ట్యూన్‌ కుదిరిందా? | akhil next movie bommarillu bhaskar and gopi sundar | Sakshi
Sakshi News home page

ట్యూన్‌ కుదిరిందా?

Published Sun, May 19 2019 1:06 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

akhil next movie bommarillu bhaskar and gopi sundar - Sakshi

ఇన్ని రోజులు కథపై వర్క్‌ చేసిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ఇప్పుడు సంగీతదర్శకుడు గోపీ సుందర్‌తో కలిసి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదంతా ఆయన నెక్ట్స్‌ చిత్రం గురించే. అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ట్యూన్స్‌ను ఫైనలైజ్‌ చేసే పనిలో ఉన్నారు టీమ్‌. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ సెకండ్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, రష్మికా మండన్నాపేర్లు తెరపైకి వచ్చాయి. హీరోయిన్‌ ఎవరు? అనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement