
ఛలో తర్వాత హిట్ అందుకోవడమై గగనమైపోయిన నాగశౌర్య వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ మళ్లీ హిట్ అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఆయనే నేరుగా ‘అశ్వథ్థామ’ కథ సిద్ధం చేసుకోగా నూతన దర్శకుడు రమణ తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన నాగశౌర్య ఫస్ట్‌లుక్ మాస్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో నాగశౌర్యకు జోడీగా హీరోయిన్ మెహరీన్ నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment