
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్‘సి’ తాజాగా నోకియా–8 సిరాకో, నోకియా–7 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను వినియోగదారుల కోసం తన ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంచింది. హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న బిగ్‘సి’ షోరూమ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ ఫౌండర్, సీఎండీ యం.బాలు చౌదరి, సినీ నటి అను ఇమ్మాన్యుయెల్, హెచ్‌ఎండీ గ్లోబల్ జనరల్ మేనేజర్ (దక్షిణ ప్రాంతం) టి.ఎస్.శ్రీధర్ ఈ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ఈ మొబైల్ హ్యాండ్‌సెట్స్ కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చని బాలు చౌదరి తెలిపారు. అలాగే ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రిబుక్ చేసుకున్నవారికి 10 శాతం క్యాష్‌బ్యాక్, మేక్‌మైట్రిప్ ద్వారా 25 శాతం డిస్కౌంట్‌తోపాటు రూ.3,999 విలువైన ఐ–బాల్ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment