big c
-
బిగ్ ‘సి’ ఉగాది ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ ఉగాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీల కొనుగోలుపై 7.50% వరకు తక్షణ తగ్గింపు అందిస్తుంది. ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో వీటిని కొనుగోలు చేయవచ్చు. మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు సంవత్సరం పూర్తిగా, రెండో ఏటా రూ.8వేల వరకు ‘మొబైల్ ప్రొటెక్షన్’ అదనంగా పొందవచ్చు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51% వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రజలంతా ఉగాది ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ బాలు చౌదరి కోరారు. -
Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ ఉగాది పండుగ సందర్భంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది.మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ యం.బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై పదిశాతం వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభ ఈఎంఐలలో పొందొచ్చన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) స్మార్ట్ టీవీల కొనుగోలుపై 1,500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుందన్నారు. సులభ ఈఎంఐ పద్ధతిలో ల్యాప్టాప్స్ కొనే సౌకర్యం కూడా ఉందన్నారు. ‘‘ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. మా రిటైల్ స్టోర్లలో ఆన్లైన్ కంటే తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి’’ అని బాలు చౌదరి కోరారు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51 శాతం తగ్గింపు, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు, రూ.2000 విలువైన అడాప్టర్ ఉచితం వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లలో శాంసంగ్ మొబైల్‌పై రూ.పదివేలు, Vivoపై రూ.5,000, Oppo మొబైల్‌పై 10 శాతంతగ్గింపు లాంటివి ఉన్నాయి. (వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ) -
బిగ్’సి’ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు ‘‘డబుల్ ధమాకా ఆఫర్’’ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.199లకే లేదా రూ.3,999 విలువైన గిగ్మోర్ కాలింగ్ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ.999లకే అందించనుంది. ప్రతిస్మార్ట్ ఫోన్‌పై రూ.7900 వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ప్రతి ల్యాప్‌ట్యాప్ కొనుగోలుపై రూ.3వేల తక్షణ డిస్కౌంట్‌తో పాటు ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితంగా ఇస్తుంది. ఏటీఎం కార్డుపై ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ఆకర్షణీయమైన సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలు చౌదరి తెలిపారు. -
విజయవాడలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
బిగ్ సి సంక్రాంతి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ రీటైల్ విక్రయ సంస్థ బిగ్ సి కస్టమర్లకు కోసం సంక్రాంతికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సందర్భంగా మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సి వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైళ్ల కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్‌పై కచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామన్నారు. అమెజాన్ పే, డెబిట్‌కార్డు, పేటియం మాల్ ద్వారా కొనుగోళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని బిగ్–సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ డైరెక్టర్లు స్వప్న కుమార్, జి.బాలాజీ రెడ్డి, కైలాశ్ లఖ్యానీ, గౌతమ్ రెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ప్రస్తుతం 250 స్టోర్లను నిర్వహిస్తున్నాం. కర్ణాటకలో త్వరలో అడుగుపెడతాం. రెండేళ్లలో కొత్తగా 250 ఔట్లెట్లను ఏర్పాటు చేస్తాం. 30,000 జనాభా ఉన్నచోట దుకాణాన్ని తెరుస్తాం. నూతన స్టోర్ల ఏర్పాటుకు రూ.125 కోట్లు పెట్టుబడి అవుతుంది. ఈ నెలలోనే ల్యాప్టాప్స్ అమ్మకాలను ప్రారంభిస్తున్నాం. 19 ఏళ్లలో 3 కోట్ల పైగా వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. వీరిలో 70% పాత కస్టమర్లే. తెలుగు రాష్ట్రాల్లో 30% వాటా చేజిక్కించుకున్నాం. సంస్థలో 2,000 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లలో వీరి సంఖ్య రెండింతలు అవుతుంది. కోవిడ్ ముందస్తు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తాం. 2022–23లో రూ.1,500 కోట్లు, తర్వాతి ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. ఆ తర్వాత ఐపీఓకు వెళ్లాలని భావిస్తున్నాం’ అని వివరించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. 8.5 లక్షలపైచిలుకు మంది వర్తకులు కోట్లాది ఉత్పత్తులను విక్రయించనున్నారు. మహేశ్ బాబుతో కైలాశ్ లఖ్యానీ, స్వప్న కుమార్, బాలు చౌదరి, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి (ఎడమ నుంచి కుడికి) -
90 నిముషాల్లో ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ ఆన్లైన్ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్, యాప్ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిమిషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో 225 ఔట్లెట్లు ఉన్నాయి. కర్ణాటకలో కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నట్టు బిగ్ సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. 17వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించిన సందర్భంగా డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, కైలాష్ లఖ్యానీతో కలిసి సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 మార్చి నాటికి స్టోర్ల సంఖ్య 300లకు చేరుతుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లదాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టోర్లలో ఇతర ఉపకరణాలు.. మొబైల్స్, యాక్సెసరీస్‌తోపాటు ఎంఐ, టీసీఎల్ కంపెనీల స్మార్ట్ టీవీల విక్రయాలను ప్రారంభించామని బాలు చౌదరి తెలిపారు. ‘ఇతర కంపెనీల స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెడతాం. ఇంటర్నెట్తో అనుసంధానించే స్మార్ట్ ఉపకరణాల సంఖ్య పెంచుతాం. 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని రూ.12 కోట్ల విలువైన బహుమతులు, రూ.5 కోట్ల విలువైన క్యాష్ పాయింట్లను సైతం ఆఫర్ చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్ కార్డు ద్వారా ఖచ్చితమైన బహుమతిని కస్టమర్ అందుకోవచ్చు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి బహుమతులు వీటిలో ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది’ అని వివరించారు. 5 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
బిగ్‘సి’లో ‘వన్‌ప్లస్7టీ’ మొబైల్ విక్రయాలు
మల్టీబ్రాండ్ మొబైల్ షోరూమ్ బిగ్ ‘సి’... ‘వన్‌ప్లస్7టీ’ విక్రయాలను ప్రారంభించింది. హైదరాబాద్ (కూకట్పల్లి, బాలాజీనగర్) షో రూమ్‌లో ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో బిగ్‘సి’ బ్రాండ్ అంబాసిడర్, సినీతార సమంత అక్కినేని, సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి, వన్‌ప్లస్ ఇండియా జనరల్ మే నేజర్ వికాస్ అగర్వాల్, బిగ్‘సి’ డైరెక్టర్లు వై. స్వప్నకుమార్, కైలాశ్ లఖ్యాని, బాలజీ రెడ్డి, ఆర్.గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. వన్‌ప్లస్ 7టీ వి క్రయాలకు సంబంధించి రూ.1,500 ఇన్స్టెం ట్ క్యాష్ బ్యాక్ (హెచ్డీఎఫ్సీ), ఆరు నెలల ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లపై ఎటువంటి అదనపు సొమ్మూ వసులు చేయకపోవడం వంటి ఆఫర్లు ఉన్నట్లు సంబంధిత ప్రకటన పేర్కొంది. -
బిగ్ సీలో సంక్రాంతి ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైల్స్‌పై అన్ని బ్యాంక్‌ల కార్డ్‌ల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్, అన్ని వివో మోడల్స్‌పై సర్ప్రైజ్ గిఫ్ట్‌లను అందిస్తోంది. దీంతో పాటు ఒప్పో ఎఫ్9 ప్రొ కొంటే రైస్ కుక్కర్ ఉచితం, రూ.1,590 కార్బన్న్కే3 బూమ్ మ్యాక్స్ సెల్‌ఫోన్‌పై రూ.2,500 విలువ గల ఫ్యాన్ ఉచితంగా అందుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా...
ప్రముఖ సినీ నటి రాశిఖన్నా రాజమహేంద్రవరంలో సందడి చేశారు. బిగ్‌సీ 16వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నగరానికి వచ్చిన ఈమె తన సినిమాలోని పాటలు పాడి అభిమానులను హుషారెక్కించారు. గోదావరి తీరానికి రావడం చాలా ఆనందంగా ఉందని రాశిఖన్నా అన్నారు. తూర్పుగోదావరి, సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రముఖ సినీ నటి రాశిఖన్నా నగరంలో సందడి చేశారు. ‘బిగ్ సీ’ 16వ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన నూతన షోరూం ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె వచ్చారు. ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా పాటతో ప్రేక్షకుల మదిని దోచుకున్న రాశిఖన్నా మాట్లాడుతూ బిగ్ సీ షోరూం ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. బిగ్ సీలో ఆఫర్లను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. బిగ్ సీ ఫౌండర్, సీఏండీ బాలుచౌదరి మాట్లాడుతూ ఈ షోరూం కోస్తా ఆంధ్రలోనే అతిపెద్ద షోరూం అని చెప్పారు. ప్రతి మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. రాశిఖన్నాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు బిగ్ సీ నూతన షోరూమ్ వద్దకు వచ్చారు. -
‘బిగ్ సి’ 226వ షోరూమ్..వైజాగ్‌లో
మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ వైజాగ్‌లో తమ 226వ నూతన షోరూంను ప్రారంభించింది. సినీతార, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ రాశీ ఖన్నా బుధవారం దీన్ని ప్రారంభించారు. వైజాగ్‌లో ఇది తమ 17వ షోరూమ్ అని తెలిపిన సంస్థ డైరెక్టర్లు బాలజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్.. పండుగల సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ఎంపికచేసిన శాంసంగ్ మొబైల్స్ కొనుగోలుపై రూ.11,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్, వివో వి11ప్రో, ఒప్పొ ఎఫ్9ప్రొ మొబైల్స్ కొనుగోలుపై రూ.5,999 విలువగల ట్రాలీ సూట్‌కేస్ వంటి అనేక ఆఫర్లు ఉన్నట్లు తెలిపారు. -
‘బిగ్ సి’ దసరావళి ఆఫర్లు
మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ తమిళనాడులో ఎంట్రీ ఇచ్చింది. మధురైలో ఏర్పాటు చేసిన తొలి ఔట్‌లెట్‌ను సంస్థ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దసరావళి ఆఫర్లను ఆవిష్కరించారు. ఆరు వారాలపాటు సాగే ఈ ఆఫర్లో లక్కీ డ్రా ద్వారా మొత్తం 252 మంది కస్టమర్లకు 42 హ్యూందాయ్ ఇయాన్ కార్లు, 42 ప్లాటినా బైక్‌లు, 42 ఎల్ఈడీ టీవీలు, 42 రిఫ్రిజిరేటర్లు, 42 వాషింగ్ మెషీన్లు, 42 ల్యాప్‌టాప్‌లను బహుమతిగా అందజేస్తామని బిగ్ సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. శాంసంగ్ నోట్ 7పై రూ.6,000 పేటీఎం క్యాష్‌బ్యాక్, వివో వి11 ప్రో, ఒప్పో ఎఫ్9 ప్రో మొబైల్‌పై రూ.5,999 విలువగల ట్రాలీ సూట్‌కేస్, హానర్ 7సీ మొబైల్‌పై రూ.1,499 విలువైన బ్లూటూత్ ఉచితం వంటి ఆఫర్లున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్ లఖ్యానీ పాల్గొన్నారు. -
బిగ్‌సీ కొత్త లోగోని ఆవిష్కరించిన సమంతా
-
ఏటా 100 ‘బిగ్ సి’ ఔట్లెట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ ఏటా 100 ఔట్లెట్లను తెరవనుంది. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 225 స్టోర్లు ఉన్నాయి. సెప్టెంబరులో తమిళనాడులో ఎంట్రీ ఇస్తున్నట్టు సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. గురువారమిక్కడ బిగ్ సి కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత అక్కినేని వ్యవహరిస్తారని ప్రకటించారు. ‘2019 మార్చినాటికి 300 కేంద్రాల స్థాయికి చేరతాం. మూడేళ్లలో దక్షిణాదిన పూర్తి స్థాయిలో విస్తరించి, టాప్ రిటైలర్‌గా నిలవాలన్నది లక్ష్యం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అడుగుపెడతాం. 2017–18లో రూ.1,015 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు ఆశిస్తున్నాం. ప్రస్తుతం 2,500 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు’ అని వివరించారు. -
బిగ్ ‘సి’లో ‘హానర్ 9ఎన్’ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్ ‘సి’లో ప్రఖ్యాత ఇ–బ్రాండ్ ‘హానర్ 9ఎన్ 4+128 జీబీ’ స్మార్ట్‌పోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బిగ్ ‘సి’ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్ రాశిఖన్నా ఈ మొబైల్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిగ్ ‘సి’ ఫౌండర్, సీఎండీ ఎం బాలు చౌదరితోపాటు యూటీఎల్ ఎండీ సుధీర్ హాసిజ, ఎల్‌ఎఫ్‌ఆర్ బిజినెస్ సంస్థ డైరెక్టర్ హితేష్ శర్మ, బిగ్ ‘సి’ డైరెక్టర్లు వై స్వప్న కుమార్, జీ బాలాజీ రెడ్డి, ఆర్ గౌతమ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు చౌదరి మాట్లాడుతూ, ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఒకే ధర ఉందని తెలిపారు. రూ.17,999 ధరకు సఫైర్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. -
రెండు గంటల్లోనే ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ కొత్త సేవలకు శ్రీకారం చుడుతోంది. వెబ్ లేదా ఫోన్ కాల్ ద్వారా మొబైల్ ఫోన్ కావాలని ఆర్డరిస్తే... రెండు గంటల్లోపు ఫ్రీ డెలివరీ చేస్తారు. తమకు ప్రస్తుతం స్టోర్లున్న అన్ని ప్రాంతాల్లో ఈ సేవలను నెల రోజుల్లోగా ప్రారంభిస్తామని ‘బిగ్ సి’ ఫౌండర్ ఎం.బాలు చౌదరి చెప్పారు. బుధవారమిక్కడ కంపెనీ డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుడు కోరితే ఇంటి వద్దే మొబైల్ డెమో సైతం ఇస్తామని, దీనికి అదనపు చార్జీలేవీ వసూలు చేయబోమని స్పష్టంచేశారు. మొబైల్స్ రిటైల్ రంగంలో భారత్‌లో తొలిసారిగా తాము ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. త్వరలో ఇతర దక్షిణాది రాష్ట్రాలకు.. బిగ్ సి 200వ ఔట్‌లెట్‌ను సినీ నటుడు అఖిల్ అక్కినేని ప్రారంభించారు. అలాగే బుధవారం మరో ఆరు స్టోర్లను సైతం కంపెనీ తెరిచింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ ఔట్లెట్ల సంఖ్య 206కు చేరింది. హైదరాబాద్‌లోనే 60 కేంద్రాలున్నాయని బాలు చౌదరి ఈ సందర్భంగా చెప్పారు. ‘జూలైకల్లా భాగ్యనగరిలో కొత్తగా మరో 40 స్టోర్లు వస్తాయి. ఈ ఏడాదే కర్ణాటక, తమిళనాడు, కేరళలో అడుగుపెడుతున్నాం. వీటిలో ప్రతి రాష్ట్రంలో ఏడాదిన్నరలో 100 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మొత్తంగా 2019 మార్చి నాటికి బిగ్ సి ఔట్లెట్ల సంఖ్య 350 దాటుతుంది. కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాది కాలంలో అన్ని స్టోర్లను అప్‌గ్రేడ్ చేశాం’ అని వివరించారు. 50 శాతం వాటా లక్ష్యం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌లో ప్రస్తుతం నెలకు 7.5 లక్షల వరకూ మొబైల్ ఫోన్లు అమ్ముడవుతున్నాయని, దీన్లో తమ వాటా 33 శాతమని ఈ సందర్భంగా బాలు చౌదరి చెప్పారు. ‘‘ఏడాదిలో ఈ వాటాను 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా దగ్గర కొంటున్న వారిలో 80 శాతం మంది అంతకు ముందు కొన్నవారే ఉంటున్నారు. 2017–18లో కంపెనీ రూ.1,000 కోట్లకుపైగా టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఏడాది రూ.2,000 కోట్లు దాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంస్థ ఔట్లెట్లలో మొత్తం 2,500 మంది ఉద్యోగులున్నారు. ఒక్కో కేంద్రం ద్వారా కొత్తగా 12– 15 మందికి ఉపాధి లభిస్తోందని బాలు చౌదరి తెలియజేశారు. -
బిగ్‘సి’లో నోకియా–8 సిరాకో,నోకియా–7 ప్లస్ స్మార్ట్‌ఫోన్స్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్‘సి’ తాజాగా నోకియా–8 సిరాకో, నోకియా–7 ప్లస్ స్మార్ట్ఫోన్లను వినియోగదారుల కోసం తన ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంచింది. హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న బిగ్‘సి’ షోరూమ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ ఫౌండర్, సీఎండీ యం.బాలు చౌదరి, సినీ నటి అను ఇమ్మాన్యుయెల్, హెచ్ఎండీ గ్లోబల్ జనరల్ మేనేజర్ (దక్షిణ ప్రాంతం) టి.ఎస్.శ్రీధర్ ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ మొబైల్ హ్యాండ్సెట్స్ కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని బాలు చౌదరి తెలిపారు. అలాగే ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ స్మార్ట్ఫోన్లను ప్రిబుక్ చేసుకున్నవారికి 10 శాతం క్యాష్‌బ్యాక్, మేక్మైట్రిప్ ద్వారా 25 శాతం డిస్కౌంట్‌తోపాటు రూ.3,999 విలువైన ఐ–బాల్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. -
విజయవాడలో బిగ్ సి 9వ షోరూమ్ ప్రారంభం
విజయవాడలో 9వ ‘బిగ్ సి’ షోరూమ్‌ను ప్రముఖ సినీనటి, బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్, రాశీ ఖన్నా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్ సీ ఈడీ వై. స్వప్నకుమార్ పాల్గొన్నారు. ఈ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నామని, ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితంగా ఒక బహుమతిని గెల్చుకోవచ్చని తెలిపారు. -
బిగ్‘సి’ దసరావళి ఆఫర్
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్‘సి’ తాజాగా దసరావళి ఆఫర్ రెండో వారం లక్కీ డ్రా నిర్వహించింది. ఏడుగురిని విజేతలుగా ప్రకటించింది. దసరావళి డబుల్ ధమాకా ఆఫర్ (36 రోజులు, 36 కార్లు)కు విశేష స్పందన లభిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రతి వారం డ్రా ఉంటుంది. ఏడుగురు విజేతలకు ఏడు కార్లు అందిస్తాం. దీపావళి సందర్భంగా ఫోన్ల కొనుగోలుపై పలు బహుమతులు అందిస్తున్నాం’’ అని తెలిపింది. విజేతల పేర్లు, వివరాలు www. sakshibusiness. com లో చూడొచ్చు. -
వరంగల్‌లో సమంత సందడి
-
సమంత.. పులకింత
హన్మకొండ చౌరస్తా(వరంగల్): నగరంలో సినీ నటి సమంత సందడి చేశారు. ఓరుగుల్లు వాకిట్లో సిరి మల్లె పువ్వులాంటి నవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తూ మైమరిచిపోయారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని పోలీస్‌గ్రౌండ్స్ ఎదుట గల జీఎంఆర్అండ్ జీఎస్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ రిటైల్ విక్రయ రంగ నెంబర్ 1 సంస్థ ‘బిగ్ సీ’ 150వ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘బిగ్ సీ’ 100వ షోరూంను తానే ప్రారంభించానని, 150వ షో రూంను కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ వేగంగా విస్తరించి అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. అనంతరం ‘బిగ్ సీ’ ఫౌండర్ అండ్ సీఎండీ ఎం బాలుచౌదరి మాట్లాడుతూ రాష్రంలోని మిగతా షోరూంల మాదిరిగానే 150వ షోరూంను ఆధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దామన్నారు. మొబైల్ కొనుగోలు పై రూ.4,999 విలువ గల ట్రాలీ సూట్‌కేస్, రూ. 3590 విలువ గల సింగర్ మిక్సర్, రూ. 2999 విలువైన లోటోషూ, రూ. 1499 విలువై న ల్యాప్టా బ్యాగ్ లాంటి ఆఫర్లను అందిస్తున్నామన్నారు. -
బిగ్ ‘సి’లో ఉగాది వినూత్న ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్స్ కొనుగోళ్లపై విలువైన బహుమతులను అందిస్తున్నట్లు బిగ్ ‘సి’ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2,999 విలువగల లోటో షూస్, రూ.2,510 విలువగల సింగర్ మిక్సర్, రూ.6,990 విలువగల సింగర్ ఎయిర్‌కూలర్, రూ.1,099 విలువగల ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను బహుమతుల కింద ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. కాగా బిగ్ ‘సి’ ఉగాది ఆఫర్లను బాలీవుడ్ నటి మన్నార చోప్రా ఆవిష్కరించారు. -
బిగ్‘సి’లో రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు ఇప్పుడు ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్‘సి’లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం షావోమి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ‘బిగ్‘సి’ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్మి నోట్–4 స్మార్ట్ఫోన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బిగ్‘సి’ షోరూమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. -
స్మార్ట్ఫోన్లు ఇక తప్పనిసరి!!
• ‘బిగ్ సి’ ఫౌండర్ బాలు చౌదరి • అందరూ ఇవే అడుగుతున్నారు • డిజిటల్ పేమెంట్లే దీనికి కారణం • బేసిక్ ఫోన్ల అమ్మకాలు తగ్గాయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో స్మార్ట్‌ఫోన్ అంటే గతంలో ఫ్యాన్సీ. ఇపుడైతే తప్పనిసరి వినియోగ వస్తువుల జాబితాలో చేరిపోయిందని మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ చెబుతోంది. పెద్ద నోట్ల రద్దు తదనంతరం డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం ప్రోత్సహించడమే దీనికి కారణమని సంస్థ వ్యవస్థాపకుడు ఎం.బాలు చౌదరి చెప్పారు. ఫీచర్ ఫోన్ వినియోగదారులు పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లవైపు మళ్లుతున్నారని చెప్పారాయన. బిగ్ సి 14 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ... అమ్మకాలెలా ఉన్నాయ్? నోట్ల రద్దు ప్రభావం ఉందా? నవంబర్ 8 వరకూ బిగ్ సి స్టోర్లలో నగదు లావాదేవీల వాటా ఏకంగా 52 శాతం ఉండేది. పెద్ద నోట్ల రద్దుతో ఇపుడది 10 శాతానికి పరిమితమైంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం ఒక్కసారిగా పెరిగింది. కార్డు చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించాం. అన్ని బ్యాంకుల సహకారంతో దీన్ని అమలు చేస్తున్నాం. నవంబరు 9 నుంచి వారం రోజులు మాత్రం అమ్మకాల్లో ఏకంగా 60శాతం తగ్గుదల కనిపించింది. డిసెంబర్ నుంచి అమ్మకాలు మళ్లీ గాడిలో పడ్డాయి. డిజిటల్ రూపంలో నగదు స్వీకరించాలన్నా, చెల్లించాలన్నా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండితీరాలి. చిన్న చిన్న వర్తకులు కూడా డిజిటల్ పేమెంట్లకు ఓకే అంటున్నారు. నోట్ల రద్దుతో మొబైల్ ఫోన్ల రంగంలో కొత్త అవకాశాలొస్తున్నాయి. ఇవి పెరుగుతున్నాయంటే ఫీచర్ ఫోన్ల విక్రయాలు తగ్గి ఉండాలిగా? నిజమే! మూడేళ్ల కిందట మా అమ్మకాల్లో ఫీచర్ ఫోన్ల వాటా 55 శాతం. రెండు నెలల కిందటి వరకూ 50 శాతంగా ఉండేది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత నెల రోజుల్లోనే ఈ వాటా 40 శాతానికి తగ్గిపోయింది. కస్టమర్లు స్మార్ట్ఫోన్లవైపు మొగ్గటమే దీనికి కారణం. మరోవైపు సగటు స్మార్ట్‌ఫోన్ విక్రయ ధర రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. మొత్తం అమ్మకాల్లో రూ.3–12 వేల ధరల శ్రేణి సింహ భాగం కైవసం చేసుకుంది. టెలికం కంపెనీల పోటీతో డేటా చార్జీలు దిగిరావడం, రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్ కూడా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరగటానికి కారణమయ్యాయి. అమ్ముడు పోతున్నవన్నీ 4జీ ఫోన్లే. మరి ఆన్లైన్లో కూడా ఫోన్లు చౌకగా దొరుకుతున్నాయి కదా? అదేం లేదు. ఫండింగ్ వచ్చినంత కాలం ఈ–కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. నిధుల రాక ఆగిపోవడం, ప్రభుత్వ నియంత్రణలతో ఇప్పుడివి డిస్కౌంట్లను మానేశాయి. వాటి నిర్వహణ ఖర్చులు పెరుగుతూ ఉండటంతో... ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్‌లోనే ఉత్పత్తుల ధర తక్కువగా ఉంది. అందుకే కస్టమర్లు స్టోర్లకు వస్తున్నారు. ఏ కారణాలతో ఇంత వృద్ధి సాధ్యమైందని భావిస్తున్నారు? మా సిబ్బందిని, కస్టమర్లను ఇద్దరినీ గుర్తించడమే మా విజయానికి మూలం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టోర్ మేనేజర్లను ఈ మధ్య బ్యాంకాక్‌లో సన్మానించాం. స్టోర్ మేనేజర్ స్థాయి ఉద్యోగుల్ని విదేశాలకు తీసుకు వెళ్లడమనేది దేశీ రిటైల్‌లో ఇదే తొలిసారి. ఇక కస్టమర్లకు బహుమతులందించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి దసరావళి విక్రయాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేశాం. -
దసరా ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేసిన బిగ్‌సి
-
బిగ్ ‘సి’లో రూ.3 కోట్ల బహుమతులు
సాక్షి, హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ దసరా, దీపావళి పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్ కొనుగోలుపై దాదాపు రూ.3 కోట్ల విలువైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఎండీ బాలు చౌదరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం తమ సంస్థ ఆనవాయితీ అని, ఇంత పెద్ద మొత్తంలో బహుమతులందించడం మొబైల్ వ్యాపార రంగంలో ఓ సంచలనమని పేర్కొన్నారు. -
‘బిగ్ సి’ ప్రచారకర్తగా రకుల్..
మార్చి నాటికి 150 స్టోర్లు * బిగ్ సి ఫౌండర్ బాలు చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ తార రకుల్‌ప్రీత్ సింగ్‌ను నియమించుకుంది. దేశంలో మొబైల్ రిటైల్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునే ట్రెండ్ తమతోనే ప్రారంభమైందని ఈ సందర్భంగా బిగ్ సి వ్యవస్థాపకులు బాలు చౌదరి తెలిపారు. 2006లో సినీ తార చార్మితో మొదలై కాజల్, ఇలియానా, సమంత, శృతిహాసన్‌లు ప్రచార కర్తలుగా వ్యవహరించారని గుర్తు చేశారు. కొత్త అంబాసిడర్‌ను ప్రకటించేందుకు ఆదివారం ఏర్పాటైన సమావేశంలో డెరైక్టర్లు స్వప్నకుమార్, కృష్ణపవన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అందుబాటు ధర, విక్రయానంతర సేవలు, కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించడం వల్లే 14 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నామని అన్నారు. కస్టమర్ల సంఖ్య 4 కోట్లు దాటిందని వెల్లడించారు. మొబైల్స్ విక్రయంలో సుస్థిర స్థానమున్న బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని రకుల్ అన్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా 4జీ స్మార్ట్‌ఫోన్..: బిగ్ సి స్టోర్లలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో 90% 4జీ మోడళ్లు ఉంటున్నాయి. దీంతో నెలాఖరుకల్లా రూ.2,999 ధరలో 4జీ మోడల్‌ను బిగ్ సి ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ప్రముఖ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు బాలు చౌదరి చెప్పారు. ప్రస్తుతం 118 స్టోర్లున్నాయని, వీటిని మార్చికల్లా 150కి చేర్చుతామన్నారు. ఇక సంస్థ ఆదాయంలో చైనా బ్రాండ్ల వాటా 25%. 3-6 నెలల్లో ఇది 50%కి చేరుతుందని, ఫోన్ల నాణ్యతే ఇందుకు కారణమని చెప్పారు. పండుగల సీజన్లో రెండింతల అమ్మకాలు నమోదవుతాయని ధీమా వ్యక్తం చేశారు. -
శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు బిగ్ సి ఆడ్వాన్స్ బుకింగ్ ఆఫర్
హైదరాబాద్: శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ మొబైల్స్‌కు బిగ్ సి అడ్వాన్స్ బుకింగ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్లకు అడ్వాన్స్ బుకింగ్‌లను ఈ నెల 8 నుంచి ప్రారంభించామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17 వరకూ ఈ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ ఉంటుందని బిగ్ సి సీఎండి బాలు చౌదరి పేర్కొన్నారు. రూ.2,000 చెల్లించి ఈ ఫోన్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవచ్చని, రూ.7,999 విలువ గల శాంసంగ్ ‘గేర్ వీ ఆర్’ను ఉచితంగా అందిస్తామని వివరించారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని బిగ్ సి షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. -
బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్ సి తమ షోరూమ్‌లలో ‘శామ్సంగ్ గెలాక్సీ నోట్ 5’ మొబైళ్లను కొనుగోలు చేసిన వినియోగదారుల కోసం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్ధ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బాలు చౌదరి మాట్లాడుతూ... తమ కస్టమర్ల సంతోషం కోసం ఎప్పటికప్పుడు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తూ.. వారికి బహుమతులను అందిస్తున్నామని... అందులోభాగంగానే ఇప్పుడు వినూత్నంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. -
బిగ్‌సి ‘స్క్రాచ్ అండ్ విన్’ విజేతకు కారు బహుమతి
ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సి, శామ్సంగ్ సంయుక్త ‘స్క్రాచ్ అండ్ విన్’ ఆఫర్ విజేతకు మారుతి సెలేరియో కారు బహుమతి ప్రదానం హైదరాబాద్‌లో జరిగింది. కారు తాళాన్ని బిగ్ సి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బాలు చౌదరి, సినీ నటి చార్మీ విజేతకు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ స్వప్న కుమార్, డెరైక్టర్ క్రిష్ణపవన్, శామ్సంగ్ ప్రతినిధులు మోహన్‌దీప్ సింగ్ (ఆల్ ఇండియా సేల్స్ హెడ్), రాజు పుల్లన్ (ఎస్ఓపీ అండ్ సప్లై చైన్ హెడ్) దీపక్ నక్రా (మోడరన్ ట్రేడ్ హెడ్) తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బిగ్‌సీ మేనేజరే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో దోపిడీ దొంగల కాల్పుల వెనుక కొత్త కోణం బయటకొచ్చింది! ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది బిగ్సీలోనే పనిచేస్తున్న మేనేజర్ మహమ్మద్ సమీయుద్దీనేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గుల్బర్గాలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన మీర్జా మహమ్మద్ అబ్లుల్లా బేగ్ అలియాస్ ఫహీమ్ మీర్జాతో ఏడేళ్ల క్రితం టోలిచౌకివాసి సమీయుద్దీన్‌కు పరిచయం ఏర్పడింది. బిగ్‌సీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సమీయుద్దీన్... కార్యాలయం నుంచి రోజూ లక్షలాది రూపాయలను క్యాష్ కలెక్షన్ బాయ్స్ తీసుకువెళ్తుండడం గమనించాడు. ఈ విషయాన్ని ఫహీమ్ మీర్జాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో మీర్జా.. తన స్నేహితులు అబ్దుల్ ఖదీర్, సలీమ్‌తో కలిసి ఈనెల 17న గుల్బర్గా నుంచి హైదరాబాద్ వచ్చాడు. రెండు దేశవాళీ తుపాకులు, పది రౌండ్లతో నగరానికి వచ్చి సమీయుద్దీన్ ఇంట్లో మకాం పెట్టారు. మీర్జా, ఖదీర్‌లు ద్విచక్ర వాహనంపై మాదాపూర్‌లోని బిగ్‌సీ ముందు రెక్కీ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, వారి కుట్రను భగ్నం చేశారు. గురువారం నాటి కాల్పుల్లో గాయపడిన మెట్రో కూలీ ధర్మేందర్‌సింగ్ ప్రాణానికి ముప్పు లేదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. బీదర్‌లో జైల్లో ఉన్న సమయంలో నేరస్తులతో ఏర్పడిన పరిచయంతో మధ్యప్రదేశ్ నుంచి ఈ తుపాకులను కొనుగోలు చేశారని వివరించారు. ఫహీమ్ మీర్జాపై ఇప్పటికే నగరంలో ఆరుకుపైగా కేసులు, గుల్బార్గాలో నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఓ కన్నేసి ఉంచండి.. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులే దోపిడీ దొంగలతో కలిసి పనిచేస్తున్న సంస్థకే కన్నెం వేస్తున్నారని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ప్రవర్తనతో పాటు వారి కదలికలపై నిఘా వేసి ఉంచడంవల్ల ఇలాంటి ఘటనలు ఆపవచ్చన్నారు. పోలీసులకు రివార్డులు ఈ ఆపరేషన్‌ను చాకచాక్యంగా నిర్వహించిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, ఎస్సైలు జలేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, మల్లికార్జున్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు జీషన్, వినయ్‌తో పాటు అతడి టీంను పోలీసు కమిషనర్ రివార్డులతో సన్మానించారు. -
బిగ్ సి లో శామ్సంగ్
ఎస్6 ప్రి-బుకింగ్ ప్రయోజనాలు హైదరాబాద్: బిగ్ సి షోరూమ్‌లలో శామ్సంగ్ ఎస్6, ఎస్6 ఎడ్జ్ మొబైల్స్ ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ప్రి-బుకింగ్ ప్రయోజనాలను అందిస్తున్నట్లు ఆ సంస్ధ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు నెలల పాటు ప్రి-బుక్ ప్రివిలేజెస్, 10,000 పేబ్యాక్ పాయింట్లు, వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ వంటి ప్రయోజనాలను ప్రి-బుకింగ్ కస్టమర్లకు అందిస్తామని బిగ్ సి చైర్మన్ యం.బాలు చౌదరి తెలిపారు. అలాగే ఫోన్ల కొనుగోలుకు అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులపై రుణ సదుపాయాన్ని క ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని బజాబ్ ఫైనాన్స్ కూడా అందిస్తోందని తెలిపారు. -
బిగ్‌సీలో 12వ వార్షికోత్సవ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: 12వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్లను కస్టమర్లకు అందిస్తున్నామని బిగ్‌సీ చైర్మన్ బాలు చౌదరి పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని బిగ్‌సీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ విక్రయదారులతో పోల్చితే తమ షోరూమ్‌లలో తక్కువ ధరలకే మొబైల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మొబైల్ ఫోన్లపై 2 సంవత్సరాల వరకు వారంటీ, ఇన్సూరెన్స్ సదుపాయాలను బిగ్‌సీ అందిస్తోందన్నారు. కస్టమర్‌కు తాను కొనుగోలు చేసిన మొబైల్ నచ్చకపోతే 15 రోజులలోగా ఆ మొబైల్‌ను వెనక్కు ఇచ్చి మరో మొబైల్‌ను తీసుకునే వినూత్న సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా మొబైల్స్ కొనుగోలుపై 50 శాతం వరకు డిస్కౌంట్, ఒకటి కొంటే మరోటి ఉచితం, ఒకటి కొంటే రెండు ఉచితం, స్మార్ట్ ఆఫర్స్, మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు వివరించారు. ఆఫర్లలో కొన్ని... ⇒రూ.7,199 విలువగల నోకియా ల్యూమియా మొబైల్ కొనుగోలుపై రూ.2,000 విలువగల రెండు ఫీచర్ ఫోన్లూ ఉచితం. ⇒నోకియా ల్యుమియా 630 మొబైల్ కొనుగోలుపై రూ.2,000 విలువగల పవర్‌బ్యాంక్ మరియు శామ్సంగ్ బ్లూటూత్ ఉచితం. ⇒సెల్కాన్ క్యూ455 మొబైల్ కొనుగోలుపై రూ.1000 విలువగల శామ్సంగ్ బ్లూటూత్ ఉచితం. -
బిగ్ సిలో ఐఫోన్ 6పై ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ, బిగ్ సి లో యాపిల్ ఐఫోన్, ఐఫోన్6లకు ముందస్తు బుకింగ్ జరుగుతోంది. తమ షోరూమ్‌ల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.6,000 విలువ గల ప్రయోజనాలను అందించనున్నామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. బుకింగ్ చేసుకున్న వారికి ఈ నెల 17 నుంచి ఫోన్లను డెలివరీ చేస్తామని బిగ్ సి చైర్మన్ ఎం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఫోన్ కొనుగోళ్లపై రెండు సంవత్సరాల పాటు ఉండే వారంటీ, బీమా ఉచితంగా అందిస్తామని, వీటి విలువ రూ.6,000 వరకూ ఉంటుందని వివరించారు.. వినూత్నమైన ఆఫర్లను అందిస్తూ, వినియోగదారులను ఆకట్టుకోవడంలో తమది ప్రత్యేక స్థానమని, గతంలో తామందించిన అన్ని ఆఫర్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. తమ షోరూమ్‌ల్లో యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను కొనుగోలు చేసి రూ.6,000 విలువ చేసే ఉచిత ప్రయోజనాలను అందుకోవాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్ర మార్కెట్లోకి నోకియా లూమియా 1320
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ఫోన్ల తయారీ సంస్థ నోకియా రాష్ట్ర మార్కెట్లోకి లూమియా 1320 మోడల్‌ను విడుదల చేసింది. సోమవారం ఇక్కడి బేగంపేట బిగ్ సి షోరూంలో సినీ తార సమంత ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. బిగ్ సి షోరూంలో లూమియా 1320 ధర రూ.23,999. రూ.2 వేల విలువైన బహుమతులు కూడా పొందవచ్చు. నెలకు రూ.3,999 చొప్పున ఆరు వాయిదాల్లో, 0% వడ్డీతో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని బిగ్ సి చైర్మన్ యం.బాలు చౌదరి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్‌గా పేరున్న నోకియా తన నూతన మోడల్‌ను బిగ్ సి ద్వారా ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. 11 ఏళ్ల విజయప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం బిగ్ సి ఔట్లెట్ల సంఖ్య 121. ఇందులో 50 లైవ్ స్టోర్లున్నాయని తెలిపారు. దశలవారీగా మిగిలిన ఔట్లెట్లలో లైవ్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తామన్నారు. లైవ్ స్టోర్లలో డమ్మీకి బదులుగా అసలైన ఫోన్లను డిస్ప్లే చేస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా స్టోర్ల సంఖ్యను 150కి చేరుస్తామని వెల్లడించారు. 2012-13లో రూ.550 కోట్ల వ్యాపారం చేశామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్లు ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. నెలకు 1.50 లక్షల ఫోన్లను బిగ్‌సి విక్రయిస్తోంది. -
విశాఖలో బిగ్ ‘సి’ నూతన షోరూమ్
విశాఖ: రాష్ట్ర మొబైల్స్ విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ బిగ్ ‘సి’ వైజాగ్ డాబా గార్డెన్స్‌లో తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ శనివారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో జరిగిన బిగ్ ‘సి’ 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ డెరైక్టర్ వై. స్వప్న కుమార్ మాట్లాడుతూ, డాబా గార్డెన్స్‌లో ఇది తమ 2వ షోరూమ్ అని అన్నారు. 2000 చదరపు అడుగుల విశాలమైన తమ ఈ తాజా షోరూమ్‌ను వరల్డ్ క్లాస్ లైవ్ ఎక్స్పీరియన్స్ షోరూమ్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. 50కిపైగా మొబైల్స్ లైవ్ డెమోను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. కస్టమర్ల విశ్వాసం, ఆదరణే తమ ఈ 11 వసంతాల విజయ ప్రస్థానానికి ప్రధాన కారణమని అన్నారు. అందుకే ఈ 11వ వార్షికోత్సవ సందర్భంలో కస్టమర్ల కోసం 11 ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టామని వివరించారు. సినీతార శ్రీయ మాట్లాడుతూ, అందుబాటు ధరల్లోనే అధునాతన ఫీచర్ల మొబైల్స్‌ను ప్రజలకు అందించడం హర్షణీయమన్నారు. -
బిగ్-సి అతిపెద్ద లైవ్ షోరూం ప్రారంభం
హైదరాబాద్: మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ బిగ్ ‘సి’ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద షోరూంను నెలకొల్పింది. సినీ తార చార్మి చేతుల మీదుగా శనివారం ఈ షోరూం ప్రారంభమైంది. 100కు పైగా మొబైల్ ఫోన్ల లైవ్ డెమో ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున లైవ్ డెమో ఏర్పాటు చేయడం మొబైల్స్ రంగంలో తొలిసారి అని బిగ్ ‘సి’ చైర్మన్ యం.బాలు చౌదరి తెలి పారు. ఈ సందర్భంగా 20 శాతం వరకు క్యాష్ బ్యాక్, ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లను అందిస్తున్నట్టు చెప్పారు. అన్ని కంపెనీల మొబైల్స్‌తోపాటు ఐఫోన్ 5ఎస్ కూడా షోరూంలో లభిస్తుందని వివరించారు. మొబైల్ ఫోన్ల రిటైల్ రంగంలో 125 స్టోర్లతో బిగ్ ‘సి’ తొలి స్థానాన్ని కొనసాగిస్తోందని పేర్కొ న్నారు. అందుబాటు ధరల్లో మొబైల్స్ అందించడంతోపాటు ప్రతీ పండుగ, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బిగ్ ‘సి’ వినూత్న ఆఫర్లను ప్రకటించడం అభినందనీయమని చార్మి అన్నారు. -
బిగ్ సి దసరా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ బిగ్ సి ఐదో బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీతార శృతి హాసన్ నియమితులయ్యారు. దసరా సందర్భంగా పండుగ ఆఫర్లుగా క్యాష్ బ్యాక్, ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్లను ఆమె ఆవిష్కరించారని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. బ్రాండ్ అంబాసిడర్‌గా శృతి హాసన్ నియామకంతో తమ అమ్మకాలు మరింతగా పెరుగుతాయన్న ఆశాభావాన్ని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి వ్యక్తం చేశారు. బిగ్ సి అందిస్తున్న ఆఫర్లను వినియోగించుకోవాలని శృతి హాసన్ పేర్కొన్నారు. మొత్తం 102 బిగ్ సి షోరూమ్‌లు ఉన్నాయని, వీటిల్లో 30 షోరూమ్‌లను ఆధునీకీకరించి, లైవ్ షోరూమ్‌లుగా తీర్చిదిద్దామని బాలు చౌదరి వివరించారు. ప్రతి పండుగకు బిగ్ సి ప్రత్యేక ఆఫర్లనందిస్తోందని, అదే తరహాలో ఈ దసరాకు కూడా వినూత్నమైన ఆఫర్లనందిస్తున్నామని బాలు చౌదరి పేర్కొన్నారు.