వాడు కాజేస్తోంది నీ బతుకుని రా..! | Gopichand Pantham Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 10:19 AM | Last Updated on Mon, Jun 25 2018 10:23 AM

Gopichand Pantham Movie Trailer Out - Sakshi

పంతం ట్రైలర్‌లో ఓ సన్నివేశం

టాలీవుడ్‌ మాచో స్టార్‌ గోపీచంద్‌ మరో యాక్షన్‌ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే ‘పంతం’. కే చక్రవర్తి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్లతోనే ట్రైలర్‌ను కట్‌ చేశారు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్‌ స్టైలిష్‌ అప్పీల్‌తో ఆకట్టుకునే యత్నం చేశాడు. ఓవైపు ఎంటర్‌టైన్‌మెంట్‌తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్‌ సబ్జెక్టును డైరెక్టర్‌ డీల్‌ చేశాడు. కోర్టు సీన్‌ సన్నివేశాన్ని హైలెట్‌ గా చూపించారు.  గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. జూలైలో పంతం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement