Pre-booking
-
జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10న ముఖేష్ అంబానీ మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ కొనేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్‌కి సంబంధించి డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఫోన్‌కి ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆరోజు చెప్పిన ముఖేష్ జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్ ఫీచర్లు, కాస్ట్ ఎంత అనే అంశాలపై ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు మొబైల్‌మార్కెట్ ఎక్స్పర్ట్స్ దృవీకరించారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయి 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. జియో మార్కెట్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్-2021 లెక్కల ప్రకారం.. మే 2021 నాటికి జియో యూజర్లు 431,23 మిలియన్ల యూజర్లతో ప్రథమస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో 189.49 మిలియన్లతో ఎయిర్ టెల్ , 119.63 మిలియన్లతో వొడాఫోన్ - ఐడియా, 16.44 మిలియన్ యూజర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే టెలికాం రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న జియో యూజర్లను పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ గూగుల్‌తో కలిసి ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది. -
Samsung: ఈ స్మార్ట్‌ఫోన్ ప్రి-బుక్ చేస్తే స్మార్ట్‌ట్యాగ్ ఉచితం...!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. కొద్ది రోజుల్లోనే శాంసంగ్ భారత మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లలోకి ఆగస్టు 11 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ బుకింగ్‌ను నేటి (ఆగస్టు 6) నుంచి ప్రారంభం కానుంది. ఫ్రీ బుకింగ్ కోసం కస్టమర్లు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్లలో లేదా శాంసంగ్ షాప్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు శాంసంగ్ ఉచితంగా శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ను అందించనుంది. మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్‌ట్యాగ్ ధర రూ. 2,699 గా ఉంది. రెండువేలతో ప్రీ బుక్ చేసుకున్న అమౌంట్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో అడ్జస్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధర రూ. 1,49,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ధరలు నిజమైతే మునుపటి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకంటే తక్కువ ధరలు ఉండనున్నాయి. -
వన్‌ప్లస్ 6 ఫీచర్లు లీక్: మే 21నుంచి ప్రీ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6కి సంబంధించిన ఫీచర్లు మరోసారి ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన స్మార్ట్ బై ఆఫర్స్ వెబ్ పేజీలో వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్లు దర్శనమిచ్చాయి. దీని ప్రకారం వన్ ప్లస్ 6 లో కింది ఫీచర్లు ఉండనున్నాయి. 5.7 ఇంచ్ డిస్ప్లే 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 23ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వన్‌ప్లస్ 6 ను ఈ నెల16న లండన్‌లోనూ 17వ తేదీన చైనాతోపాటు ఒకేసారి భారత్‌లోనూ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రి బుకింగ్స్ మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. -
జియో కస్టమర్లకు దసరా సంబరాలు
ముంబై: సంచలన రిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ నవరాత్రికి కస్టమర్లను మురిపించనుంది. జియో వినియోగదారులు తన మొదటి ఫీచర్‌ఫోన్‌తో ఈ ఏడాది దసరా సంబరాలను జరుపుకునేలా ప్లాన్ చేసింది. ప్రీ బుకింగ్ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మరోగుడ్ న్యూస్ ఏమిటంటే. త్వరలోనే కొత్త ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో ఫోన్ కోసం ఆగస్టు 24 న ముందస్తు బుకింగ్ మొదలుకాగా కేవలం మూడు గంల్లోనే సుమారు 60 లక్షల యూనిట్ల జయో ఫీచర్ ఫోన్లు బుక్ అయ్యాయి. దీంతో బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే వినియోగదారుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ పునఃప్రారంభించనుందని, ఈ సమాచారాన్ని కస్టమర్లకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ప్రాధాన్యత ఆధారంగా వీటిని అందించనుంది. కాగా జూలై 21, 2017 న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
బిగ్ సి లో శామ్సంగ్
ఎస్6 ప్రి-బుకింగ్ ప్రయోజనాలు హైదరాబాద్: బిగ్ సి షోరూమ్‌లలో శామ్సంగ్ ఎస్6, ఎస్6 ఎడ్జ్ మొబైల్స్ ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ప్రి-బుకింగ్ ప్రయోజనాలను అందిస్తున్నట్లు ఆ సంస్ధ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు నెలల పాటు ప్రి-బుక్ ప్రివిలేజెస్, 10,000 పేబ్యాక్ పాయింట్లు, వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ వంటి ప్రయోజనాలను ప్రి-బుకింగ్ కస్టమర్లకు అందిస్తామని బిగ్ సి చైర్మన్ యం.బాలు చౌదరి తెలిపారు. అలాగే ఫోన్ల కొనుగోలుకు అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులపై రుణ సదుపాయాన్ని క ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని బజాబ్ ఫైనాన్స్ కూడా అందిస్తోందని తెలిపారు.