gopi sunder
-
ట్యూన్ కుదిరిందా?
ఇన్ని రోజులు కథపై వర్క్ చేసిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ఇప్పుడు సంగీతదర్శకుడు గోపీ సుందర్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదంతా ఆయన నెక్ట్స్ చిత్రం గురించే. అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ట్యూన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు టీమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, రష్మికా మండన్నాపేర్లు తెరపైకి వచ్చాయి. హీరోయిన్ ఎవరు? అనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
వాడు కాజేస్తోంది నీ బతుకుని రా..!
టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ మరో యాక్షన్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే ‘పంతం’. కే చక్రవర్తి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్లతోనే ట్రైలర్‌ను కట్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ స్టైలిష్ అప్పీల్‌తో ఆకట్టుకునే యత్నం చేశాడు. ఓవైపు ఎంటర్టైన్మెంట్తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్ సబ్జెక్టును డైరెక్టర్ డీల్ చేశాడు. కోర్టు సీన్ సన్నివేశాన్ని హైలెట్ గా చూపించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. జూలైలో పంతం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పాటకు ఆస్కారం?
ఆస్కార్ ఆశలు ఇంకా చెదిరిపోలేదు. ‘న్యూటన్’ అవుట్ అయిందని బాధపడక్కర్లేదు. ఆస్కార్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈసారి బాలీవుడ్ కాదు మాలీవుడ్ సినిమా రేసులో ఉంది. బెస్ట్ ఫారిన్ చిత్రం క్యాటగిరీలో ‘న్యూటన్’ అవుట్ అయ్యాక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఓ ఇండియన్ సినిమాకి అవకాశం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ ఈ సంవత్సరం ఆస్కార్ ఆవార్డ్స్ గెలిచే అవకాశం ఉన్న 70 పాటల లిస్ట్‌ను ప్రకటించింది. ఆ లిస్ట్‌లో మలయాళ సంగీతదర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ‘పులిమురుగన్’లోని రెండు పాటలు (‘కాదనయుమ్ కల్చిలంబే, మానతే మారికురంబే’) స్థానం సంపాదించుకోగలిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్న 70 పాటల్లో పాప్ సంగీత సంచలనాలు టేలర్ స్విఫ్ట్, నిక్ జోన్స్‌తో పాటు గోపీసుందర్ సమకూర్చిన రెండు పాటలు ఉండటం విశేషం. ఈ విషయమై గోపీసుందర్ స్పందిస్తూ – ‘‘ఈ లిస్ట్‌ను మొదటిసారి చూసి నమ్మలేదు. కానీ, అకాడమీ సంస్థ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చేసరికి నమ్మక తప్పలేదు. నాకు ఇప్పటి వరకు స్టేట్ అవార్డ్ రాలేదు కానీ, నేషనల్ అవార్డ్ లభించింది. ప్రేక్షకులకు నచ్చటమే అంతిమ విజయంగా భావిస్తా’’ అన్నారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘పులిమురుగన్’ తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలై, ఇక్కడా విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్ చేరుకున్న తొలి మాలీవుడ్ మూవీగా పేరు సంపాదించింది. -
మహేష్ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్లో రిలీజ్‌కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే మరో సినిమాను ప్రారంభించనున్నాడు మహేష్. హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. అంతేకాదు కొరటాల సినిమా తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పేశాడు మహేష్. పీవీపీ సంస్థ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించనుంది. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు స్వరాలందించనున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమాకు మ్యూజిక్ చేసిన గోపిసుందర్ మహేష్ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. -
ఆగస్టు 26న మజ్ను ఆడియో
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యువ నటుడు నాని, హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మజ్ను. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేశాడు హీరో నాని. మంగళవారం ఉదయం సినిమాలోని కళ్లు మూసి తెరిచే లోపే పాటను రిలీజ్ చేసిన నాని, ఆగస్టు 26న ఆడియో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.