
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినీ పరిశ్రమలో ఏళ్లు తరబడి ఉండాలంటే హార్డ్‌వర్క్‌తో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని మెహ్రీన్ కౌర్ పిర్జాదా (జవాన్ ఫేం) అన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరూ గమనిస్తారని కాబట్టి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలన్నారు. తను ఏ చిత్రం చేసినా మొదటి చిత్రంగానే భావిస్తానన్నారు. నగరంలోని వీపీఐ రోడ్డులోని ఇమారా షాపింగ్ మాల్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మెహరిన్ సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్ర: హలో మెహరిన్ ఎలా ఉన్నారు..?
జ: ఫైన్..
ప్ర:ఈ మధ్య వైజాగ్‌కు చాలా ఎక్కువసార్లు వస్తున్నట్లు ఉన్నారు...?
జ:అవునండి..వైజాగ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్ అభిమానులు నాపై ఎప్పుడూ ప్రేమ కురిపిస్తూనే ఉంటారు.
ప్ర:మీరు చేసిన సినిమాల్లో ఫెయిల్యూర్స్‌పై కామెంట్?
జ: ఏ పరిశ్రమంలోనైనా గెలుపోటములు సహజం, పాజిటివ్‌గా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం
ప్ర:మీ కిష్టమైన నటి?
జ:ప్రియాంక చోప్రా, అనుష్క, కాజోల్ అంటే చాలా ఇష్టం.
ప్ర:మీ డ్రీమ్ రోల్
జ:అనుష్క చేసే వెరైటీ పాత్రలు చేయాలని ఉంది. అరుంధతి, రుద్రమాదేవి ఇలాంటి పాత్రలు చేస్తే జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. ఐ లవ్ అనుష్క.
ప్ర: మీరు నటించిన సినిమాల్లో ఇష్టమైన పాత్ర?
జ: కృష్టగాడీ వీరప్రేమ గాథలో మహాలక్ష్మి పాత్ర అంటే చాలా ఇష్టం.
ప్ర: భవిష్యత్ ప్రాజెక్టులు?
జ: ప్రస్తుతం గోపీచంద్‌తో నటిస్తున్నా. మరికొన్ని చర్చల్లో ఉన్నాయి.
ప్ర: గోపిచంద్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది...?
జ: ఆ సినిమాలో యంగ్ టీచర్ పాత్ర పోషిస్తున్నా. మొత్తం సోషల్ డ్రామాగా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది.
ఇమారా షాపింగ్ మాల్‌ను ప్రారంభిస్తూ...
Comments
Please login to add a commentAdd a comment