Amala Paul And Mehreen Demand Huge Remuneration For Nagarjuna Movie - Sakshi
Sakshi News home page

Nagarjuna-Praveen Sattaru Movie: మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్స్‌

Published Fri, Nov 19 2021 9:09 AM | Last Updated on Fri, Nov 19 2021 11:11 AM

Amala Paul And Mehreen Demands Remuneration For Nagarjuna Movie - Sakshi

నాగార్జున అక్కినేని ప్రస్తుతం ‘బంగార్రాజు’ మూవీతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు ఆయన ప్ర‌వీణ్‌ స‌త్తారుతో ఓ ప్రాజెక్ట్‌ చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీకి 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను అనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా మొదట కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు మేకర్స్‌. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్‌ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. దీంతో హీరోయిన్‌ వేటలో పడ్డ మేకర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారట మన కథానాయికలు.

చదవండి: ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు

ఈ సినిమా కోసం హీరోయిన్‌ అమలా పాల్‌ను సంప్రదించగా.. ఆమె భారీగా డిమాండ్‌ చేసి మేకర్స్‌కు షాక్‌ ఇచ్చిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను కాదని మెహరీన్‌ కౌర్‌ను అడగ్గా ఈ బ్యూటీ కూడా కోటీ రూపాయలకు వరకు డిమాండ్‌ చేసిందని వినికిడి. ఇక హీరోయిన్ల వైఖ‌రితో నిర్మాత‌లు విసిగిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు కాస్తా వైరల్‌ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాక అమలా పాల్‌, మెహరీన్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: కృతిశెట్టి లుక్‌ షేర్‌ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement