సందీప్ కిషన్ 'మజాకా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Sundeep Kishan latest Movie Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Sundeep Kishan: సందీప్ కిషన్ 'మజాకా'.. పగలే చుక్కలే చూపిద్దామంటోన్న హీరో!

Published Tue, Feb 18 2025 7:40 PM | Last Updated on Tue, Feb 18 2025 7:40 PM

Sundeep Kishan latest Movie Lyrical Song Out Now

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ  మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.

ఈ సినిమాకు సంబంధించి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'హేయ్ పగిలి పగిలి అంటూ సాగే' లిరికల్‌ పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. కాగా.. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement