుపోటములు సహజం, పాజిటివ్‌గా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం ప్ర:మీ కిష్టమైన నటి? జ:ప్రియాంక చోప్రా, అనుష్క, కాజోల్ అంటే చాలా ఇష్టం. ప్ర:మీ డ్రీమ్ రోల్ జ:అనుష్క చేసే వెరైటీ పాత్రలు చేయాలని ఉంది. అరుంధతి, రుద్రమాదేవి ఇలాంటి పాత్రలు చేస్తే జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. ఐ లవ్ అనుష్క. ప్ర: మీరు నటించిన సినిమాల్లో ఇష్టమైన పాత్ర? జ: కృష్టగాడీ వీరప్రేమ గాథలో మహాలక్ష్మి పాత్ర అంటే చాలా ఇష్టం. ప్ర: భవిష్యత్ ప్రాజెక్టులు? జ: ప్రస్తుతం గోపీచంద్‌తో నటిస్తున్నా. మరికొన్ని చర్చల్లో ఉన్నాయి. ప్ర: గోపిచంద్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది...? జ: ఆ సినిమాలో యంగ్ టీచర్ పాత్ర పోషిస్తున్నా. మొత్తం సోషల్ డ్రామాగా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇమారా షాపింగ్ మాల్‌ను ప్రారంభిస్తూ... -
సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ ప్రి రిలీజ్ వేడుకలు
-
సరికొత్త సత్యభామ