
‘బిగ్ సీ’ నూతన షోరూం ప్రారంభించిన సినీతార రాశిఖన్నా
ప్రముఖ సినీ నటి రాశిఖన్నా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. బిగ్‌సీ 16వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నగరానికి వచ్చిన ఈమె తన సినిమాలోని పాటలు పాడి అభిమానులను హుషారెక్కించారు. గోదావరి తీరానికి రావడం చాలా ఆనందంగా ఉందని రాశిఖన్నా అన్నారు.
తూర్పుగోదావరి, సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రముఖ సినీ నటి రాశిఖన్నా నగరంలో సందడి చేశారు. ‘బిగ్ సీ’ 16వ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన నూతన షోరూం ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె వచ్చారు. ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా పాటతో ప్రేక్షకుల మదిని దోచుకున్న రాశిఖన్నా మాట్లాడుతూ బిగ్ సీ షోరూం ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. బిగ్ సీలో ఆఫర్లను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. బిగ్ సీ ఫౌండర్, సీఏండీ బాలుచౌదరి మాట్లాడుతూ ఈ షోరూం కోస్తా ఆంధ్రలోనే అతిపెద్ద షోరూం అని చెప్పారు. ప్రతి మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. రాశిఖన్నాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు బిగ్ సీ నూతన షోరూమ్ వద్దకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment