బిగ్ సి లో శామ్‌సంగ్
ఎస్6 ప్రి-బుకింగ్ ప్రయోజనాలు
హైదరాబాద్: బిగ్ సి షోరూమ్‌లలో శామ్‌సంగ్ ఎస్6, ఎస్6 ఎడ్జ్ మొబైల్స్ ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ప్రి-బుకింగ్ ప్రయోజనాలను అందిస్తున్నట్లు ఆ సంస్ధ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు నెలల పాటు ప్రి-బుక్ ప్రివిలేజెస్, 10,000 పేబ్యాక్ పాయింట్లు, వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వంటి ప్రయోజనాలను ప్రి-బుకింగ్ కస్టమర్లకు అందిస్తామని బిగ్ సి చైర్మన్ యం.బాలు చౌదరి తెలిపారు.
అలాగే ఫోన్ల కొనుగోలుకు అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులపై రుణ సదుపాయాన్ని క ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని బజాబ్ ఫైనాన్స్ కూడా అందిస్తోందని తెలిపారు.